కొవిడ్-19 బారిన పడిన ఉపాధ్యాయులకు వైద్యo నిమిత్తం ఏమైనా " ప్రత్యేక సెలవు " ఉన్నదా ?
కొవిడ్-19 బారిన పడిన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు "ప్రత్యేక సెలవు" మంజూరు గురించి ఇంతవరకు ఏపి ప్రభుత్వం ఎటువంటి ఉత్తర్వులు విడుదల చేయలేదు. ఉపాధ్యాయ సంఘాలు, APNGO's, APJAC తరపున 14 రోజుల ప్రత్యేక సెలవు గురించి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపగా, సంబంధిత ప్రతిపాదనపై తగు చర్యలు తీసుకోవలసినదిగా గౌ౹౹ ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ఏపి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపడమైనది. ఈ 14 ప్రత్యేక సెలవుపై ఇంతవరకూ ఎటువంటి అధికారక ఉత్తర్వులు విడుదలకాలేదు. కాబట్టి ఉపాధ్యాయులు ఎవరైనా కొవిడ్-19 బారిన పడిన యెడల ప్రస్తుతానికి తమ వ్యక్తిగత సెలవులను (CL / spl CL / HPL / ML / EL / EOL) మాత్రమే వినియోగించుకోవాలి.
0 Post a Comment:
Post a Comment