జనవరి 28 నుంచి సమ్మెటీవ్ పరీక్షలు-1
పాఠశాల విద్యార్థులకు సమ్మెటీవ్ పరీక్షలు(ఎస్‌ఎ)-1 ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు షెడ్యూల్‌ను ఎస్‌సిఇఆర్‌టి డైరెక్టర్ బి ప్రతాప్ రెడ్డి శనివారం విడుదల చేశారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులు 1 నుంచి 5వ తరగతి వరకు ఈ నెల 28,29,31 తేదిల్లో . ఉదయం 10 నుంచి మధ్యాహుం 12.30 వరకుపరీక్షలు జరగనున్నాయి. ఉన్నత పాఠశాల విద్యార్థులకు 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఉదయం, మధ్యాహ్నం రెండుపూటలా జరుగుతాయి. ఉదయం 10 నుంచి 12.45 గంటల వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు రెండో పేపర్ జరుగుతాయి.
0 Post a Comment:
Post a Comment