Sunday, 14 March 2021

నేడు ప్రముఖ శాస్త్రవేత్త "స్టీఫెన్ హాకింగ్" గారి వర్ధంతి.

 నేడు ప్రముఖ శాస్త్రవేత్త "స్టీఫెన్ హాకింగ్" గారి వర్ధంతి.
నీ పాదాలవైపు కాదు.. అనంత విశ్వంలోని తారాతీరాలవైపు చూడాలని గుర్తుపెట్టుకో! చూసినదాన్ని అర్థం చేసుకోవడానికి.. ఈ విశ్వం ఎలా ఆవిర్భవించిందో తెలుసుకోడానికి ప్రయత్నించు. తెలుసుకోవాలనే ఆసక్తితో ఉండు. అప్పుడు జీవితం ఎంత సంక్లిష్టంగా ఉన్నా నువ్వు చెయ్యడానికి, సాధించడానికి ఏదో ఒకటి ఉంటుంది.. మధ్యలో దేన్నీ వదిలేయకు.  -స్టీఫెన్‌ హాకింగ్‌.

  ఆయన ఒక విధి వంచితుడు. పట్టుదల, ఆత్మస్థైర్యం ముందు విధి ఓడిపోయింది. విధి వక్రించినా ఆయన వెరవలేదు. శరీరం కదల్చడానికి వీలు లేని స్థితిలోనూ ఆయన చేసిన పరిశోధనా కృషి ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ప్రఖ్యాతిని తెచ్చిపెట్టింది. అమెరికా అత్యున్నత పౌర పురస్కారమైన ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అందుకున్న ఘనుడు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోనూ స్థానం పొందిన మేధావి.

  కనీసం కదలడానికి సహకరించని శరీరం, చక్రాల కుర్ఛీకి అతుక్కు పోయిన మనిషి, కనీసం మాట్లాడటానికీ కంప్యూటర్ సహాయం… ఇవి ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ను గుర్తించడానికి ఆనవాళ్లు. మోటార్ న్యూరాన్ వ్యాధి శరీరాన్ని కబళిస్తున్నా… చేస్తున్న పనికి శరేరం సహకరించక పోయినా…ఆయన పరిశోధనలు ఖగోళ శాస్త్రంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానాన్ని చూపాయి. శాస్త్రవేత్తగానే కాక ఆయనపై ఆయనకున్న నమ్మకం, కలసిరాని విధిని తనకు అనుకూలంగా మార్చుకునే తత్వం నేటి యువతకు ఆదర్శం. స్టీఫెన్ హాకింగ్ ఓ సైద్డాంతిక భౌతిక శాస్త్రవేత్త.

  ఎమియోట్రోఫిక్ లేటరల్ స్కెర్లోసిస్ అనే నాడీమండలానికి సంబంధించిన జబ్బు వల్ల క్రమక్రమంగా దశాబ్దాల తరబడి అతని శరీరభాగాలు చచ్చుబడుతూ వచ్చినా, తన మెదడు పనిచేస్తూండడాన్ని దన్నుగా ఉపయోగించుకుని కృష్ణబిలాలకు సంబంధించిన అనేక అంశాలు మొదలుకొని సైద్ధాంతిక భౌతిక శాస్త్రంలో ఎన్నో పరిశోధనలు చేశాడు. హాకింగ్ రాయల్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్‌లో గౌరవ సభ్యుడిగా, పాంటిఫికల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో జీవిత కాల సభ్యునిగా ఉన్నాడు. ఆయన అమెరికా అత్యున్నత పౌర పురస్కారమైన ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అందు కున్నాడు. టైమ్స్ పత్రిక వారి 100 మంది అత్యంత గొప్పవారైన బ్రిటీషర్ల జాబితాలో 25వ స్థానం అతనిదే. ఆయన రాసిన ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ అన్న పుస్తకం ద బ్రిటీష్ సండే టైమ్స్ బెస్ట్ సెల్లర్ల జాబితాలో 237 వారాల పాటు నిలిచి రికార్డులు బద్దలు కొట్టింది, ఈ పుస్తకపు అమ్మకాలు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోనూ స్థానం సంపాదించాయి. శరీరం చాలావరకూ చచ్చుబడి పోయినా ఆయన జీవితాంతం ఒకే ఒక్క దవడ ఎముక కదులుస్తూ, దానికి అమర్చిన సంభాషణలు-ఉత్పత్తి చేసే పరికరం ఉపయోగించి సంభాషించేవాడు.

