Compasinate appointment ఇవ్వాలి అంటే లోకల్ - నాన్ లోకల్ చూడాలా? భర్త నల్గొండ. భార్య వేరే జిల్లా. ప్రస్తుతం నల్గొండలో స్థిర పడ్డారు. భార్య కు నల్గొండలో ఉద్యోగం ఇవ్వవచ్చునా ?
తప్పకుండా చూడాలి. జిల్లా స్థాయి పోస్టులన్నీ Presidential Order కు లోబడే ఉంటాయి. ఇందులో 20 శాతం నాన్ లోకల్స్ కు కూడా ఇవ్వవచ్చు. ఆఫీసు రికార్డు పరిశీలించి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది.
పిల్లలకు ఇవ్వాలంటే తప్పనిసరిగా వారి ఎడ్యుకేషన్ ని బట్టి ఏ ప్రాంటానికి లోకల్ అవుతారో అక్కడే ఇవ్వాలి.
ఒకవేళ భార్యకి ఇచ్చేటట్లయితే వారు కోరుకునే దానిని బట్టి భర్త చివరగా పని చేసిన యూనిట్ లో లేదా ఎడ్యుకేషన్ ని బట్టి లోకల్ లో ఎక్కడైనా ఇవ్వవచ్చు.
0 Post a Comment:
Post a Comment