Wednesday, 2 June 2021

ఆక్సిజన్ ఎందుకు తగ్గుతుంది...? ఆక్సిజన్ ను బయటనుంచి ఎందుకు ఇవ్వాలి...?

 ఆక్సిజన్ ఎందుకు తగ్గుతుంది...? ఆక్సిజన్ ను బయటనుంచి ఎందుకు ఇవ్వాలి...?
ఐదు శాతం కరోనా పేషంట్లలో ఆక్సిజన్ తగ్గటానికి కారణం మైక్రో థ్రోంబై. అంటే కంటికి కనిపించనంత చిన్నటి రక్తం ముద్దలు. 


1. ఆక్సిజన్ ఎందుకు తగ్గుతుంది...?

రక్త కణాలు ఒకదానిపై ఒకటి అతుక్కుపోయి ముద్దగా ఏర్పడటాన్ని థ్రాంబస్ అంటారు. అది కంటికి కనిపించేంత పెద్దగా ఒక రక్తనాళంలో ఏర్పడినపుడు ఆ రక్తనాళానికి అడ్డంగా పడి రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. హార్ట్ అటాక్ లో అలాగే పక్షవాతంలో జరిగేది ఇదే. పెద్ద థ్రాంబస్ ఒకటి గుండె రక్త నాళంలో చేరితే హార్ట్ అటాక్ అలాగే మెదడు రక్తనాళాల్లో ఏర్పడితే బ్రెయిన్ స్ట్రోక్ (పక్షవాతం) వస్తుంది.

కానీ కరోనాలో ఇలాంటి రక్తపు ముద్దలు చాలా చిన్నవిగా మైక్రో సైజులో ఉంటాయి. ఇవి చిన్న రక్తనాళాల్లో అడ్డుపడతాయి. 

మన శ్వాస సరిగా జరగాలంటే శ్వాసను నడిపించే కండరాలు ఉంటాయి. ఈ కండరాలలో కూడా ఈ రక్తపు ముద్దలు చేరి ఆ కండరాలకు రక్త సరఫరాలో అంతరాయం కలిగిస్తాయి. అందువలన అవి సరిగ్గా పనిచేయలేవు. 

అంతే కాకుండా ఊపిరితిత్తుల చుట్టూ  చిన్న చిన్న రక్తనాళాలు ఒక జాలిలా చుట్ట చుట్టుకుని ఉంటాయి.  (capillaries) గాలిలో ఉండే ఆక్సిజను ఇక్కడే రక్తంలోకి చేరేది. ఈ కాపిల్లరీలలో కూడా మైక్రో థ్రోంబై అంటే సన్నటి రక్తపు ముద్దలు ఏర్పడతాయి. అందువలన పీల్చుకున్న గాలిలోని ఆక్సిజను రక్తంలో చేరకుండా ఈ మైక్రో థ్రోంబై అడ్డుపడతాయి.

ఈ రెండు కారణాలవలన ఆక్సిజన్ శాతం పడిపోతుంది. ఏ కారణం వలన ఆక్సిజన్ పడిపోతుందో తెలిస్తేనే దానికి ట్రీట్మెంట్ ఇవ్వగలిగే సామర్థ్యం ఉంటుంది. తెలియకుండా చికిత్స చేసేది అంటూ ఏమీ ఉండదం.

2. ఆక్సిజన్ ను బయటనుంచి ఎందుకు ఇవ్వాలి...?

ఎందుకంటే ఊపిరితిత్తులలో అడ్డంపడిన రక్తపు గడ్డలు వలన ఎపుడైతే ఆక్సిజన్ శాతం తగ్గిపోతుందో..మన మెదడులో ఉండే రెస్పిరేటరీ సెంటర్ దానిని గ్రహించి శ్వాస సంబంధమైన కండరాలు వేగంగా ఎక్కువ తీవ్రతతో పని చేసేలా ఆర్డర్లు పంపుతాయి. అందుకే మామూలుగా ఐతే నిముషానికి  14 to 20 సార్లు తీసుకోవలసిన శ్వాస ఈ ఆర్డర్ వలన 40 నుండి 50 సార్లకు పెరుగుతుంది.

