Tuesday 21 April 2020

THE CENTRAL CIVIL SERVICES (CLASSIFICATION, CONTROL AND APPEAL) RULES, 1965 (సిసిఏ నిబంధనలు)



THE CENTRAL CIVIL SERVICES (CLASSIFICATION, CONTROL AND APPEAL) RULES, 1965 (సిసిఏ నిబంధనలు)







 

   రాష్ట్ర సివిల్ సర్వీసులకు చెందిన ఉద్యోగులందరికీ ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీస్ (క్లాసిఫికేషన్,కంట్రోలు అండ్ అప్పీల్)రూల్సు,1991 వర్తిస్తాయి.ప్రొవిన్షియలైజేషన్ చేయబడినందున పంచాయితీరాజ్ పాఠశాలల ఉపాధ్యాయులకు కూడా ఈ నిబంధనలు వరిస్తాయి.

వర్గీకరణ (Classification) :
రాష్ట్ర సివిల్ సర్వీసు ఉద్యోగులు
1.రాష్ట్ర సర్వీసులు,
2.సబార్డినేట్ సర్వీసుల క్రింద వర్గీకరించబడుదురు.

అజమాయిషీ  (Control) : 
ఉద్యోగి తన విధి నిర్వహణలో నిర్లక్ష్యము,లేక ఉపేక్ష వహించిన సందర్భములలో ఈ క్రింది క్రమశిక్షణా చర్యలు తీసికొనబడును.

ఎ) స్వల్ప దండనలు : 
1. అభిశంసన,
2. పదోన్నతి నిలుపుదల, 
3. ప్రభుత్వమునకు కలిగిన ఆర్థిక నష్టమును రాబట్టుట,
4. ఇంక్రిమెంట్లు నిలుపుదల, 
5. సస్పెన్షన్.

బి) తీవ్ర దండనలు : 
1. సీనియార్టీ ర్యాంకును తగ్గించుట లేక క్రింది పోస్టునకు /స్కేలునకు తగ్గించుట.
2. నిర్బంధ పదవీ విరమణ,
3. సర్వీసు నుండి తొలగించుట  (Removal), 
4. బర్తరఫ్ (Dismissal) (సర్వీసు నుండి తొలగించబడిన ఉద్యోగి భవిష్యత్తులో తిరిగి నియామకం పొందుటకు అర్హుడు.కాని డిస్మిస్ చేయబడిన ఉద్యోగి భవిష్యత్ నియామకము నకు అర్హుడు కాడు)

దండనలు విధించు అధికారము : 
సాధారణంగా నియామకపు అధికారి లేక సంబంధిత ఉన్నతాధికారి పైన పేర్కొనిన స్వల్పదండనలతో పాటు తీవ్ర దండనలను కూడావిధించవచ్చు.జిఓ.నం. 538,తేది.20-11-1998 ప్రకారం ఆం.ప్ర. స్కూల్ ఎడ్యుకేషన్ సబార్డినేట్ సర్వీస్ నిబంధనలలోని ఉపాధ్యాయ క్యాడర్లందరికీ (Non-Gazetted) జిల్లా విద్యాశాఖాధికారి నియామకాధికారై వున్నారు.జిఓ. నం.505,తేది.16.11.1998 ప్రకారం ఉన్నత పాఠశాలలప్రధానోపాధ్యాయులు ఎంఇఓలు,డైట్ లెక్చరర్లకు పాఠశాల విద్య ప్రాంతీయ డైరెక్టరు క్లాస్ III వారికి DSE ఆపై వారికి ప్రభుత్వం నియామక అధికారులు వున్నారు.  క్రమశిక్షణా చర్యలు తీసుకొను అధికారం నియామకాధికారులకు మాత్రమే యుండును.అయితే ఎంఇఓ, హైస్కూల్ హెడ్మాష్టర్లకు స్వల్ప దండనలు విధించు అధికారము డిఇఓలకు దఖలు చేయబడినది (జిఓ 40) DEO,RD విధించినదండనలపై DSEగారికి అప్పీలు చేసుకోవాలి.

