Friday 1 May 2020

విద్యావ్యవస్థకూ కోవిడ్ కోడ్ - కేంద్రం కొత్త మార్గదర్శకాలు




 విద్యావ్యవస్థకూ కోవిడ్ కోడ్ - కేంద్రం కొత్త మార్గదర్శకాలు








విద్యా సంస్థల్లో సమావేశాలు, క్రీడలు రద్దు

తరగతి గదుల్లో వ్యక్తిగత దూరం

మాస్క్‌లు తప్పనిసరి

స్కూలు బస్సుల్లోనూ రక్షణాత్మక చర్యలు

 సెప్టెంబర్‌ 1నుంచి నూతన విద్యా సంవత్సరం


          జాతీయ స్థాయిలో లాక్‌డౌన్‌ అనంతరం తెరుచుకోనున్న అన్ని విద్యా సంస్థలకు కేంద్రం మార్గ దర్శకాలను జారీ చేసింది. విద్యా సంస్థలు తిరిగి ప్రారంభం కాగానే మార్గదర్శకాలను తప్పకుండా అమలు చేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. పాఠశాలలు, కళాశాలలు, విశ్వ విద్యాలయాల్లో ఇప్పటి వరకు ఉన్న సీటింగ్‌ అరెంజ్‌మెంట్‌ను మార్చి వ్యక్తిగత దూరం పాటించేలా ఏర్పా ట్లు చేయాలని,ఇందుకు ఆయా రాష్ట్రాల విద్యా శాఖ ఉన్నతాధికారులు చొరవ చూపా లని కోరింది.విడతల వారీగా తరగతులు,గ్రంథా లయం, క్యాంటిన్లు,వసతి గృహాల్లో సరికొత్త పద్దతులను అనుసరించాలని కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల్లో కోరింది.

       ప్రతీరోజూ ఉదయం జరిగే సమావేశాలను,క్రీడా కార్యక్రమాలను రద్దు చేయాలని ఆదేశించింది. దేశంలో కరోనా వైరస్‌ విజృంభిచడంతో మార్చి 16 తేదీ నుంచి అన్ని విద్యా సంస్థలను మూసివేసిన సంగతి తెలిసిందే. పదో తరగతి, ఇంటర్మీడియట్‌తో పాటు డిగ్రీ,పీజీ పరీక్షలను వాయిదా వేసింది.ఆయా రాష్ట్రాల్లో జరగాల్సిన ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. త్వరలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో కరోనా వైరస్‌ బారి నుంచి విద్యార్థులను పూర్తిగా రక్షించేందుకు వీలుగా మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం రూపొందించింది.
        దేశంలో విద్యాసంస్థలను ఎప్పుడు తెరిస్తే అప్పుడు ఈ మార్గదర్శకాలన్నింటినీ అమల్లోకి తీసుకురావాలని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది.కరోనా విస్తృతి నేపథ్యంలో విద్యార్థుల మధ్య వ్యక్తిగత దూరాన్ని పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరింది.కొత్త మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వాలకు త్వరలోనే పంపిస్తామని కేంద్రం తెలిపింది.

       పాఠశాలలకు ఆయా రాష్ట్రాల పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్లు, కమిషనర్లు,జూనియర్‌ కళాశాలలకు ఇంటర్మీడియట్‌ బోర్డులు కళాశాలలకు,విశ్వ విద్యాలయాలు నిధుల సంఘం (యూజీసీ) వేర్వేరుగా మార్గదర్శకాలను సిద్ధం చేశాయి. విద్యార్థులను తమ ఇళ్ల నుంచి పాఠశాలలకు చేరవేసే బస్సుల్లో వ్యక్తిగత దూరాన్ని పాటించేలా చర్యలు తీసుకోవాలని కూడా కేంద్రం కోరింది.ప్రతి పాఠశాలలో రోజూ ఉదయం నిర్వహించే ప్రెయర్‌తోపాటు ఇతరత్రా సమావేశాలను రద్దు చేయాలని కేంద్రం కోరింది.తదుపరి ఉత్తర్వులు జారీచేసేంత వరకు మైదానాల్లో క్రీడా కార్యక్రమాలను కూడా నిర్వహించరాదని కోరింది. విద్యార్థులకు యూనిఫామ్‌తోపాటు మాస్కులు తప్పనిసరి చేయాలని, ప్రతి విద్యార్థి మాస్కు ధరిస్తేనే అనుమతినివ్వాలని కోరింది. 
      ఆశ్రమ,గురుకుల పాఠశాలల్లో మెస్‌లు,వంటశాలల్లో వ్యక్తిగత దూరాన్ని పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరింది.పాఠశాల ఆవరణతోపాటు క్యాంటిన్లు, మరుగుదొడ్లలో చేయాల్సినవి, చేయకూడని పనులను నోటిసు బోర్డులో వివరించడంతోపాటు ఆ వివరాలను ప్రతి తరగతిలో విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించాలని,విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ సమాచారాన్ని చేరవేయాలని కూడా కోరింది.పాఠశాలల భవనాలను ఎప్పటికప్పుడు క్రిమిసంహారకాలతో శుభ్రం చేయాలని, విద్యార్థుల తల్లిదండ్రులతోపాటు సందర్శకులను విద్యా సంస్థల్లోకి రాకుండా చూడాలని,కొన్ని రోజులపాటు విద్యార్థుల తల్లిదండ్రులతో నిర్వహించే సమావేశాలను వాయిదా వేసుకోవాలని కోరింది. పాఠశాలలు,కళాశాలల్లో నిర్వహించే ప్రయోగ పరీక్షల్లో మార్పులు తీసుకురావాలని కోరింది.ప్రయోగ పరీక్షలు నిర్వహించేటప్పుడు విద్యార్థులు వ్యక్తిగత దూరాన్ని పాటించేలా పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు చొరవ తీసుకోవాలని కోరింది.డిగ్రీ,పీజీ కళాశాలలకు యూజీసీ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం సెమిస్టర్‌ పరీక్షలను జులైలో నిర్వహించాలి. ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించవచ్చని తెలిపింది. పోటీ పరీక్షలు,ప్రవేశ పరీక్షల్లో ఇదే విధానాన్ని అవలంభించాలని కోరింది.

      కొత్తగా కళాశాలలు,విశ్వ విద్యాలయాల్లో ప్రవేశం పొందేవారికి సెప్టెంబరు నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందని,ఇప్పటికే కేంద్ర మానవవనరుల మంత్రిత్వశాఖ ప్రకటించిన సంగతి విధితమే.పెండింగ్‌లో ఉన్న సీబీఎస్‌ఈ 10,12 తరగతుల వార్షిక పరీక్షలు నిర్వహించేందుకు సంబంధిత అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్‌ను కేంద్రం మరోమారు పొడిగించిన నేపథ్యంలో ఆ తర్వాతే ఈ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.డిగ్రీ,పీజీతో పాటు అన్ని రకాల సెమిస్టర్‌ పరీక్షలను నిర్వహించే సమయాన్ని మూడు గంటల నుంచి గంట తగ్గించి రెండు గంటలకు కుదించిన సంగతి తెలిసిందే.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top