Monday 8 July 2019

3వ మెధడాలజీ అంటే ఏమిటి? దానివలన పదోన్నతులకు జరిగే నష్టం ఏమిటి?









    ఉదాహరణకు  ఒక వ్యక్తి BEd., రెండు మెథడాలజీ లతో చేస్తాడు.లెక్కలు,సైన్సు సబ్జెక్ట్స్ తో BEd ., చేసిన వ్యక్తి DSC ద్వారా SGT గా సెలెక్ట్ కాబడి ప్రాధమిక పాఠశాలలో పనిచేస్తున్న SGT తన సబ్జెక్ట్స్  లెక్కలు లేదా సైన్స్ సబ్జెక్ట్  లో SAగా పదోన్నతి పొందాలి. ఆ పదోన్నతులు వెంటనే రావడం లేదని తెలుగు లేదా హిందీ భాషల్లో పదోన్నతి త్వరగా పొందవచ్చు అనే ఉద్దేశంతో ఈ 3వ మెధడాలజీ చేస్తారు.

    3వ మెధడాలజీ ఇది ఒక సర్టిఫికెట్ కోర్సు హిందీ పదోన్నతి పొందగోరే SGTలు (వారు చేసిన రెండు మేథోడాలజీ లు లెక్కలు,సైన్సు తో పాటు)హిందీ డిగ్రీ సర్టిఫికెట్లు మధ్యమ విశారదా,విద్వన్ మొదలైనవి చాలా తేలికగా పొందుతున్నారు.ఇక ట్రైనింగ్ సర్టిఫికెట్ కొరకు ఇదిగో ఈ 3వ మెధడాలజీ కోర్సు ఉస్మానియా విశ్వవిద్యాలయం లో దూరవిద్య ద్వారా పొందుతారు.ఇంకేముంది మాకు అర్హత ఉంది అని పదోన్నతులు   పొందుతున్నారు.

   భాషోపాధ్యాయులు మాత్రం ప్రాధమిక నుండి ప్రవీణ్ వరకు 5సంవత్సరాలు ఒక్కో కోర్సు చేసుకొని, ఆతరువాత LP సెట్ రాసి సీటు వస్తే పండిట్ ట్రైనింగ్ లేదా హిందీ BEd., చేసి DSC సెలెక్ట్ కాబడి LP లేదా SA గా ఉద్యోగం పొందుతారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే LP కు SA కు ఒకే విద్యార్హతలు ఉండడం SGTలకు వరం అయింది.

    LP గా జాయిన్ అయి పనిచేస్తున్న హిందీ,తెలుగు ఉపాధ్యాయులు LP లు గా ఎందుకు మిగులు తున్నారు?  అంటే SGT లు వారు సర్టిఫికెట్స్ పొందిన తేదీ నుండి వారి సీనియారిటీ ని లెక్కించకుండా వారు ఉద్యోగంలో చేరిన నాటి నుండి సీనియారిటీ లెక్కలోకి తీసుకొని వారికి పదోన్నతి ఇస్తున్నారు.కానీ G.O No 12 లో కాలం 3 లో స్పష్టంగా అర్హత పొందిన నాటి నుండి లెక్కలోకి తీసుకొమ్మని ఉంది. కానీ ఎవరూ దానిని పాటించడం లేదు.చివరకు భాషోపాధ్యాయులు అడగడం లేదు.

    3వ మెధడాలజీ అర్హత లేదు .ఎందుకంటే ఈ కోర్సు నిర్వహిస్తున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం చెప్పినది ఏమిటి అంటే ఈ కోర్స్ భాషా నైపుణ్యం పెంచుకోవడానికి, పాఠశాలలో భాషోపాధ్యాయుడు లేని సమయం లో బదులుగా ఏర్పాటుకు ఉపయోగపడు కోర్సు అని.

    ఈ 3వ మెధడాలజీ పై 2015 లో ట్రిబ్యునల్ లో ను 2017 లో హైకోర్టు లోను 2018 DSC నోటిఫికేషన్ పైన 3వ మెధడాలజీ చెల్లదని తీర్పులు పొందడం జరిగింది.వీటి ప్రకారం రాష్ట్రంలో 2017 పదోన్నతులలో 3వ మెధడాలజీ చేసిన SGT లను  సీనియారిటీ జాబితా నుండి తొలగించిరి.ఈ కృషి ఫలితంగా ప్రభుత్వం G.O No 14,15 లను భాషల రక్షణకు జారీ చేసింది

     దీనితో సీనియారిటీ జాబితా లో మిగిలి ఉన్న అర్హత కలిగి ఉన్న SGT లు కూడా తొలగించారు. కేవలం భాషోపాధ్యాయులకు మాత్రమే 2017 లో పదోన్నతులు కల్పించారు.

 ఇప్పుడే అర్హత కలిగిన SGT లు కోర్టుకు వెళ్లి OA 317 ను సాధించారు
     1.అర్హత కలిగిన SGT లు అంటే ఎవరు?
     2.అర్హత లేని SGT లు అంటే ఎవరు?

