ఆన్‌లైన్‌లో రాష్ట్ర ప్రథమ పౌరుడు ( గవర్నర్ )
❖ రాష్ట్ర ప్రథమ పౌరుడైన గవర్నర్‌ను కలవాలనుకునే సందర్శకులు ఇకపై ఆయన అపాయింట్‌మెంట్‌ను ఆన్‌లైన్‌లో పొందవచ్చు.
❖ నూతనంగా రూపొందించిన ‘ఏపీ రాజ్‌భవన్ వెబ్‌సైట్’ ద్వారా ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.
❖ ఈ వెబ్‌సైట్‌ను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సోమవారం ఆవిష్కరించారు.
❖ ఈ-విజిట్ సదుపాయంతో సందర్శకులు గవర్నర్ అపాయింట్‌మెంట్‌ను ఆన్‌లైన్‌లో కోరవచ్చు. వాటిని రాజ్‌భవన్ అధికారులు పరిశీలించిన తర్వాత అపాయింట్‌మెంట్ సమాచారాన్ని సందర్శకులకు పంపుతారు.
❖ ఫిర్యాదులనూ ‘ఈ-గ్రీవెన్స్’ ద్వారా చేయవచ్చు.
ఇందుకోసం క్రింది వెబ్ సైట్ లను సందర్శించవచ్చన్నారు.
0 Post a Comment:
Post a Comment