Monday 15 April 2024

23న విద్యార్థుల చేతికి వార్షిక ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డులు - అదే రోజు పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ - పాఠ్యపుస్తకాలు పాఠశాలల్లో అప్పజెప్పే విధానానికి స్వస్తి

23న విద్యార్థుల చేతికి వార్షిక ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డులు - అదే రోజు పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ - పాఠ్యపుస్తకాలు పాఠశాలల్లో అప్పజెప్పే విధానానికి స్వస్తి



• విద్యార్థుల ప్రగతిని తల్లిదండ్రులకు వివరించనున్న ప్రధానోపాధ్యాయులు

• తల్లిదండ్రులకు హాజరు అవసరాన్ని వివరించి తప్పక హాజరయ్యేలా చూడాలని సూచన

• పాఠ్యపుస్తకాలు పాఠశాలల్లో అప్పజెప్పే విధానానికి స్వస్తి

• టెక్స్ట్ బుక్స్ విద్యార్థుల ఆస్తి..మరుసటి ఏడాదికి ఆ పుస్తకాలు రిఫరెన్స్ గా ఉంటాయి

• వేసవి సెలవుల్లో సైన్స్, సోషల్ సైన్స్ పుస్తకాలు చదివేలా విద్యార్థులను ప్రోత్సహించే బాధ్యత ప్రధానోపాధ్యాయులదే

• పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ  ప్రవీణ్ ప్రకాష్

ప్రస్తుతం విద్యా సంవత్సరం ముగిసే నాటికి (ఏప్రిల్ 23, మంగళవారం) వార్షిక పరీక్షల ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డును విద్యార్థుల తల్లిదండ్రులకు అందజేస్తామని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ. ప్రవీణ్ ప్రకాష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతేడాది విద్యాసంవత్సరం ముగిసే చివరి రోజున తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం విజయవంతంగా జరిగిందని, ఈ ఏడాది మరింత మెరుగ్గా సమావేశం జరగాలని ఆకాంక్షించారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా విద్యార్థుల వార్షిక పరీక్షల ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డును తల్లిదండ్రులకు అందించడమే గాక, ఆ ఏడాది వారి ప్రగతిని తల్లి దండ్రులకు వివరిస్తామన్నారు.  

ప్రధానంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశానికి తల్లిదండ్రుల హాజరు 100 శాతం ఉండేలా బాధ్యత తీసుకోవాలని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు సూచించారు. 23 ఏప్రిల్ న పేరెంట్స్, టీచర్స్ సమావేశం ఉంటుందన్న విషయాన్ని, సమావేశానికి తప్పక హాజరు అవ్వాల్సిన అవసరాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు ఏప్రిల్ 22న గుర్తు చేయాల్సిన బాధ్యత క్లాస్ టీచర్లదే అని ప్రవీణ్ ప్రకాష్ అన్నారు. ఈ ఏడాదితో పాటు గత రెండు తరగతుల సైన్స్ మరియు సోషల్ సైన్స్  పుస్తకాలు వేసవి సెలవుల్లో చదివే విధంగా విద్యార్థులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రధానోపాధ్యాయులు తీసుకోవాలన్నారు. 

ఇప్పటికే ఆయా సబ్జెక్టులు గతంలో చదివి ఉన్న కారణంగా, ప్రస్తుతం అవే సబ్జెక్టులు మళ్లీ చదవడం ద్వారా సంబంధింత అంశాలను మరింతగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఇప్పటికే అర్థం చేసుకున్న విషయాలను తిరిగి గుర్తుచేసుకోవడం ద్వారా  విద్యార్థులు ఆయా సబ్జెక్టులను ఆనందంగా పఠించి ఆహ్లాదకరంగా అనుభూతి చెందే అవకాశం ఉంటుందన్నారు. ఉదాహరణకు ప్రస్తుతం ఒక విద్యార్థి 9వ తరగతి నుండి 10వ తరగతికి వెళ్లినప్పుడు అతను 7,8,9 తరగతుల సైన్స్, సామాజిక శాస్త్రాల (సోషల్ సైన్స్) పుస్తకాలను, 5వ తరగతి నుండి 6వ తరగతికి వెళ్లిన విద్యార్థి 3,4,5 తరగతుల సైన్స్, సామాజిక శాస్త్రాల పుస్తకాలను కథా పుస్తకాలుగా చదవాల్సి ఉంటుందన్నారు. 

తద్వారా సంబంధిత సబ్జెక్టులపై అవగాహన మనసులో స్థిర పడటమే గాకుండా బైలింగువల్ పుస్తకాలు చదవడం వల్ల ఇంగ్లీష్ పై మరింత పట్టు వస్తుందన్నారు. వీటికి సంబంధించిన అన్ని ఈ-పుస్తకాలు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయన్నారు. గతేడాది విద్యాసంవత్సరం ముగిసే సమయంలో చాలా మంది విద్యార్థులను తమ పుస్తకాలను తిరిగి పాఠశాలల్లో అప్పజెప్పాలన్న అంశం తాను  ప్రత్యక్షంగా పరిశీలించానని ప్రవీణ్ ప్రకాష్ గుర్తుచేసుకున్నారు.  ఇది ఎంత మాత్రం సరైన పద్ధతి కాదన్నారు. ఈ విధానానికి స్వస్తి పలకాలన్నారు.  టెక్స్ట్ బుక్స్ విద్యార్థుల ఆస్తి అని, అవి వారికోసమే తయారు చేశామని, మరుసటి ఏడాదికి ఆ పుస్తకాలు రిఫరెన్స్ గా ఉంటాయని వివరించారు. కచ్చితంగా విద్యార్థులు ఆయా పుస్తకాలను ఇంటికి తీసుకెళ్లి పఠించేలా ప్రోత్సహించాలన్నారు. అంతే తప్ప పాఠశాలల్లో లైబ్రరీ ఏర్పాటు పేరుతో పుస్తకాలను వెనక్కి తీసుకోకూడదన్న సందేశాన్ని ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు చేరవేయాలని డీఈవోలకు ప్రవీణ్ ప్రకాష్ సూచించారు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's need

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More
Blinking Text
Top