వాట్సాప్ నుంచి ‘మల్టీ’ ఫీచర్ !
వాట్సాప్.. స్మార్ట్‌ఫోన్ వాడే ప్రతి ఒక్కరి జీవితంలో అంతర్భాగం అయిపోయిన యాప్. కేవలం వ్యక్తిగత జీవితంలోనే కాదు.. వృత్తి జీవితంలో భాగపోయింది. అందుకే ఎప్పటికప్పుడు వాట్సాప్ తన ఫీచర్స్‌ను అప్‌డేట్‌చేస్తూ వస్తోంది. ఇప్పటికీ ఈ యాప్ విషయంలో ఉన్న అసంతృప్తి ఏంటంటే..? మల్టీ డివైజ్ సపోర్ట్ లేకపోవడం. గతేడాదే ఈ ఫీచర్ వాట్సాప్ పరీక్షించినప్పటికీ ఎందుకో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురాలేదు. ఇప్పుడు మళ్లీ ఆ సదుపాయాన్ని వాట్సాప్ పరీక్షిస్తోంది. ప్రస్తుతం 2.20.143 ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో ఈ ఫీచర్ కనిపించిదట.
వాట్సాప్ ఒక డివైజ్‌లో వాడుతున్నప్పుడు ఇంకో డివైజ్‌లో వాడలేం. ఒకవేళ అందులో వాడాలంటే ఇంకో దానిలో వాట్సాప్ పనిచేయదు. రెండు చోట్లా వాడాలనుకునేవారు ఈ విషయంలో నిరాశకు గురౌతున్నారు. ప్రస్తుతం ఏక కాలంలో ఒకే అకౌంట్ వాడాలంటే ఉన్న ఏకైక ఆప్షన్ వాట్సాప్ వెబ్ మాత్రమే. అయితే, ఈ మల్టీ డివైజ్ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే అందుబాటులోకి వస్తే ఒక ఫోన్, టాబ్లెట్ లేదా ఒకటి కంటే ఎక్కువ స్మార్ట్‌ఫోన్లు కలిగి ఉన్నవారికి ఇది ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్‌తో ఒకేసారి రెండు వేర్వురు ఫోన్లలో వాట్సాప్‌ను వినియోగించుకోవచ్చు.

0 Post a Comment:
Post a Comment