Monday 29 April 2024

ఓటింగ్ వేళ... ఈవీఎంలు మొరాయిస్తే...?

 ఓటింగ్ వేళ... ఈవీఎంలు మొరాయిస్తే...?



ఎన్నికల వేళ ఎలక్ట్రా నిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) వినియోగంపై చాలామందికి సందే హాలు ఉంటాయి. ఓటు వేసే క్రమంలో ఒకవేళ పొరపాటున ఈవీ ఎంలో తప్పు బటన్ ను నొక్కితే ఏమవుతుంది? ఓటింగ్ జరుగుతుండగా అకస్మాత్తుగా ఈవీఎం పనిచేయడం ఆగిపోతే ఎలా? అనే ప్రశ్నలు ఉదయిస్తుంటాయి. వాటికి సమాధానాలివే.

విద్యుత్ అక్కర్లేదు:

ఈవీఎంలో ప్రధానంగా రెండు భాగాలు ఉంటాయి, ఒక భాగాన్ని బ్యాలెట్ యూనిట్ (బీయూ) అంటారు. మరో భాగాన్ని కంట్రోల్ యూనిట్ (సీయూ) అని పిలు స్తారు. బీయూలో మనం ఓటును నమోదు చేస్తాం. దీన్ని ప్రత్యేకమైన ఓటింగ్ కంపార్ట్ మెంట్ లోపల ఉంచుతారు. అందులోకి వెళ్లి మనం రహస్యంగా ఓటు వేయొచ్చు. సీయూ అనేది ప్రిసైడింగ్ అధికారి లేదా పోలింగ్ అధికారి దగ్గర ఉంటుంది. అయిదు మీటర్ల కేబుల్ తో బీయూ, సీయూ అనుసం ధానమై ఉంటాయి.. ఎంతమంది ఓటు వేశారు అనే సమాచారం సీయూలో ఎప్పటి కప్పుడు కనిపిస్తుంది. వీటికి అదనంగా 'ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్)' యంత్రం కూడా అక్కడే ఉంటుంది. మనం ఈవీఎంలో ఓటు వేయ గానే వీవీ ప్యాట్లో నుంచి ఒక స్లిప్ బయ టికి వచ్చి అక్కడే కింద అమర్చిన బాక్సులో పడిపోతుంది. ఈవీఎంలు పనిచేయడానికి కరెంటు అవసరం లేదు. అవి బ్యాటరీ సాయంతో పనిచేస్తాయి. అందువల్ల విద్యుత్ కనెక్షన్లు లేని ప్రాంతాల్లో కూడా ఈవీఎం లను వినియోగించుకోవచ్చు.

తప్పు బటన్ నొక్కితే...

ఈవీఎంపై రాజకీయ పార్టీ/ అభ్యర్థికి సంబం దించిన గుర్తు వద్ద ఉండే బటన్ను నొక్క గానే ఎరుపు రంగు సిగ్నల్ వస్తుంది.' వెంటనే బీప్ సౌండ్ వినిపిస్తుంది. వీవీప్యాట్ నుంచి స్లిప్ రిలీజవుతుంది. ఓటు నమోదైం దని చెప్పేందుకు ఇవన్నీ ద్రువీకరణలు. ఒక వేళ మనం పొరపాటున ఈవీఎంపై తప్పు బటన్ ను నొక్కి ఓటు నమోదు కాకపోతే మరోసారి ఓటు వేయడం అంత సులువు కాదు. దానికోసం అక్కడున్న పోలింగ్ అధి కారి అనుమతి తప్పకుండా తీసుకోవాలి. పోలింగ్ అధికారి వెంటనే వచ్చి ఈవీఎంలో ఉండే ఒక బటన్ను నొక్కితేనే మరోసారి ప్రెష్గా ఓటు వేసేందుకు అవకాశం కలుగు తుంది. ఎన్నికల ప్రవర్తన నియమాలు-1961 లోని రూల్ నంబర్ 49ఎంఏ ప్రకారం ఇటు వంటి పరిస్థితుల్లో ఓటరు నుంచి రాతపూర్వక ప్రకటనను ప్రిసైడింగ్ అధికారి కోరే అవకాశం ఉంటుంది. ఓటరు చేస్తున్న క్లెయిమ్ నిజమైన దని రుజువయితేనే రిటర్నింగ్ అధికారి అను మతి తీసుకొని మరోసారి ఓటు వేసేందుకు అనుమతిస్తారు. ఈ క్రమంలో రిటర్నింగ్ అది కారి అనుమతి వచ్చే వరకు ఆ ఈవీఎంలో పోలింగ్ను నిలిపివేస్తారు.

అకస్మాత్తుగా పనిచేయకపోతే...

ఓటింగ్ జరుగుతుండగా అకస్మాత్తుగా ఈవీఎం మొరాయిస్తే కంగారుపడాల్సిన అవసరం లేదు. అప్పటివరకు నమోదైన ఓట్లన్నీ కంట్రోల్ యూనిట్ లోని మెమొరీలో సేవ్ అయి ఉంటాయి. ఒకవేళ ఆ సమాచారం కూడా దొరకని పరిస్థితి ఎదురైతే వీవీప్యాట్ స్లిప్పులు ఎలాగూ అందుబాటులో ఉంటాయి. పోలింగ్ స్టేషనులో బీయూ, సీయూల్లో ఏ ఒక్కటి మొరాయించినా వెంటనే కొత్తగా బీయూ, సీయూ, వీవీప్యాట్ సెట్ను అక్కడికి పంపిస్తారు. జోనల్ మేజి స్టేట్లు, ఏరియా మేజిస్ట్రేట్ల పరి ధిలో రిజర్వులో ఉండే ఎన్ని కల సామగ్రి నుంచి వీటిని కేటాయిస్తారు. వీవీప్యాట్ యంత్రం ఒక్కటే మొరాయిస్తే దాని స్థానంలో మరో కొత్త వీవీ ప్యాట్ యంత్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఇటు వంటి పరిస్థితుల్లో- అన్ని ఈవీఎంలలో నమోదైన ఓట్లను కౌంటింగ్ రోజున లెక్కి స్తారు. ఏదైనా సాంకేతిక కారణంతో సీయూ లోని ఓట్లు డిస్ప్లే కాకపోతే దాని వీవీప్యా ట్ స్లిప్పులను లెక్కిస్తారు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top