30 సెకన్లలోనే కరోనాను అంతం చేసే సరికొత్త డివైస్
మాసర్ టెక్నాలజీ అనే సంస్థ ఓ సరికొత్త డివైస్‌ను ఆవిష్కరించింది. దాని పేరు అతుల్యా స్టెరిలైజర్.
అతుల్యా స్టెరిలైజర్‌ను డీఆర్‌డీవోకు చెందిన మైక్రోవేవ్ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేశారు. మాసర్ టెక్నాలజీ ఈ డివైస్‌ను రూపొందించింది. ఇది కేవలం 30 సెకన్ల వ్యవధిలోనే ఉపరితలాలు, వస్తువులను శానిటైజ్ చేస్తుంది. కరోనాను పూర్తిగా అంతం చేస్తుంది. కాగా ఈ డివైస్‌ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆవిష్కరించారు. ఈ డివైస్ నుంచి వెలువడే మైక్రోవేవ్ తరంగాలు ఉపరితలాల నుంచి 5 మీటర్ల లోపలకి చొచ్చుకు వెళ్లగలవు. అందువల్ల వైరస్, ఇతర బాక్టీరియాలు అసలు బతికి ఉండే అవకాశమే లేదు. కేవలం 30 సెకన్ల వ్యవధిలోనే ఉపరితలాలు, వస్తువులపై ఉండే క్రిములు పూర్తిగా నశిస్తాయి.
ఈ డివైస్ మనుషులకు పూర్తిగా సేఫ్ అని మాసర్ టెక్నాలజీ తెలిపింది. అందుకు పలు రకాల పరీక్షలు కూడా చేశామని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. అందువల్ల ఈ డివైస్ తో మనుషులకు పూర్తిగా సేఫ్టీ ఉంటుందన్నారు. దీన్ని సురక్షితంగా వాడవచ్చన్నారు.*
కాగా అతుల్యా స్టెరిలైజర్ డివైస్ ధరను రూ.12,700 గా నిర్ణయించారు. దీన్ని ప్రభుత్వ ఈ-మార్కెట్ పోర్టల్ https://gem.gov.in/ లేదా అమెజాన్ సైట్‌లో కొనవచ్చు. ఈ డివైస్ 220 వోల్టుల విద్యుత్ ఆధారంగా పనిచేస్తుంది. అంటే ఇంట్లో టీవీ, ఫ్యాన్ మాదిరిగా కరెంటును తీసుకుంటుందన్నమాట. 800 వాట్ల సామర్థ్యంతో పనిచేస్తుంది. దీని బరువు సుమారుగా 7.7 కిలోలు. అమెజాన్‌లో ఆర్డర్ చేస్తే 7 నుంచి 10 రోజుల్లోగా ఈ డివైస్‌ను డెలివరీ పొందవచ్చు. ఉపరితలాలు, వస్తువులను కోవిడ్ లేకుండా శానిటైజ్ చేసేందుకు, ఆఫీసుల్లో, పరిశ్రమల్లో ఈ డివైస్‌ను వాడవచ్చు
0 Post a Comment:
Post a Comment