దండనలు విధించు విధానము : 
స్వల్ప దండనలు విధించు సందర్భములో ఉద్యోగిపై మోపబడిన అభియోగములను,శిక్షాచర్య తీసుకొనుటకు ప్రతిపాదనలను వ్రాత పూర్వకముగా ఉద్యోగికి తెలియజేయాలి.దానిపై ఉద్యోగి వివరణ యిచ్చుకొనుటకు అవకాశము ఇవ్వాలి.తీవ్ర దండనలు విధించుటలో మాత్రం నిర్దిష్టమైన పద్ధతిని అనుసరించ వలసియున్నది.

1. విచారణాధికారి నియామకం,
2. చార్జిషీటు యిచ్చుట, 
3. ప్రతిపాదిత ఆరోపణలపై మౌఖిక లేక వ్రాత పూర్వక ప్రతిపాదనా వాజ్ఞ్మూలమును ఇచ్చుటకు ఉద్యోగికి అవకాశం కల్పించుట, 
4. వివిధ సాక్ష్యములను రికార్డు చేయుట, 
5. విచారణాధికారి నిర్ధారణలను పేర్కొనుట,
6. విచారణాధికారి నివేదికను ఉద్యోగి కందించి అతని ప్రాతినిధ్యమును తీసుకొనుట, 
7. శిక్షించు అధికారి అంతిమ నిర్ణయంఅనే విధానమును అనుసరించవలసి వున్నది.

సస్పెన్షన్ : 
తీవ్ర అభియోగములపై విచారణజరుగుచున్నప్పుడు,లేక క్రిమినల్ అభియోగము పై దర్యాపు,లేక కోర్టు విచారణ జరుగుచున్నప్పుడు మాత్రమే ప్రజాహితం దృష్ట్యా ఒక ఉద్యోగిని సస్పెన్షన్లో వుంచవచ్చును.సస్పెన్షన్ ఉత్తర్వు ఉద్యోగికి అందజేయ బడిన తేదీ నుండి మాత్రమే అమలులోనికి వచ్చును. ఉద్యోగికి 48 గంటలకు మించిన జైలు శిక్ష విధించబడినప్పుడు లేక డిటెన్షక్రింది 48 గంటలు కస్టడీలో వుంచబడినప్పుడు అట్టి తేదీ నుండి సస్పెన్షన్లో వుంచబడినట్లు పరిగణిస్తారు. సస్పెన్షన్ కాలములో ఎఆర్-53 ననుసరించి అర్థజీతపు సెలవు కాలపు జీతమునకు సమానంగా సబ్సిస్టెన్సు అలవెన్సును యిస్తారు.6 నెలల తర్వాత దానిని 50% పెంచడంగాని, తగ్గించడంగాని చేయవచ్చును. నియామకాధికారికి పై అధికారి తన సమీక్షానంతరం దానిని కొనసాగించడం గాని, తగ్గించడంగానిచేయవచ్చును. నియామకాధికారికి పై అధికారి తన సమీక్షానంతరం దానిని కొనసాగించవచ్చు.విచారణలో నుండగా సస్పెన్షన్ శిక్షా చర్యగాదు.పాకిక్షక నిర్దోషి అని తేలితే సబ్సిస్టెన్స్ అలవెన్సుకు తగ్గకుండా జీతం నిర్ణయం చేయవచ్చు.

అప్పీలు (Appeal) :    
సస్పెన్షన్లో వుంచబడిన లేక విధించబడిన శిక్ష అన్యాయమైనదిగా భావించినప్పుడు యీ నిబంధన యొక్క అనుబంధములో చూపబడిన సంబంధిత అప్పిలేట్ అధికారికి మూడు నెలల గడువులోగా అప్పీలు చేసుకొనవచ్చు.చివరిగా ప్రభుత్వమునకు అప్పీలు చేసుకొనవచ్చు.          
      


                       

CLICK HERE TO DOWNLOAD

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top