ఇంతకుముందు చెప్పినట్టు ఈ శ్వాస కండరాలలో కూడా రక్తపు ముద్దలు చేరడం వలన సరిగా రక్తప్రసరణ లేని కండరాలు బ్రెయిన్ ఆర్డర్ చేసినట్టు నిముషానికి నలభై యాభైసార్లు పని చేయాలంటే చేయలేవు. చేతులెత్తేస్తాయి. దీనినే రెస్పిరేటటరీ ఫైయిల్యూర్ అంటాం. 

అందుకే ఏం చేయాలి. వెంటనే ఆక్సిజన్ శాతం రక్తంలో పెంచితే మెదడు ఓహో పరిస్థితి బాగానే ఉంది కాబోలని శ్వాస కండరాలకు మెసేజ్ పంపడం కూడా తగ్గిస్తుంది. తద్వారా శ్వాస కండరాల పని తీవ్రత తగ్గి సరైన రెస్ట్ దొరికుతుంది. రక్తంలో ఎపుడైతే ఆక్సిజన్ పెరిగిందో ఈ కండరాలకు కూడా ఆక్సిజన్ సరిగ్గా దొరికి అవి వెంటనే పుంజుకుంటాయి.

అందుకే కరోనా సమయంలో ఎలాంటి వ్యాయామాలూ చేయకూడదు. వ్యాయామం చేస్తే కండరాలలో ఆక్సిజన్ డిమాండ్ పెరుగుతుంది. వెంటనే మెదడు ఎక్కువగా కండరాలను పని చేయిస్తుంది. దానివలన కండరాలలోని మైక్రోథ్రోంబై పెరిగి కండరాలు చతికిలపడతాయి.

ఈ కారణం వలననే ఆక్సిజన్ థెరపీ అనేది రోగి కోలుకోవడానికి చాలా ముఖ్యమైన చికిత్స. మైక్రో థ్రోంబై కరగడానికి బ్లడ్ థిన్నర్స్ ని వ్యక్తి బరువుని కిడ్నిల పనితీరును బట్టి డాక్టర్లు ఇస్తారు. చూడండి ఇదేమీ తెలియకుండా ఆక్సిజన్ తగ్గుతుందని బలంగా గాలిని పీలుస్తూ మరింతగా కండరాలను ఒత్తిడికి గురిచేస్తే ఏమౌతుందో చెప్పండి?. అందుకే టోటల్ బెడ్ రెస్ట్ కూడా శరీరంలో ఆక్సిజన్ డిమాండ్ ని తగ్గిస్తుంది. తద్వారా శ్వాస కండరాలు చతికిల పడటం అనేది జరగదు. ముఖ్యంగా కరోనా లక్షణాలు వచ్చిన వారం రోజుల తర్వాత ఎవరు ఏ రూపంలో అతిగా అలసిపోయినా..వాళ్ళల్లో ఆక్సిజన్ శాతం తగ్గడం గమనించాం. ఇళ్ళల్లో పనే కావచ్చు ఇంట్లో వారిని హాస్పిటల్స్ చుట్టూ తిప్పే ప్రయత్నమే కావచ్చు కొందరు తెలియకుండానే కండరాలను ఒత్తిడికి గురి చేస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరం.

మన శరీరంలో ఆక్సిజన్ కదలికలకు సంబంధించి ఈ మాత్రం తెలుసుకుంటే సరైన చికిత్స సరైన సమయంలో సరైన విధానంలో తీసుకునే అవకాశం పెరుగుతుంది. బెడ్ రెస్ట్ తీసుకోవడం పల్స్ ఆక్సిమీటర్ లో ఆక్సిజన్ శాతం చూసుకుంటూ ఉండటము డాక్టర్ తో రోజూ మాట్లాడుతూ ఉండటమూ మరవకండి.


_ డాక్టర్ విరించి విరివింటి

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More

Subscribe Get Alerts

Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top