ఆన్‌లైన్ క్లాసుల నిర్వహణపై కేంద్రం మార్గదర్శకాలు
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పలు పాఠశాలలు, కళాశాలలు ఆన్‌లైన్ క్లాసుల నిర్వహణపై మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో మంగళవారం కేంద్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.
🔘 ఆన్‌లైన్ క్లాసుల విద్యార్ధులకు భారం కాకుండా ఉండేలా షెడ్యూల్‌ను ఖరారు చేసింది.
🔘 పలు పాఠశాలలు విద్యార్ధులకు స్క్రీన్ సమయం పెంచేయడంతో తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనితో కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
🔘 'ప్రగ్యాత’ అనే పేరుతో కేంద్రం రిలీజ్ చేసిన ఈ మార్గదర్శకాల్లో నర్సరీ పిల్లలకు కేవలం 30 నిమిషాలు మాత్రమే ఆన్‌లైన్ క్లాసుల నిర్వహించాలని సూచించింది.
🔘 అలాగే 1వ తరగతి నుంచి 8 తరగతి విద్యార్ధులకు 45 నిమిషాలు వ్యవధితో రెండు సెషన్స్‌లు నిర్వహించాలంది.
🔘 ఇక 9వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్ధులకు 30- 45 నిమిషాలు వ్యవధితో నాలుగు సెషన్స్‌లు నిర్వాహించాలని సూచించింది.
I think it is not needed to nursary online classes. It should be take care for their health and hygenic in this situation .
ReplyDelete