Thursday 11 April 2024

MOCK POLL (మాదిరి పోలింగ్) చేయు విధానము

 MOCK POLL (మాదిరి పోలింగ్) చేయు విధానము 



1. MOCK POLL 90 నిమిషాలకు ముందు ప్రారంభించాలి. కనీసం ఇద్దరు ఏజంట్ల సమక్షంలో MOCK పోల్ జరగాలి. సమయానికి ఏజంట్లు రాని పక్షంలో 15నిమిషాలు ఎదురుచూచి అప్పటికీరాకపోయినచో ఎవరుంటే వారి సమక్షంలో MOCK POLL జరిపించాలి.

2. MOCK పోల్ కు ముందు పోలింగ్ ఏజంట్ల సమక్షంలో CU లో క్లియర్ బటన్ నొక్కి తెరపై సున్న '0' ను వారికి చూపాలి.

3. అలాగే VVPAT లోని డ్రాప్ బాక్స్ ఖాళీగా ఉన్న సంగతి వారికి చూపాలి.

4. EVM (BU - VVPAT - CU) లను అనుసంధానం చెయ్యాలి.

5. CU బటన్ నొక్కగానే  VVPAT  డ్రాప్ బాక్స్ లోనికి 7 స్లిప్పులు పడతాయి.

6. తరువాత క్లియర్ బటన్ నొక్కి ఓట్లు ఏమైనా వున్నాయేమో చూసి క్లియర్ చెయ్యాలి.

7. ఏజంట్లచేత నోటా గుర్తుతో  సహా అభ్యర్ధులందరి గుర్తులపై సమ ప్రాధాన్యంతో 50 ఓట్లకు తక్కువలేకుండా ఓట్లను వెయ్యాలి. PO గారు ఏ గుర్తుపై ఎన్ని ఓట్లు వేశారో రాసుకోవాలి.

8. MOCK POLL అయిన తర్వాత CU లోని  క్లోజ్  బటన్  నొక్కాలి. తర్వాత రిజల్టు బటన్ నొక్కి ఎవరెవరికి ఎన్నెన్ని ఓట్లు పడ్డాయో VVPAT లోని స్లిప్పులు తీసి చూపెట్టాలి. తరువాత క్లియర్ బటన్ నొక్కాలి.

9. VVPAT లో మొత్తం 57 స్లిప్లను బయటకుతీసి వాటి వెనుక MOCK POLL రబ్బర్ స్టాంపును వెయ్యాలి.

10. MOCK POLL అయిన తరువాత 57 స్లిప్ లను ఒక నలుపు కవరులో పెట్టి సీలుచేసి PO మరియు ఏజంట్ల  సంతకాలను చెయ్యాలి. వాటిని ప్లాస్టిక్ డబ్బాలో ఉంచి పింకు కలర్ టాగ్ తో సీలు చెయ్యాలి. దానిపైన కూడా PO మరియు ఏజంట్లు సంతకాలను చెయ్యాలి. ప్లాస్టిక్ డబ్బాపై నియోజకవర్గం పేరు - నంబరు, పి.ఎస్  పేరు - నంబరు రాయాలి.

11. లోక్ సభకు, శాసన సభకు, వేరువేరుగా MOCK POLL చేయాలి.

12. MOCK POLL అయిన తర్వాత PO HAND BOOK లోని ఎనెక్జెర్ - 5 ప్రకారం MOCK POLL సర్టిఫికేట్ రాయాలి.

13. ఎనెక్జెర్ - 6 ప్రకారం PO డిక్లరేషన్ రాయాలి. వీటిలో కూడా PO మరియు ఏజంట్లు సంతకాలు చేయాలి.

14. CU లో తెరపై '0' ను మరియు VVPAT లోని డ్రాప్ బాక్స్  ఖాళీగా ఉన్నట్లు ఏజంట్లకు చూపాలి. CU ని ఆఫ్ చేసి సీలు చేయాలి.

15. స్పెషల్ టాగ్ తో , గ్రీన్ పేపర్ సీల్ తో, స్టిప్ సీల్ తో, అడ్రసు టాగ్ తో CU, VVPAT లను సీలుచేసి, వాటిపై PO సంతకం చేయడమే కాకుండా పోలింగ్ ఏజెంట్ల చేత కూడా సంతకాలు చేయించాలి.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top