Wednesday 1 May 2024

ఎన్నికల విధులలో విజయానికి (4) సూత్రాలు

 ఎన్నికల విధులలో విజయానికి (4) సూత్రాలు



(1) వ సూత్రం (మాక్ పోల్ ప్రొటోకాల్)

• ప్రిసైడింగ్ ఆఫీసర్ ముఖ్యవిధి మాక్ పోల్ నిర్వహించడం.

• సమయం ఉదయం 5:30 గంటలకు, ఏజెంట్లు రాకపొతే ఉదయం 5:45 గంటలకు మొదలుపెట్టాలి.

• మాక్ పోల్ నిర్వహణ Flow Chart దీనివెంట జతచేయడమైనది.

• హడావిడి లేకుండా అప్రమత్తతో మాక్ పోల్ శ్రద్ధతో చేయండి.

• మాక్ పోల్ లో ఎక్కడ తప్పు జరిగిన బాధ్యత PO దని గుర్తించండి.

మాక్ పోల్ తర్వాత సాధారణంగా జరిగే తప్పులు:

 i. CRC చేయకపోవడం

 ii. VVPAT Slips బయటకు తీయకపోవడం

 iii. మాక్ పోల్ సర్టిఫికేట్ 2 Sets (PO Report Part-1) తయారు చేయకపోవడం,

(2) వ సూత్రం EVM (ప్రోటోకాల్)

 (A) మాక్ పోల్ సమయంలో

• మాక్ పోల్ లో BU, CU & VVPAT లో ఏది చెడిపోతే (Defect) దాన్ని మాత్రమే మార్చాలి.

• BU పాడైతే BU, CU పాడైతే CU, VVPAT పాడైతే VVPAT మాత్రమే మార్చాలి.

మాక్ పోల్ లో పాడైన EVM / VVPAT లను వెంటనే Sector Officers ఇచ్చివేయాలి.

(B) పోల్ సమయంలో

• పోల్ సమయం లో BU పాడైన, CU పాడైన మొత్తం Set అనగా BU, CU& VVPAT లను మార్చాలి.

• మొత్తం Set ను మార్చినప్పుడు మాక్ పోల్ చేయాలి. పోటీ అభ్యర్ధులకు తల ఒక ఓటు వేయాలి.

• VVPAT పాడైతే కేవలం VVPAT ను మాత్రమే మార్చాలి.

• VVPAT పాడైనప్పుడు మాక్ పోల్ అవసరం లేదు.

(3)వ సూత్రం (CLOSE బటన్ ప్రోటోకాల్)

• పోలింగ్ పూర్తయిన తరువాత PO విధిగా చేయాల్సింది CLOSE బటన్ నొక్కడం,

• PO Report Part-3 CLOSE బటన్ నొక్కే దానిని గురించి తెలుపుతుంది. 

• ఈ రిపోర్ట్ ను CLOSE బటన్ నొక్కిన తరువాత నింపాల్సి ఉంటుంది. ఇది PO చివరిగా చేయాల్సిన పని. 

Close బటన్ నొక్కని CU లు లెక్కించడానికి ఇబ్బందులుంటాయని గుర్తించండి.

(4)వ సూత్రం (రిసెప్షన్ ప్రోటోకాల్)

రిసెప్షన్ ప్రోటోకాల్ లో తప్పకుండా గుర్తుంచుకోవలసినవిషయాలు:

• Actual Poll సమయంలో పాడైన BU, CU& VVPAT లను PO తన వెంట ఉంచుకోవాలి. Sector Officer & ఇవ్వకుండా రిసెప్షన్ సెంటర్ లో ఇవ్వాలి. Actual పోలింగ్ సమయలో పాడైన BU, CU& VVPAT తోపాటు Replace చేసిన BU, CU& VVPAT లను కలిపి రిసెప్షన్ సెంటర్ లో ఇవ్వాలి.

 • మాక్ పోల్ లో పాడైన EVMs/ VVPAT లు వెంటనే మీ పోలింగ్ కేంద్రం లోనే Sector Officer కి ఇచ్చివేయాలి.

• రిసెప్షన్ సెంటర్ లో విధిగా ఇవ్వవలసిన స్తాట్యుటరిలో అతి ముఖ్యమైనది Form -17C దీన్ని SEAL వేయకుండా 2 సెట్లు తయారు చేసి ఇవ్వాలి.

• PO Reports Part I, II, III, IV & V విధిగా సీల్ వేయకుండా అన్ని కాలమ్స్ నింపి ఇవ్వాలి. Report No. IV & V NIL Report ఉంటే  NIL అని వ్రాయాలి.

• మాక్ పోల్ లో VVPAT నుండి తొలగించిన Slips Black Cover లో పెట్టి విదిగా రిసెప్షన్ సెంటర్ లో అప్పగించాలి.

• VVPAT లోని Battery తొలగించి రిసెప్షన్ సెంటర్ లో అప్పగించాలి.

• ప్యాకెట్ 1 & 2 మెటిరియల్ ఒకే కౌంటర్ లో తీసుకుంటారు.

💥 పైన తెలిపిన (4) సూత్రాలు విదిగా మీరు పాటిస్తే మీ ఎలక్షన్ డ్యూటి విజయవంతమైనట్లే.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top