EVM, VVPAT, BU సమస్యలు తలెత్తినప్పుడు ఏంచేయాలి....? పరిష్కార మార్గాలు
1. కంట్రోల్ యూనిట్ లో రీప్లేస్మెంట్ ఆఫ్ వివిపేట్ లేదా 2-9 వివిపేట్ రీప్లేస్మెంట్ అని ఎర్రర్ వచ్చినప్పుడు....?
• బ్యాలెట్ యూనిట్, వివిపేట్ వైర్లన్నీ ఒకసారి తీసివేసి మరల బిగించవలెను.
• వివిపేట్ నందు పేపర్ బండిల్ పొజిషన్ సరిగా ఉందో చెక్ చేసుకోవలెను.
• తర్వాత ఎర్రర్స్ అనేవి పోతాయి C.U రెడీ అవుతుంది.
2. కంట్రోల్ యూనిట్ నందు INVALID డిస్ప్లే వస్తూ ఉంటే ఏం చేయాలి ?
• సరైన పద్ధతిలో C.R.C చేయకపోవడం వల్ల, పదేపదే బటన్స్ నొక్కినప్పుడు ఈ సమస్య వస్తుంది.
• సరైన పద్ధతిలో C.R.C చేయాలి, తర్వాత ఎర్రర్స్ క్లియర్ అవుతాయి. C.U రెడీ.
3. కంట్రోల్ యూనిట్ నందు Election exceeded అనే డిస్ప్లే వస్తున్నప్పుడు ఏం చేయాలి ?
• సరైన పద్ధతి ప్రకారము C.R.C చేయాలి తర్వాత ఎర్రర్స్ క్లియర్ అవుతాయి. C.U రెడీ.
4. కంట్రోల్ యూనిట్ కి వివిపేట్ నాట్ కనెక్టెడ్ వచ్చినప్పుడు ఏం చేయాలి ?
• వివిపేట్ యొక్క వైర్ ను కంట్రోల్ యూనిట్ కి సరైన పొజిషన్లో ఇవ్వవలెను.
• వివిపేట్ వెనుక వైపు ఉన్న నాబ్ ను నిలువాకారంలో ఉంచవలెను.
• వివిపేట్ కంట్రోల్ యూనిట్ కి కనెక్ట్ అవుతుంది.
5. క్లాక్ ఎర్రర్ అని కంట్రోల్ యూనిట్ లో డిస్ప్లే అయితే ఏం చేయాలి ?
• సెక్టోరియల్ ఆఫీసర్ కి ఫోన్ చేసి తెలియజేయాలి. సమయం తేదీ మార్చమని చెప్పాలి...
6. కంట్రోల్ యూనిట్ నందు INOPERATIVE వచ్చినప్పుడు. ఏమి చేయాలి ?
• కంట్రోల్ యూనిట్ మార్చాలి. సెక్టోరియల్ ఆఫీసర్ కి తెలియజేయాలి.
0 Post a Comment:
Post a Comment