Monday, 6 May 2024

ఓటు వేశారా..! వేలికి చుక్క ఏదీ..?

 ఓటు వేశారా..! వేలికి చుక్క ఏదీ..?




• 1950లోనే పేటెంట్

• 5 ఎంఎల్ సిరా 300 మందికి వస్తోంది.

• పలు దేశాలకు మనదేశం నుంచే సిరా సరఫరా

• కర్ణాటకలోని మైసూరులో తొలిసారిగా సిరా వాడకం

ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్ లో ఓటు వేసిన వారందరికీ సిరాచుక్క పెట్టడం తెలిసిందే. మరోసారి ఓటు వేయడానికి అవకాశం లేకుండా ఇదో ఏర్పాటు. ఒకసారి సిరా గుర్తు వేలిపై పడితే కొన్ని రోజుల పాటు చెరిగిపోదు. సాధారణంగా ఓటర్కు ఎడమ చేతి చూపుడువేలికి సిరా చుక్క పెట్టడం తెలిసిందే. అయితే వృద్ధులకు సహాయ కులకుగా వెళ్లే వారికి కూడిచేతి చూపుడు వేలుకు సిరాచుక్క పెడతాడు. స్నేహితులు, బంధువులు ఓటు వేశారా... అయితే సిరా చుక్క ఏది అంటూ ప్రశ్నించడం తెలిసిందే. అంటే ఓటు హక్కు విని యోగించుకున్నారనటానికి అదే సాక్ష్యాధారం. అందుకే సిరా చుక్కకు అంతటి ప్రాధాన్యత ఉంటుంది. 

సిరాచుక్క ఎందుకు చెరిగిపోదంటే...

ఓటరు వేలికి వేసే సిరాలో 7.25 శాతం సిల్వర్ నైట్రేట్ ఉన్నందున వేసిన వెంటనే చెరిగిపోదు. సూర్యుని వెలుతురు తగలగానే ఆరిపోతుంది. 2000 ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఎన్నికల సమ యంలో ఓటరు ఎడమ చేతి చూపుడు వేలు గోరు పైభాగంపై సిరా గుర్తు వేస్తున్నారు. అంతకు ముం డు గోరు పైభాగపు చర్మంపైనే వేసేవారు.

సిరా తయారీ ఎక్కడంటే...

సిరాను కర్ణాటకలోని మైసూరుకు చెందిన మైసూరు పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ (ఎంపీనీఎల్) అనే కంపెనీ తయారు చేస్తుంది.

ఎన్నికల సమయంలో వినియోగించే సిరా డబ్బాలు:

1962లో సిరా ఉత్పత్తి కోసం ఈ కంపెనీకి అనుమతి ఇచ్చింది. నేషనల్ ఫిజికల్ లేబొరేటరీస్ పార్ములాతో సిరా ఉత్పత్తి బాధ్యతను ఈ కంపెనీకి అప్పగించారు. అప్పటి నుంచి దేశంలో ఎక్కడ ఎన్ని కలు జరిగినా, ఈ సిరాను సరఫరా చేస్తుంటారు.. ఓటర్లకు సిరా వేసే విధానం చాలకాలం పాటు లేదు. 1950లో ఈ సిరా పేటెంట్ను దేశంలోని నేష నల్ రీసెర్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఆర్డీసీ) పొందింది. 

మైసూరులో తయారీ. దేశవ్యాప్తంగా పంపిణీ...

సీఎస్ఐఆర్ (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రి యల్ రీసెర్చ్)కు చెందిన నేషనల్ ఫిజికల్ లాబ గౌరేటరీ (ఎన్పీఎల్) ఈ సిరాను అభివృద్ధి చేసింది. అటు తరువాత నీరా ఉత్పత్తికి మైసూరు పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ అనే చిన్న కంపెనీకి అనుమతి ఇచ్చింది. ఈ కంపెనీని 1937లో మైసూరు మహారాజు కృష్ణరాజ వడియార్ స్థాపిం చారు. ఈ కంపెనీ 1962లో జరిగిన మూడో సార్వ త్రిక ఎన్నికల సమయంలో తొలిసారి ఈ సిరాను. మైసూరు ప్రాంతంలోనే వినియోగించారు. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల పోలిం గ్ సమయంలో వాడుతున్నారు. 5 ఎంఎల్(మిల్లీలీటర్ల) సిరా ఆయిల్ 300 మందికి సరిపోతుందని అంచనా. ప్రస్తుతం నిర్వహించనున్న సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 97 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ క్రమంలో ఎన్నికల కోసం 30 లక్షల సిరా వాయిల్స్ అవసరం. ఇందుకోసం రూ.55 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.

పలు దేశాలకు ఎగుమతి:

పలు దేశాలకు సిరాను మనదేశం నుంచే ఎగుమతి చేస్తున్నారు. దేశీయంగా తయారవు తున్న సిరాకు అంతర్జాతీయంగా చాలా. డిమాండ్ ఉంది. మన దేశంలోని అన్ని రాష్ట్రాల ఎన్నికలకు సరఫరా అవసరం అయిన సిరాను ఎగుమతి చేస్తున్నారు. ప్రధా నంగా 1976 నుంచి 25 నుంచి 30 దేశాలకు ఇక్కడి నుంచి ఎగుమతి అవుతోంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, మయన్మార్, ఇరాక్, ఇండోనేషియా, లెబనాన్, అల్జీరియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, సూడాన్, సిరియా, టర్కీ, ఈజిప్టు, తదితర దేశాల్లో ఎన్నికల సమయంలో మనదేశపు సిరాను వినియోగిస్తారు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's need

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More
Top