Saturday, 27 April 2024

లోక్ సభ మరియు అసెంబ్లీ ఎన్నికలు 2024 : నోటాకు మెజార్టీ వస్తే...?

లోక్ సభ మరియు అసెంబ్లీ ఎన్నికలు 2024 :  నోటాకు మెజార్టీ వస్తే...?



• ఎలాంటి చర్యలు తీసుకుంటారు 

• ఈసీని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న వేళ నోటాకు అత్యధికంగా ఓట్లు వస్తే పరిస్థితి ఏమిటి? ఎటువంటి చర్యలు తీసు కుంటారని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీనిపై సమాధానం ఇవ్వవాలని ఈసీకి శుక్రవారం నోటీసులు జారీ చేసింది. అంతకుముందు ఎన్నికల్లో నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలి తాలను రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించా లని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. శివ్ ఖేరా అనే రచయిత ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అందులో లేవనెత్తిన అంశాలను పరిశీలించేందుకు సీజేఐ ధర్మాసనం అంగీకరించింది. ఆ పిటిషన్లో లో ఎటువంటి అంశాలున్నాయంటే.. నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను మరో ఐదేళ్ల పాటు అన్ని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిబంధనలు రూపొందించాలని అభ్యర్థనలో పేర్కొన్నారు. ఈ అంశాలకు సంబంధించి రూల్స్ రూపొందించేలా ఈసీకి ఆదేశాలివ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషనర్ తరపున సీనియర్ లాయర్ గోపాల్ శంకరనారాయణన్ వాదించారు. ఇటీవల సూరత్లో పోలింగ్ లేకుండానే ఓ అభ్యర్థి ఏకగ్రీవమైన తీరును ఉద హరించారు. ఒకే అభ్యర్థి ఉన్నందున ఎన్నికలు నిర్వహించలేదని కోర్టుకు విన్నవించారు. నోటా అంశం ఎన్నికలు పరిధిలోని వస్తుంది కాబట్టి ఈసీ నోటీసులిచ్చిన సుప్రీంకోర్టు.. సమాధానం కోసం చూస్తామని తెలిపింది. పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వేసిన పిల్తో 2013లో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈవీ ఎంలలో నోటా ఆప్షన్ను కల్పించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నచ్చకపోతే ఓటర్లు నోటాను ఎంచుకోవచ్చు. అయితే, ప్రస్తుతమున్న రూల్స్ ప్రకారం నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే.. ఎన్నికల బరిలో నిలబడిన వారిపై ఎలాంటి చర్యలు ఉండవు. నోటా తర్వాత ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో వారిని విజేతగా ప్రకటి స్తున్నారు. అందుకే నోటాకు మెజార్టీ వస్తే పరిస్థితి ఏమిటని ఈసీకి నోటీసులిచ్చింది సుప్రీంకోర్టు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's need

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More
Top