Sunday 2 January 2022

నేటి నుంచి టీనేజర్లకు టీకా : రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మందికి వ్యాక్సిన్ లక్ష్యం

నేటి నుంచి టీనేజర్లకు టీకా : రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మందికి వ్యాక్సిన్ లక్ష్యం



రాష్ట్రవ్యాప్తంగా టీనేజర్లకు టీకా వేసేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. దేశంలో క రోనా మరోసారి ఒమిక్రాన్ రూపంలో విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో కోవిడ్ నుంచి టీనేజర్లకు రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం 15 నుంచి 18 ఏళ్ల యుక్త వయస్కులకు టీకా వేసేందుకు మార్గ దర్శకాలను జారీ చేసింది. దీనిలో భాగంగా సోమవారం నుంచి రాష్ట్రంలో టీనేజర్లకు వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. టీనేజర్లకు కోవిడ్ వ్యాక్సిన్ వేసేందుకు వైద్యారోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. సోమవారం నుంచి ఈ నెల 7వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా టీనేజర్ల కోసం స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ను నిర్వహించనుంది. రాష్ట్రవ్యాప్తంగా 19 లక్షల మంది. ఏఎన్ఎంలతో పాటు ఆశా వర్కర్లు, వలంటీర్లు బృందాలుగా ఏర్పడి ఈ ప్రక్రియను నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని సచివాలయాల పరిధిలో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. వ్యాక్సి నేషన్ బృందాలు ఇంటింటికీ తిరిగి 15 నుంచి 18 ఏళ్ల టీనేజర్లకు కోవిడ్ టీకాను వేయనున్నారు. మొత్తం 25 లక్షల మంది టీనేజర్లకు కోవ్యాగ్జిన్ టీకాను వేసేందుకు అన్ని ఏర్పాట్లను వైద్య ఆరోగ్య శాఖ పూర్తి చేసింది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం కావడంతో అనేక మంది కోవిన్ పోర్టల్ లో పేర్లు నమోదు చేసుకున్నారు. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారితో పాటు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి టీకా వేసుకునే వెసులుబాటు కల్పించారు. కేంద్ర మార్గదర్శకాలతో పాటు డీజీసీఐ సిఫార్సుల మేరకు కేవలం కోవ్యాగ్జిన్ డోసును మాత్రమే టీనేజర్లకు ఇవ్వనున్నారు. దీనికోసం ఇప్ప అన్ని జిల్లా మొత్తం 40 లక్షల కోవ్యాగ్జిన్ దోసులను వైద్య ఆరోగ్య శాఖ పంపిణీ చేసింది. అలాగే ఈ నెల 10వ తేదీ నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్స్తో పాటు హెల్త్ కేర్ వర్కర్లకు, 60 ఏళ్లు పైబడి రెండు డోసులు పూర్తి చేసుకుని 9 నెలలు పూర్తి అయిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు బూస్టర్ డోస్ను ఇవ్వనున్నారు. టీనేజర్ల వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తి అయిన వెంటనే వీరి కోసం మరో స్పెషల్ డ్రైవ్ను వైద్యారోగ్య శాఖ చేపట్టనుంది. దాదాపు 14 లక్షల మందికి బూస్టర్ డోస్ ను ఇవ్వనున్నారు.

తొలి డోస్ 100 శాతం :

ఇదిలా ఉంటే కరోనా వ్యాక్సినేషన్లో రాష్ట్రం మరో ఘనతను సాధించింది. రాష్ట్ర వ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారందరికీ 100 శాతం టీకా వేసి రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3.95 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయడం పూర్తి అయింది. మరోవైపు 75 శాతం మందికి రెండు డోసులు టీకాను పూర్తి చేసిన వైద్య ఆరోగ్య శాఖ 100 శాతం లక్ష్యాన్ని పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ నెలాఖరు నాటికి 100 శాతం రెండు డోసులు వేసేందుకు స్పెషల్ డ్రైవ్లను చేపట్టనుంది.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top