పోస్టల్ బ్యాలెట్ పై తికమక... పనిచేసే నియోజకవర్గ ఆర్ ఓ లకే దరఖాస్తు ఇవ్వాలి.
• ఒక్కోచోట ఒక్కో రకంగా అధికారుల నిర్ణయాలు
• దరఖాస్తుకు ఉద్యోగ, ఉపాధ్యాయులు దూరం
• ఉన్నతాధికారుల తీరుపై అసహనం
ఎన్నికల నిర్వహణలో పోలింగ్ సిబ్బంది పనితీరే చాలా కీలకం ఉన్నతాధికారులు ఆదేశాలిస్తే క్షేత్రస్థా యిలో వాటిని పక్కాగా అమలు చేసి ఎన్నికల నిర్వహణను విజయ వంతం చేసేది పోలింగ్ సిబ్బందే. అలాంటి సిబ్బంది ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునే పోస్టల్ బ్యాలెట్లపై తికమకపడుతున్నారు. చాలామంది ఉద్యోగ, ఉపాధ్యాయులు ఓటుకు దరకాస్తు చేసుకోలేకపోతు న్నారు. ఒక్కో నియోజకవర్గంలో ఒక్కోరకంగా ఎన్నికల అధికారులు నిర్ద యాలు తీసుకుంటుండడంతో సమస్యలు ఏర్పడుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. చివరకు వీటిని పర్యవేక్షించే జిల్లా ఉన్నతాధికారులు సైతం పట్టించుకోకపోవడం, పోస్టల్బ్యాలెట్ వినియోగం విధానాలపై కనీసం ప్రచారమాధ్యమాల ద్వారా తెలియజేయకపోవడం మరిన్ని విమర్శలకు తావిస్తోంది.
ఎన్నికల డ్యూటీలో పాల్గొనే ఉద్యోగ, ఉపాధ్యాయులకు తమ ఓటును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో ఎన్నికలు నిర్వహిం చడానికి ఇప్పటికే జిల్లాస్థాయి అధికారుల టీమ్లు, పీఓలు, ఏపీఓలు, ఓపీఓలను నియమించారు. పీఓలు 2,552 మంది, ఏపీఓలు 2,715, ఓపీ ఓలు దాదాపు 9వేలు, పోలీసులు దాదాపు 4వేలమంది ఇలా అందరూ కలిపి 25వేలమంది వరకు ఎన్నికల డ్యూటీలో పాల్గొంటున్నారు. ఇవికా కుండా ఎమర్జెన్సీకి సంబందించి 33 శాఖలకు చెందిన ఉద్యోగులకు పోస్ట లీ బ్యాలెట్ సౌకర్యం కల్పించడం జరుగుతుంది. ఎన్నికల డ్యూటీకి నియమి తులైన పీఓ, ఏపీఓలకు ఇప్పటికే శిక్షణ ఇవ్వడం జరిగింది. అదేరోజే వారందరితో పోస్టల్బ్యాలెట్కు వారినుంచి పాఠం-12 డీ దరఖాస్తు తీసుకో వాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే శింగనమల, రాయదుర్గం, ఉరవకొండ, రాప్తాడు నియోజకవర్గాల్లో అక్కడ ఆర్ఓలు, ఏఈఆర్ఓలు తమసొంత నిర్ణయాలు తీసుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి. కేవలం ఆయా నియోజకవర్గాల్లో ఓటు ఉన్నవారితో మాత్రమే దరఖాస్తులు తీసుకు న్నారు. ఇతర నియోజకవర్గాల్లో ఓటుఉంటే వారిని ఆయా నియోజకవ ర్గాల్లో పోలింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తారు. ఆ రోజు అక్కడకు వెళితే ఎన్ని కల ఆర్డర్, ఫారం-12డీ, ఇస్తే అపుడు పోస్టల్బ్యాలెట్ ఇస్తారు అక్కడే మీఓటు వేయవచ్చని చెప్పి పంపారు. ఎన్నికల నిబంధన మాత్రం ఉద్యోగం చేసే నియోజకవర్గంలో ఎన్నికల డ్యూటీ ఆర్డర్, ఫారం-12 దర ఖాస్తు ఆ నియోజకవర్గ ఆర్లకు ఇవ్వాలి. ఆర్ఓలు అక్కడనుంచి ఓటు ఉన్న నియోజవర్గానికి వారి దరఖాస్తులను పంపిస్తారు. అపుడు ఓటు ఉన్న నియోజకవర్గంలో పోస్టల్బ్యాలెట్ మంజూరుచేస్తారు. ఏర్పాటు చేసిన పోలింగ్ సెంటర్లో ఓటు వేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అలా చేయకుండా ఆరలు ఒక్కోచోట ఒక్కో రకంగా చెప్పడంతో చాలామంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు పోలింగ్ బ్యాలెట్లకు దూరం అయ్యే పరిస్థితి నెలకొంది.
పనిచేసే నియోజకవర్గ ఆర్ ఓలకే దరఖాస్తు ఇవ్వాలి
పోస్టల్బ్యాలెట్ జారీ విషయంలో ఆర్ఓలకు స్పష్టంగా సమా చారం ఇచ్చాం. ఏ నియోజకవర్గంలో ఉద్యోగం చేస్తున్నారో ఆ నియో జకవర్గ ఆర్ఓలకే పోస్టల్బ్యలెట్కు ఫారం-12 దరఖాస్తు చేసుకో వాలి. అక్కడి నుంచి ఎవరికి ఏ నియోజకవర్గంలో ఓటు ఉందో అక్కడికి ఆ ఆ౦ ఫార్వర్డ్ చేసి పంపుతారు. పోలింగ్ కేంద్రం ఏర్పా టు చేసిన రోజు వెళ్లి అక్కడ బ్యాలెట్ పొంది ఓటు వేయాల్సి ఉంటుం ది. శిక్షణ రోజే పీఓ, ఏపీఓలతో బ్యాలెట్కు దరఖాస్తులు తీసుకెళ్లమని చెప్పాం. అయితే కొందరు సరిగా చెప్పకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. ఎన్నికల నామినేషన్ల వరకు పోస్టల్ బ్యాలెట్లకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. ఇప్ప టికైనా ఎన్నికల డ్యూటీలో ఉన్న వారు పనిచేసే నియోజకవర్గంలో ఆర్ఓలను కలిసి దరఖాస్తులు అందించాలి. ఓపీఓలు నియమితులైన వారు మాత్రం నేరుగా ఓటు ఉన్న నియోజకవర్గంలోనే నియామక ఉత్తర్యులు చూపించి దరఖాస్తు చేసు చేసుకోవాలి.
- ప్రభాకరరావు, డీపీఓ (పోస్టల్బ్యాలెట్ నోడల్ ఆఫీసర్) అనంతపురం
0 Post a Comment:
Post a Comment