Tuesday 21 April 2020

అర్ధవేతన సెలవులు (HALF PAY LEAVES)

అర్ధవేతన సెలవులు (HALF PAY LEAVES)










●   ఈ సెలవుల ప్రస్తావన AP Leave Rules నందు13,18,23 నందు పొందుపరచారు.

●   సర్వీసు రెగ్యులరైజ్ అయిన తరువాత నియామక తేది నుండి ప్రతి సంవత్సరము 20 రోజుల అర్ధవేతన సెలవు జమచేయబడుతుంది.

●   సంవత్సరము నకు కొన్ని రోజులు తక్కువైనను ఈ సెలవు రాదు. (G.O.Ms.No.165 Dt:17-08-1967)

ఉదా: ఒక ఉద్యోగి 25.04.1990 న అపాయింట్ అయ్యి 31.12.2020 న రిటైర్ అవుతాడు అనుకుంటే అతని HPL ఖాతా లెక్కింపు విధానం.

25.04.1990 నుండి 24.04.2020 వరకు 30 ఏళ్ళ సర్వీసుకు 30×20=600 రోజులు జమ చేస్తారు.

25.04.2020 నుండి 31.12.2020 వరకు ఉన్న సర్వీస్ పీరియడ్ కు హాఫ్ పే లీవ్ ఏమి జమ కాదు.
కారణం: ఒక సంవత్సరము సర్వీస్ కు  కొన్ని రోజులు తక్కువైన ఈ సెలవు జమ కాదు

●   ఈ సెలవు జమచేయుటకు డ్యూటీ కాలముతో పాటు అన్ని రకాల సెలవుల పై వెళ్ళిన కాలాలను కూడా పూర్తి సంవత్సరమునకు సర్వీసు క్రింద పరిగణిస్తారు.

●   EOL కి వెళ్లినా కూడా ఆ పీరియడ్ కి కూడా ఈ సెలవు మంజూరు చేస్తారు.అందుకే దీనిని "Un earned leave" అంటారు.

●   అర్జిత (Earned Leave) మాదిరి జనవరి నెల మొదట,జూలై నెల మొదట తేదిన అర్ధవేతన సెలవు జమచేయరు. సంవత్సరము సర్వీసు పూర్తి చేసిన తర్వాతనే సగం జీతపు సెలవు ఖాతాకు జమచేస్తారు.
 అర్ధవేతన సెలవు రెండు రకాలుగా మంజూరు చేస్తారు.

1.వైద్య ధృవపత్రం ఆధారంగా (Medical Certificate)

2. స్వంత వ్యవహారాలపై (Private Affairs)


●   సంపాదిత సెలవు నిల్వయున్నను అర్ధవేతన సెలవు వాడుకోవచ్చును. ఇంక్రిమెంట్లు,సర్వీసుకు ఎటువంటి ఆటంకం కలగదు.

●   వైద్య కారణముల పై అర్ధవేతన సెలవు పెట్టి పూర్తి జీతం పొందుటను కమ్యూటెడ్ సెలవుఅందురు. సెలవు పెట్టిన రోజులకు రెట్టింపు రోజులు అర్ధజీతపు సెలవు ఖాతా నుండి తగ్గిస్తారు.  [APLR 15(B) & 18(B)]

●   కమ్యూటెడ్ సెలవును 180 రోజుల నుండి 240 రోజులకుపెంచడమైనది.
(G.O.Ms.No.186 Dt:23-07-1975)

●   సర్వీసు మొత్తంలో 480 రోజుల అర్ధజీతపు సెలవుల స్థానంలో240 రోజుల పూర్తి జీతం పొందవచ్చు [Rule 15(B)]

●   240 రోజుల పూర్తి జీతం వాడుకోగా మిగిలిన సెలవులను అర్ధజీతంతో మాత్రమే వాడుకోవాలి.

●   వైద్యకారణాల పై సెలవు పొందాలంటే Form - A,B లను సమర్పించాలి.

●   వ్యక్తిగత అవసరాలకు అర్ధవేతన సెలవును వినియోగించుకున్నచో వేతనం,డి.ఏ సగము మరియు అలవెన్సులు పూర్తిగా చెల్లిస్తారు. 
(Memo No.3220/77/A1/PC-01/05 Dt:19-02-2005) , 
(Memo No.14568/63/PC-1/A2/2010 Dt:31-01-2011) ●   అర్దవేతన సెలవు 180 రోజులు దాటినచో HRA,CCA లు చెల్లించబడ వు.

●   క్యాన్సర్,మానసిక జబ్బులు,కుష్టు,క్షయ, గుండె జబ్బు,మూత్రపిండాల వైఫల్యం వంటి ధీర్ఘకాల వ్యాధులకు చికిత్స పొందుతున్న వారు సంబంధిత వైద్య నిపుణుడి ధృవపత్రం ఆధారంగా 6 నెలల గరిష్ట పరిమితితో తన ఖాతాలో నిల్వయున్న అర్ధవేతన సెలవులను వినియోగించుకుని పూర్తివేతనం పొందవచ్చును. 
(G.O.Ms.No.386 Dt:06-09-1996) 
(G.O.Ms.No.449 Dt:19-10-1976)

●   వ్యాధిగ్రస్తులకు 8 నెలల వరకు HRA,CCA లు పూర్తిగా చెల్లిస్తారు. 
(G.O.Ms.No.29 Dt:09-03-2011)

●   ఎట్టి పరిస్థితులలోనూ కమ్యూటెడ్ సెలవును HPL గా మార్చుకొనుటకు వీలులేదు. (G.O.Ms.No.143 Dt:01-06-1968)

●   ఇట్టి సెలవు వినియోగించుకున్న తర్వాత ఉద్యోగి తిరిగి డ్యూటీలో చేరాలి.కాని ఏ కారణం చేతనైనా రాజీనామా చేయుటకు గాని,లేక పదవీ విరమణ చేయుటకు గాని సిద్దపడినట్లయితే అట్టి సందర్భాలలో అంతకుముందే మంజూరైన కమ్యూటెడ్ సెలవును సగం జీతం సెలవుగా మార్చి అధికంగా పొందిన సెలవు జీతం అట్టి ఉద్యోగి నుండి తిరిగి రాబట్టాలి.

●   సెలవు పెట్టి తిరిగి డ్యూటీలో చేరకముందే ఉద్యోగి మరణించినా కమ్యూటెడ్ సెలవు మరియు సగం జీతం సెలవు జీతాలలో తేడాను అట్టి ఉద్యోగి నుండి తిరిగి వసూలు చేయనవసరం లేదు 
(G.O.Ms.No.33 F&P Dt:29-01-1976)

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's need

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More
Top