ఆన్ లైన్ బోధనపై అసంతృప్తి - 43 శాతం మంది టీచర్లు అనాసక్తి
పిల్లల చదువులో తల్లిదండ్రుల ప్రమేయం ఉండాల్సిందే
ఢిల్లీ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ జర్నల్ వెల్లడి
మహమ్మారి సమయంలో ఆన్లైన్ విద్యా బోధనపై టీచర్ల అభి ప్రాయాన్ని తెలుసు కునేందుకు ఢిల్లీ బాలల హక్కుల సంరక్షణ కమిషన్ సర్వే నిర్వహించింది. అధ్యాపకుల అభిప్రాయాలను, తెలుపుతూ చిల్డ్రన్ ఫస్ట్: జర్నల్ ఆన్ చిల్డ్రన్స్ లైవ్స్ పేరుతో జర్నల్ విడుదల చేసింది. ఈ సర్వేలో 43 శాతం మంది టీచర్లు మహమ్మారి సమయంలో ఆన్లైన్ విద్యాబోధన పట్ల అనం న పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు పేర్కొంది. 9శాతం మంది పూర్తిగా ఈ రకమైన బోధన చింది. ఆన్లైన్ బోధన సమయంలో పట్ల అనాసక్తిని కనబరిచినట్లు వెల్లడిం ముఖ్యమైన సమస్యలను వారు ప్రసా వించినట్లు తెలిపింది. పిల్లల గైర్హాజరు (14శాతం). ప్రత్యేక అవసరాలను పరిగణనలోకి తీసుకోకపోవడం(21 శాతం), విద్యార్థులు శ్రద్ధ చూపించ కపోవడం(28 శాతం), పిల్లల భావోద్వేగ విషయాల ప్రస్తావన (19 శాతం), ఇచ్చిన పనిని పిల్లలు పూర్తి చేయకపోవడం (10 శాతం) వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. ప్రధానంగా పాఠశాల విద్యలో పిల్లల విషయాల్లో తల్లిదండ్రుల ప్రమేయం తప్పనిసరిగా ఉండాలని, ఉపా ధ్యాయులు నొక్కి చెప్పారు. ఆన్లైన్ తరగతుల ద్వారా పాఠశాల కార్యక్ర మాలు, మిత్రులను కలవడం, వేడుకలు, స్నేహాన్ని "కోల్పోయామని విద్యార్థులు వెల్లడించారు. ఆన్లైన్ విధానం విజయవంతం కావాలంటే కొన్ని తప్పనిసరి అని చివరకు సర్వే తేల్చింది. డిజిటల్ ఫ్లాట్ఫాంల లభ్యత, పాఠ్యాంశాలు, బోధన శాస్త్రాల అవసరం, అభ్యాస కమ్యూనిటీ కోసం తగినంత సామర్ధ్యాన్ని నిర్మించడం వాటిలో ఉన్నాయి. ఈ సర్వేలో 220 పాఠశాల అధ్యాపకులతో పాటు విద్యార్థులు పాల్గొన్నట్లు జర్నల్ పేర్కొంది.
0 Post a Comment:
Post a Comment