యవ్వనంగా ఉంచే ఆహార పదార్ధాలు
అసలైన అందం, మనిషి లోపలి నుండి వస్తుందనడంలో ఏ సందేహం లేదు. కాబట్టి ముడతలు పడ్డ చర్మానికి క్రీమ్స్, అనేక రకాల ఫేస్ ప్యాక్ లను ఉపయోగించడం మానివేయండి. యవ్వనంగా కనిపించేలా చేసే ఆహారాన్ని మాత్రమే తీసుకోండి. మీలో యవ్వనాన్ని తిరిగి తెచ్చే ఆహార పదార్థాల గురించి మీకు అందిస్తున్నాం.
1) కొబ్బరి నూనె:
శరీరానికి అవసరమయ్యే ఆయిల్ ని కొబ్బరి నూనె మీకు అందిస్తుంది. మీరు దాన్ని శరీరంపై ఉపయోగించినప్పుడు అది చర్మం లోపలికి వెళ్లి, మీ చర్మానికి ముడతలు పడకుండా ఉంచడంతోపాటు, వెరికోస్ వేన్స్, సెల్యూలైట్ రాకుండా చేస్తుంది. ఈ కొబ్బరి నూనెని వంటల్లో ఉపయోగించినప్పుడు అది మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు లివర్ పై ఎలాంటి హానికర ఒత్తిడి కలగకుండా చేస్తుంది.
2) బెల్ పెప్పర్స్ (రంగుల క్యాప్సికమ్):
ఎరుపు, ఆరెంజ్, పసుపు రంగుల్లో ఉండే క్యాప్సికమ్స్ తినడం ద్వారా చర్మంపై ఉన్న ముడతలు తొలగిపోతాయి. ఈ క్యాప్సికమ్స్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు.. సూర్య కిరణాల ద్వారా మీ చర్మానికి కలిగే హాని నుంచి కాపాడతాయి.
3) డార్క్ చాక్లెట్:
చాక్లెట్లని ఇష్టపడని వారెవరూ ఉండరు. అయితే చాక్లెట్లు తినడం ద్వారా వయసు ఎక్కువగా కనిపించదని అంటున్నారు. చాక్లెట్లలో ఉండే కొకొవాలో యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ ఎక్కువగా ఉండి మరింత యవ్వనంగా కనబడతాం.
4) ఫ్లాక్స్ సీడ్ (అవిసె గింజలు):
ఈ ఫాక్పీడ్ లో మీకు ఒమేగా-3 ఫా యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు, కాపర్ ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల మీరు మరింత యవ్వనంగా కూడా కనబడతారు. మీ చర్మంలో ముడతలు పోయి, బొద్దుగా, ముద్దుగా కనబడతారు.
5) గ్రీన్ టీ:
గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. మిమ్మల్ని మరింత యవ్వనంగా కనపడేలా చేస్తుంది. ఈ గ్రీన్ టీ మీ చర్మాన్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో మీ చర్మం ముడతలు పడకుండా, కాంతిని వెదజల్లుతూ ఉంటుంది.
6) అరటి పండ్లు:
అరటి పండ్లలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
7) టమోటాలు:
టమోటాలు తినడం ద్వారా కూడా మీరు మరింత యవ్వనంగా కనబడతారు. టమోటాలు చర్మంలో ఉన్న కొల్లాజెన్ లెవెల్స్న పెంచి చర్మం ముడతలు 'పడకుండా ఉంచుతుంది. టమోటాల్లో ఉండే లైసోపీన్ మీ చర్మాన్ని సూర్యకిరణాల నుంచి పాడవకుండా కాపాడుతుంది. యవ్వనంగా కనబడేలా ఉంచే ఆహార పదార్థాల్లో టమోటాలు ప్రథమం అని చెప్పుకోవచ్చు.
8) బాదం పప్పు:
ఆరోగ్యవంతమైన జుట్టు, చర్మం కోసం మీ ఆహారంలో బాదం తప్పకుండా తీసుకోండి. బాదంలో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. ఈ విటమిన్-ఇ ముఖ్యంగా మీ చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా తయారు చేయడంతో పాటు 'సూర్యకిరణాల నుంచి కూడా ఇది మిమ్మల్ని కాపాడుతుంది.
9) స్ట్రాబెర్రీస్:
మీ పళ్ల రంగు మారి ఉంటే, మీ ఆహారంలో రోజూ స్ట్రా బెర్రీలని తీసుకోండి. స్ట్రా బెర్రీలలో ఉండే ఆస్టిజెంట్లు మీ పళ్లని, చిగుళ్లని బలంగా ఉంచి, రక్తస్రావం రాకుండా నివారిస్తుంది. మీ పళ్లలో వచ్చే కాంతి ద్వారా మీ పూర్తి ముఖం మారిపోతుంది.
