Tuesday, 11 August 2020

SBI : రూ.10,000 కన్నా ఎక్కువ డ్రా చేయాలా ? ఓటీపీతో చేయండి ఇలా...


SBI : రూ.10,000 కన్నా ఎక్కువ డ్రా చేయాలా ? ఓటీపీతో చేయండి ఇలా...




▪ SBI OTP based Cash Withdrawal | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఏటీఎంలో డబ్బులు డ్రా చేసే పద్ధతిని కాస్త మార్చింది బ్యాంకు. కస్టమర్లు కార్డు మోసాలకు పాల్పడకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. రూ.10,000 కన్నా ఎక్కువ డ్రా చేయాలంటే ఓటీపీ తప్పనిసరి. మరి డబ్బులు ఎలా డ్రా చేయాలో తెలుసుకోండి.

▪ రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య ఎస్‌బీఐ ఏటీఎంలో డబ్బులు డ్రా చేయాలంటే ఓటీపీ తప్పనిసరి.

▪ ఎస్‌బీఐ ఓటీపీ బేస్డ్ విత్‌డ్రాయల్ సిస్టమ్‌ను ఈ ఏడాది జనవరి 1న ప్రారంభించింది. ఎస్‌బీఐకి చెందిన అన్ని ఏటీఎంలల్లో ఈ సెక్యూరిటీ ఫీచర్ ఉంటుంది.

▪ఎస్‌బీఐ ఓటీపీ బేస్డ్ విత్‌డ్రాయల్ సిస్టమ్‌ను ఎలా ఉపయోగించాలంటే ముందుగా ఏటీఎంలో మీ కార్డు స్వైప్ చేయాలి. రూ.10,000 లోపు ఓటీపీ అవసరం లేదు.

▪ రూ.10,000 కన్నా ఎక్కువ అమౌంట్ ఎంటర్ చేస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఏటీఎం స్క్రీన్ పైన ఓటీపీ విండో ఓపెన్ అవుతుంది. అందులో మీ ఫోన్‌కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి.*

▪ మీరు సరైన ఓటీపీ ఎంటర్ చేస్తేనే ఏటీఎం నుంచి డబ్బులు డ్రా అవుతాయి. కార్డు మోసాలను తగ్గించేందుకు తగ్గించేందుకు అదనంగా ఆథెంటిఫికేషన్ ప్యాక్టర్‌ను యాడ్ చేసింది ఎస్‌బీఐ*

▪ ఒకవేళ కార్డు పోగొట్టుకున్నా మీ కార్డుతో ఎవరైనా డబ్బులు డ్రా చేయడానికి ట్రై చేస్తే మీ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. అయితే రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకే ఓటీపీ బేస్డ్ విత్‌డ్రాయల్ సిస్టమ్‌ పనిచేస్తుంది.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's need

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More
Top