  1942 జనవరి 8వ తేదీన ఇంగ్లాండులోని ఆక్స్‌ఫర్డ్‌లో స్టీఫెన్‌ హాకింగ్‌ జన్మించాడు. 1950 లండన్‌లోని హైగేట్స్‌ ప్రాంతంలోని సెయింట్‌ ఆల్భన్స్‌ పాఠశాలలో విద్యాభ్యాసాన్ని ప్రారంభించాడు. గదిలో టీచర్‌ పాఠం చెప్తుంటే మౌనంగా కూర్చుని వినే లక్షణం హాకింగ్‌కు లేదు. ఆ పాఠంలో టీచర్‌ కూడా గమనించని సంగతుల్ని ఇట్టే పట్టేయడం, వాటిలోని గుణదోషాలను చర్చించడం హాకింగ్‌కు అలవాటు.

  1959లో రసాయన శాస్త్రంలో ఉత్తీర్ణుడైన తర్వాత భౌతిక శాస్త్రంలో స్పెషలైజేషన్‌ చేసి 1962లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. ఆ తర్వాత కాస్మాలజీ జనరల్‌ రిలెవిటీ పరిశోధనల కోసం ఆక్స్‌ఫర్డ్‌కు వెళ్లాడు. అప్పుడు స్టీఫెన్‌ హాకింగ్‌కు 21ఏండ్లు. ఆ వయసులోనే ఆయనకు అత్యంత అరుదైన ''ఎమియోట్రోపిక్‌ లాటరల్‌ స్కెర్లోసిస్‌'' అనే నాడీ మండలానికి సంబంధించిన వ్యాధి వచ్చింది. రెండేండ్లలో చనిపోతాడని డాక్టర్లు చెప్పినప్పటికీ హాకింగ్‌ తన చదువును ఆపలేదు. కాలం గడుస్తున్న కొద్దీ శరీరంలోని అన్ని భాగాలు చచ్చుబడి పోయి చక్రాల కుర్చీకి అతుక్కు పోక తప్పలేదు. అయినా సరే ''మెదడు బాగా పనిచేస్తున్న తరుణంలో మనుషులు తమ సామర్ధ్యాలకు పరిమితి విధించుకోవాల్సిన అవసరంలేదని తన మేధస్సుకు మరింత పదునుపెట్టి మెరుపు వేగంతో విశ్వాంతరాళాన్ని నిరంతరాయంగా అన్వేషిస్తూ వచ్చాడు. హాకింగ్‌ మొట్టమొదటి సారిగా 1970లో సింగ్యులారిటీ ద్వారా విశ్వం ఏర్పడిందని, విశ్వంలోని గ్రహాలు, నక్షత్రాలు అన్నిరకాల ఇతర పదార్ధాలు కంటికి కనిపించనంత చిన్నగుళిక స్థాయికి కుశించుకు పోతే అప్పుడు విశ్వం సాంద్రత, బరువు అంతమవుతాయని, అంతరిక్షంలోని అన్ని ఇందులో ఇమిడి ఉంటాయని, దీన్నే సింగ్యులారిటీ అంటారని ప్రతిపాదించాడు. 1972 నుంచి కృష్ణ బిలాలపై ఆయన చేసిన పరిశోధనలు ఆయనకు ప్రత్యేక గుర్తింపును, ఖ్యాతిని తెచ్చి పెట్టాయి. విశ్వంలో అక్కడక్కడ అదృశ్యంగా ఉండే కృష్ణబిలాల నుంచి రేడియో ధార్మికత వెలువడుతుందని కృష్ణబిలంలోకి వెళ్లే పదార్థం, సమాచారం ఏదైనా సరే ఆవిరిగా మారుతుందని ప్రతిపాదించారు. హాకింగ్‌ ప్రతిపాదించిన కృష్ణబిలాల రేడియేషన్‌ను ప్రస్తుతం మనం హాకింగ్‌ రేడియేషన్‌గా పిలవడం జరుగుతుంది. అంతరిక్ష కాలాలకు సంబంధించి ఈ విశ్వానికి సరిహద్దులు లేవని, కాలం దూసుకుపోతున్న మూడు బాణాల వంటిదని హాకింగ్‌ అంచనా వేశారు. అంతేకాదు అగ్గిపెట్టె అంత శాటిలైట్‌ తయారీతో పాటు అంతకు ముందు ఎవ్వరిచూపు పడని అనేకమైన అంశాలపై పరిశోధనలు చేసి అరుదైన ప్రతిపాదనలు చేసారు. ఎన్నో విలువైన గ్రంథాలను కూడా వెలువరించారు. 