10) రెడ్ గ్రేప్స్:
ఈ రెడ్ గ్రేప్స్ మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి దాని కాంతిని రెట్టింపు చేస్తుంది. చర్మంపై మచ్చలు పడకుండా ఉంచే రిస్వరట్రాల్ అనేది ఈ రెడ్ గ్రేప్స్ లో ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ 'ఆక్సిడెంట్ రెటీనాలో ఉండే కొల్లాజెన్ ని కూడా పెంపొందిస్తుంది. మీరు మరింత యవ్వనంగా కనబడేలా కూడా చేస్తుంది.
11) వాల్ నట్స్:
వెంట్రుకలు ఎర్రబడకుండా వాల్ నట్స్ కాపాడుతుంది. విటమిన్-ఇ, ఒమేగా-3 ఫాటీ యాసిడ్స్ వెంట్రుకలని బలంగా ఉంచి మెరిసేలా చేస్తుంది. ప్రతీరోజు ఒక పావు కప్పు వాల్ నట్స్ తినడం ద్వారా కలిగే మార్పులని మీరు స్పష్టంగా తెలుసు కోగలుగుతారు.
12) దానిమ్మ గింజలు:
పురాణాల్లో ఈ దానిమ్మ గింజలని దేవుడి ఫలాలుగా భావించేవారు. ఈ గింజలు అనేక యాంటీ ఆక్సిడెంట్లని కలిగి ఉంటుంది. ఇది మీ చర్మంపై ముడతలు పడకుండా చేసి, కాంతివంతంగా ఉంచుతుంది. సూర్య కిరణాల నుంచి కూడా మీ చర్మాన్ని కాపాడుతుంది.
13) క్యారెట్లు:
క్యారెట్లలో ఎక్కువగా ఉండే విటమిన్-ఎ చర్మంలో ఉండే కొల్లాజెన్ లెవల్స్ ని పెంచుతుంది. ఇందులో ఉండే విటమిన్-సి కూడా మీ రక్తప్రసరణని మెరుగుపరిచి మీకు బట్టతల రాకుండా చేస్తుంది. దీంతో మీ జుట్టు మరింత బలంగా, ఒత్తుగా కనబడుతుంది.
14) పుచ్చకాయ:
పుచ్చకాయ మీ చర్మం హైడ్రేట్ కాకుండా ఉంచుతుంది. ఇందులో ఎక్కువగా ఉండే లైసోపీన్ మీ చర్మానికి చెమట పట్టకుండా చేస్తుంది. ఎండాకాలంలో పుచ్చకాయలని తింటే మీరు వేడి నుంచి తట్టుకునేందుకు సన్ స్క్రీన్లని కూడా ఉపయోగించాల్సిన అవసరం లేదు.
15) అవకాడో:
అవకాడోలో విటమిన్-ఇ ఎక్కువగా లభ్యమవుతుంది. దీనివల్ల చర్మం మరింత కాంతివంతంగా, అందంగా తయారవుతుంది. అవకాడోలతో ఫేస్ మాస్క్ వల్ల మీ చర్మం మరింత కాంతివంతంగా తయారవుతుంది. మీ ఇంట్లో కూడా ఈ అవకాడో ఫేస్ మాస్క్ ని తయారు చేసుకోవచ్చు. ఒక చెంచా తేనెలో అవకాడోని కలిపి ఫేస్ మాలా ఉపయోగించవచ్చు.
16) స్వీట్ పొటాటోస్(చిలగడ దుంపలు):
స్వీట్ పొటాటోలో బీటా కెరోటీన్లు, విటమిన్-ఎ ఎక్కువగా ఉంటుంది. వీటిలో ఉండే పోషకాలు మీ చర్మాన్ని మరింత కాంతివంతంగా తయారు చేస్తుంది. సూర్యకిరణాల నుంచి మీ చర్మాన్ని కాపాడి మరింత ఆరోగ్యంగా ఉంచుతుంది.
చివరగా గడిచిన కాలాన్ని వెనక్కి తీసుకొని రాలేం. కాబట్టి ఇక్కడ మీకిచ్చిన లిస్ట్ లోని ఆహార పదార్థాలని తినడం ద్వారా మీ చర్మం మరింత ఆరోగ్యంగా తయారవుతుంది. మిమ్మల్ని మరింత యవ్వనంగా కనబడేలా చేస్తుంది.
0 Post a Comment:
Post a Comment