Tuesday 12 November 2019

హోమ్ లోన్ తీసుకుంటున్నారా ? ఇలా చేస్తే రూ.7 లక్షలు లాభం.



హోమ్ లోన్‌ను ఒకరి పేరుపై కాకుండా ఇద్దరు కలిసి తీసుకోవచ్చు.

వీటిని జాయింట్ హోమ్ లోన్‌గా పరిగణస్తారు.

జాయింట్ హోమ్ లోన్‌‌తో పలు ప్రయోజనాలు పొందొచ్చు.

ఇద్దరికీ పన్ను మినహాయింపు లభిస్తుంది.










జాయింట్ హోమ్ లోన్స్ వల్ల పలు ప్రయోజనాలు పొందొచ్చు. అవేంటో చూద్దాం...

🔹1. తక్కువ ఆధాయం, క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉండటం, డెట్ టు ఇన్‌కమ్ రేషియో ఎక్కువగా ఉండటం వంటి పలు అంశాల నేపథ్యంలో ఒకరి పేరుపై హోమ్ లోన్ కష్టతరం కావొచ్చు. అంటే బ్యాంకులు వీళ్లకు లోన్‌ ఇవ్వకపోవచ్చు. ఇలాంటి సమయంలో జాయింట్ హోమ్ లోన్ తీసుకుంటే రుణ అప్రూవల్ త్వరితగతిన లభించే అవకాశముంది. ఇక్కడ కోఅప్లికెంట్‌కు స్థిర ఆదాయం, మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే అప్పుడు లోన్ సులభంగానే మంజూరు అవుతుంది.

🔹2. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సీ, 23 బీ కింద లోన్ మొత్తం, వడ్డీ చెల్లింపుపై పన్ను మినహాయింపు పొందొచ్చు. చెల్లించిన రుణ మొత్తంపై ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు మినహాయింపు లభిస్తుంది. అలాగే వడ్డీ చెల్లింపుపై రూ.2 లక్షల వరకు మినహాయింపు ప్రయోజనం ఉంది. జాయింట్ హోమ్ లోన్ తీసుకుంటే ఇద్దరికీ మొత్తంగా రూ.7 లక్షల వరకు ప్రయోజనం లభిస్తుంది.

🔸3. జాయింట్ హోమ్ లోన్‌లో మహిళ కోఅప్లికెంట్‌గా ఉంటే అప్పుడు వడ్డీ రేట్లపై రాయితీ కూడా పొందే ఛాన్స్ ఉంది. బ్యాంకులు సహా ఇతర ఆర్థిక సంస్థలు మహిళలకు తక్కువ వడ్డీ కే రుణాలు అందిస్తాయి. మగవారితో పోలిస్తే వీరికి 5 బేసిస్ పాయింట్ల తక్కువ వడ్డీకే రుణాలు లభిస్తాయి.

🔸4. మహిళల పేరుపై ప్రాపర్టీని రిజిస్టర్ చేయిస్తే స్టాంప్ డ్యూటీ చార్జీలు తగ్గించుకోవచ్చు. స్టాంప్ డ్యూటీ చార్జీలు రాష్ట్రం ప్రాతిపదికన మారుతూ ఉంటుంది. రాష్ట్రాలు సాధారణంగా మహిళలకు స్టాంప్ డ్యూటీలో 1 నుంచి 2 శాతం తక్కువ చార్జీలను విధిస్తాయి. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, ప్రాపర్టీ ట్రాన్స్‌ఫర్‌కు సంబంధించిన ఇతర వ్యయాలపై పన్ను మినహాయింపు ఉంటుంది.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top