    అర్హత కలిగిన SGT లు అనగా  వీరు హిందీ ,తెలుగు భాషలలో భాషా ప్రవీణ్ లేదా డిగ్రీ స్థాయి లో స్పెషల్ సబ్జెక్టుగా హిందీ ,తెలుగు చదివి LP CET రాసి BEd., చేసిన వారు. అనగా BEd., నందు హిందీ,లెక్కలు (భాష తో పాటు మరో సబ్జెక్ట్ తోచేసిన వారు)చేసిన  వీరు  DSC రాసినపుడు కొంతమంది SGTగా  సెలెక్ట్ కాబడి ఉద్యోగం చేస్తున్నారు.కొంతమంది LP లు గా ఉద్యోగం పొందారు.వీరు అర్హత కలిగిన SGTలు.

     2017 ఫిబ్రవరి 5 లో G.O No 14,15 లు వచ్చాయి. దీనితో సీనియారిటీ లిస్ట్ నుండి అర్హత కలిగిన SGT లను కూడా తొలగించి కేవలం భాషాపాధ్యాయులకే పదోన్నతులు ఇచ్చారు.

    ఐతే కోర్టు కు వెళ్లిన అర్హత కలిగిన SGTలు 2017 లో పదోన్నతి పొందిన తెలుగు ,హిందీ వారిని రివర్షన్ చేయమని ఆర్డర్స్ తెచ్చారు.అపుడు హైకోర్టు నందు గుంటూరు,కృష్ణా జిల్లాల వారికి ఇచ్చిన  రివర్షన్ నిలుపుదల ఉత్తర్వులు తెచ్చింది. ఆ తరువాత ఈ కేసు సుప్రీంకోర్టు కు న్యాయం కోసం వెళ్లింది.  దీనితో ఇప్పుడు మిగిలిన 30% పదోన్నతులు ఇవ్వడానికి రంగం సిద్ధమైంది. కోర్టు అర్హత కలిగిన ఆనాటి ఫిబ్రవరి5 న 2017 నాటికి సీనియారిటీ లిస్ట్ లో ఉన్నవారికి ఇమ్మంటే మన వాళ్ళు అర్హత లేని SGT ల తో కూడిన లిస్టులు ఇప్పుడు విడుదల చేస్తున్నారు. అదేమిటి అంటే కోర్టు OA 317 ప్రకారం అని చెబుతున్నారు. కోర్టు ఎప్పుడూ అర్హత లేనివారికి ఇమ్మని చెప్పదు. ఈ OA317 పై సుప్రీంకోర్టు ఆ నాటికి అమలు లో ఉన్న GO ల ప్రకారమే ఇమ్మని చెప్పింది.కానీ అర్హత లేని SGTలకు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు.

ఎవరు అర్హత లేని SGTలు ?

    వీరు BEd.,లొ రెండు మేథోడాలజీ లు వేరే సబ్జెక్ట్స్ తో చేసి.హిందీ,తెలుగు సెర్టిఫికెట్లు పొంది, మూడవ మేథోడాలజీ ఉస్మానియా విశ్వవిద్యాలయం లో దూరవిద్య ద్వారా చేసిన వారు. వీరు పదోన్నతికి ముమ్మాటికీ అనర్హులు. ఇప్పటివరకు అన్ని జిల్లాలలో3వ మేథోడాలజీ చేసిన SGTలకు పదోన్నతులు ఇచ్చారు. ఇది పూర్తిగా GOలను ఉల్లంఘించారు.

    ఎందుకంటే GO 12 ద్వారానే SA భాషలుగా పదోన్నతులు ఇవ్వడం జరుగుతుంది. ఈ GO 12 లో  హిందీ ఉపాధ్యాయుల అర్హతలలో మేథోడాలజీ అనే పదం గాని, MA అని గాని ఇవ్వలేదట. అలాంటప్పుడు GO లో లేని అర్హతలకు పదోన్నతి ఎలా ఇస్తారు? దీని పై పోరాడి విజయం సాధించింది.

    కానీ ఇప్పుడు అడ్డదారిలో పదోన్నతులు పొందేందుకు తిరిగి 3వ మేథోడాలజీ SGTలు పోరాడుతున్నారు. ఎటువంటి అవాంతరాలు లేకున్నా, కోర్టు కేసులు పెండింగ్ లో లేకపోయినా అప్గ్రేడేషన్ నిలిపివేశారు. కేవలం వీరి స్వార్ధం కోసమే.

 G.O No 14,15 లు G.O No 12 కు సవరణ GO లు మాత్రమే.
 GO 12 లో  SGTలు పండిట్స్ పదోన్నతులు పొందవచ్చు, అలాగే LP లు SA లు గా మెయిన్ సబ్జెక్ట్స్ కు వెళ్ళవచ్చు. దీని వలన మనకు లాభం లేకపోగా SGTలు LP ల పదోన్నతులు పొందారు. దీనిని గమనించిన ప్రభుత్వం ఈ తప్పును 14,15 GO ల సవరణ ద్వారా సరి చేశారు. ఈ GO ల ద్వారా ఎవరి సబ్జెక్ట్స్ లో వారే పదోన్నతులు పొందేలా సరి చేయడం జరిగింది. ఇలా క్రాస్ ప్రమోషన్స్ ను ఈ GO ల ద్వారా అడ్డు కట్ట వేశారు.

 GO.Ms.No.12, Dated: 23-01-2009 
GO.Ms.No.14, Dated: 05-02-2017
GO.Ms.No.15, Dated: 05-02-2017
OA317- CSE GUIDELINES

1 comment:

  1. **** ee dots tho unna hindi Lp la results yeppudu release chestaru. ...

    ReplyDelete

Latest info

More

Teacher's need

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More
Blinking Text
Top