1988లో ఆయన రాసిన '' ఏ బ్రీఫ్‌ హిస్టరీ ఆఫ్‌ టైమ్‌'' ప్రపంచ వ్యాప్తంగా నలభై భాషల్లోకి అనువాదమైంది. 237 వారాల పాటు నిరంతరాయంగా సండేటైమ్స్‌ బెస్ట్‌ సెల్లర్‌ గ్రంథాల్లో అగ్రభాగాన ఉన్నది. ప్రపంచ దేశాల్లో ఈ గ్రంథం చదివిన అనేకులు శాస్త్రవేత్తలుగా రూపు దిద్దుకున్నారు. దీంతో పాటు మైబ్రీఫ్‌ హిస్టరీ, దిగ్రాండ్‌ డిజైన్‌, యూనివర్స్‌ ఇన్‌ ఏ నట్‌ షల్‌, జార్జ్స్‌ సీక్రెట్‌ కీటు యూనివర్స్‌ వంటి ఎన్నో అద్భుతమైన గ్రంథాలు రాశారు. హాకింగ్‌ తన చివరి పుస్తకమైన ''బ్రీఫ్‌ ఆన్సర్‌ టు బిగ్‌ క్వశ్ఛన్స్‌''లో దేవుడు లేడని, విశ్వ సృష్టికి మూలం దేవుడు కాదని, గురుత్వాకర్షణ అని, మరణం తర్వాత స్వర్గం నరకం వంటివి ఉండవని, మృత్యువు అంటే భయపడే వారికోసం అల్లిన కట్టుకథలే ఇవన్నీ అని తేల్చి చెప్పాడు. హేతువాద శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ చేసిన పరిశోధనలకు గానూ అల్భర్ట్‌ ఐన్‌స్టీన్‌ అవార్డు, అమెరికా అత్యున్నత పురస్కారం ''ప్రెసి డెన్షియల్‌ మెడల్‌ ఆఫ్‌ ఫ్రీడమ్‌''తోపాటు అనేక అత్యున్నత పురస్కారాలు లభించాయి. స్టీఫెన్‌ హ్యాకింగ్‌పై 2014లో ''ది థియరీ ఆఫ్‌ ఎవ్రీ థింగ్‌'' అనే సినిమా కూడా వచ్చింది. ఒకవైపు మోతార్‌ న్యూరాన్‌ వ్యాధి కబలిస్తున్నా శరీరం సహకరించక పోయినా హాకింగ్‌ చేసిన పరిశోధనలు ఖగోళంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానం చూపాయి. 48ఏండ్లు చక్రాల కుర్చీకి అతుక్కుపోయినా, చివరి క్షణం వరకూ తనను తాను ప్రజా సైన్సుకు అంకితం చేసుకున్న స్టీఫెన్‌ హాకింగ్‌ 2018 మార్చి 14న కన్ను మూశారు. ఆయన భౌతికంగా ఈప్రపంచానికి దూరమై సంవత్సరం అయినా ఆయన వైజ్ఞానిక రంగానికి చేసిన సేవలు విశ్వాం తరాలలో వెలుగొందుతూనే ఉన్నాయి శాస్త్ర వేత్తగానే కాకుండా, తనపై తనకున్న నమ్మకం అచంచలమైన ఆత్మవిశ్వాసం, ప్రతి కూలంగా మారిన తీవ్ర అనారోగ్యాన్ని సైతం అనుకూలంగా మార్చుకున్న మనోస్థైర్యం నేటి యువతకు ఆదర్శం.

0 comments:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top