Sunday, 14 March 2021

తెలుగుభాష గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు.

తెలుగుభాష గురించి కొన్ని ముఖ్యమైన  విషయాలు.
👉 16 17 శతాబ్దాలలో పోర్చుగీసువారు తెలుగువారిని జంతియో అని తెలుగుభాషను జేంతు అని పిలిచేవారు.

👉 ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని తెలుగు భాషను నికోలస్ కాంట్ అన్నాడు.

👉 ఆంధ్రం, తెలుగు ,తెలుగులో ప్రాచీనమైనది ఆంధ్రము.

👉 ఆంధ్ర శబ్దం సంస్కృత పదం. తెలుగు, తెనుగు పదాలు అచ్చ తెలుగు పదాలు.

👉 ఆంధ్రము-తెనుగు- తెలుగు వ్యాసకర్త జి.ఎన్.రెడ్డి.

👉విద్య, హిమాలయాల మధ్య ప్రదేశాన్ని ఆర్యావర్తము అని పుణ్యభూమి అని అమరసింహుడు అమరకోశంలో చెప్పాడు.

👉 ఋగ్వేదంలో ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్రపదం తొలిసారిగా జాతి వాచకంగా కనిపిస్తుంది.

👉 వాయు, బ్రహ్మాండ, మత్స్య పురాణాలలో ఆంధ్రుల ప్రస్తావన ఉంది.

👉 ఆంధ్రుల గురించి మొదటి సారిగా ప్రస్తావించిన వ్యక్తి మెగస్తనీస్ , ఇండికా గ్రంథం.

👉 అశోకుని 13వ శిలాశాసనం క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలో ఆంధ్రుల గురించి ప్రస్తావించిన మొదటి శిలాశాసనం.

👉 వరాహమిహిరుడు తన బృహత్సంహిత లో.' కౌశిక విదర్భ వశ్స ఆంధ్ర చేది ' అని ఆంధ్ర దేశాన్ని పేర్కొన్నాడు.

👉 ఆంధ్ర పదం దేశ వాచకంగా కనిపిస్తున్న మొదటి శాసనం మైదవోలు శాసనం.

👉 ఆంధ్రుల నివాసం గురించి మొదటగా బౌద్ధ జాతక కథలలో కనిపిస్తుంది.

👉 నన్నెచోడుని కుమారసంభవంలో ఆంధ్రవిసయం అనే ప్రయోగం కనిపిస్తుంది.

👉 ఆంధ్ర శబ్దం ను భాషా వాచకంగా ఉపయోగించిన తొలి గ్రంథం భరతుని నాట్య శాస్త్రం.

👉 ఆంధ్ర శబ్దం ను భాషా వాచకంగా ప్రయోగించిన తొలి శాసనం నందంపూడి శాసనం.

👉 ఆంధ్ర శబ్దం లో భాషా వాచకంగా ప్రయోగించిన తొలి తెలుగు కవి నన్నయ.(ఆంధ్ర శబ్ద చింతామణి గ్రంథంలో).

👉 పదకొండవ శతాబ్దం నుంచి కవులందరూ ఆంధ్రశబ్దం భాష వాచకంగా ప్రయోగించారు.

త్రిలింగ పదం :

👉 వాయు పురాణం తిలింగ అనే పదం కనబడుతుంది , టాలిమి త్రిలింగం అని పేర్కొన్నాడు, మూడో గళింగం అని ప్లిని పేర్కొన్నాడు.

👉 తెనుంగు పదాన్ని ప్రయోగించిన తొలి కవి నన్నయ.

👉 జానుతెనుగు అనే పదాన్ని పాల్కురికి సోమన బసవపురాణం లో ప్రయోగించాడు.

👉 తెలుగు పదాన్ని భాషా వాచకంగా ప్రయోగించిన తొలి కవి పాల్కురికి సోమన .  - పాల్కురికి సోమనాథుడు బసవ పురాణంలో తెలుగు పదాన్ని ప్రయోగించాడు.

నన్నయ _ తెనుంగు ,తెనుగు.

నన్నెచోడుడు_  తెనుంగు.

పాల్కురికి సోమన_ తెనుంగు, తెలుగు .

తిక్కన _ తెనుంగు ,తెనుగు. 

👉తెలుగు శబ్దమే ప్రాచీనమైనది దాని నుండి సృష్టించబడినది త్రిలింగ శబ్దం అని పేర్కొన్నది కొమర్రాజు లక్ష్మణరావు.

👉 తెలుగు త్రిలింగ శబ్దం అని తన ఆంధ్ర భాష వికాసంలో పేర్కొన్నది గంటి జోగి సోమయాజి.

👉చిలుకూరి వీరభద్రరావు త్రిలింగ శబ్దం నుంచి  ( శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం ) మధ్య ఏర్పడిన భాసే తెలుగు భాష అని చెప్పడం జరిగింది.

👉 తెలుగు ప్రాకృత శబ్ద భవము అని భావించింది చిలుకూరి నారాయణరావు (ఆంధ్ర భాషా చరిత్ర).

ఆంధ్ర తొలి గ్రంథాలు :

 జాతి వాచకం -ఐతరేయ బ్రాహ్మణం 

దేశ వాచకం - వాల్మీకి రామాయణం,

బాషావాచకం - నాట్యశాస్త్రం.

తొలి శాసనాలు :

జాతి వాచకం -13వ శిలాశాసనం,

 అశోకుడు.

దేశ వాచకం: మైదవోలు శాసనం, శివ స్కంద వర్మ.

భాషా వాచకం: నందంపూడి శాసనం, నన్నయ.

తెలుగు తొలి గ్రంథాలు :

తెనుగు -ఆంధ్ర మహాభారతం నన్నయ్య.

త్రిలింగ - ప్రతాపరుద్ర యశోభూషణం ,విద్యానాథుడు.

 తెలుగు - బసవ పురాణం, పాల్కురికి సోమనాథుడు.

👉 శాసన విషయ నైపుణ్యం కలిగిన తొలి తెలుగు వ్యక్తి - 

కావలి బొర్రయ్య.

👉ప్రాచీనాంధ్ర శాసనాలు పై పరిశోధన చేసిన పండితుడు బూదరాజు రాధాకృష్ణ.

👉 శాసనాలను గురించి లిపి పరిమాణాన్ని నిరూపించే శాస్త్రాన్ని ఏపీ గ్రఫీ అంటారు.

ఆంధ్రదేశాన్ని పరిపాలించిన రాజవంశాలు :

శాతవాహనులు, ఇక్ష్వాకులు ,పల్లవులు, బృహత్పలాయనులు, శాలంకాయనులు, ఆనంద గోత్రికులు, విష్ణుకుండినులు ,రేనాటి చోళులు ,తూర్పు చాళుక్యులు, కాకతీయులు, ముసునూరి నాయకులు, రెడ్డిరాజులు, విజయనగర సామ్రాజ్యం.

👉అమరావతి శాసనం లో తొలి తెలుగు పదమైన' నాగబు' పదం ఉంది దీనిని1928 లో వేటూరి ప్రభాకరశాస్త్రి గారు కనుగొన్నారు.

👉 కొత్తూరు మట్టిపాత్ర శాసనం ఎలమంచిలి తాలూకాలోని విశాఖపట్టణంలో గ్రామం లో 

' తంబయ ధామం' అనే తొలి తెలుగు పదం అని 2006 లోపత్రికల ద్వార నిరూపించారు.

You may like this post also 👇

A Message about COVID 19 by Dr.Gurava Reddy

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More

Subscribe Get Alerts

Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top