ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
పాఠశాల విద్య
పత్రికా ప్రకటన (30.03.2024)
@@@
టెట్ 2024 పరీక్ష ఫలితాల ప్రకటన మరియు ఉపాధ్యాయ నియామక పరీక్షల వాయిదా:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 6100 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం కోసం ఉపాధ్యాయ నియామక ప్రక్రియ చేపట్టింది. దీనిలో భాగంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ కూడా నిర్వహించింది. గౌరవ హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు ముందుగా ప్రకటించిన ఉపాధ్యాయ నియామక పరీక్ష షెడ్యూల్ ను మార్పు చేసి మార్చి నెల 30వ తేదీ నుండి ఏప్రిల్ నెల 30వ తేదీ వరకు ఉపాధ్యాయ నియామక పరీక్షలు నిర్వహించాలని షెడ్యూల్ విడుదల చేసింది. ఇంతలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు ప్రకటనకు మరియు ఉపాధ్యాయ నియామక పరీక్షలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘాన్ని అనుమతి కోరింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నందున ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు ప్రకటనను, ఉపాధ్యాయ నియామక పరీక్షలను మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పూర్తి అయ్యేవరకు వాయిదా వేయవలసిందిగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
కేంద్ర ఎన్నికల కమీషనర్ ఆదేశాలమేరకు టెట్ 2024 పరీక్ష ఫలితాల ప్రకటన మరియు ఉపాధ్యాయ నియామక పరీక్షల నిర్వహణ ను తాత్కాలికంగా వాయిదా వెయ్యడం జరిగింది క్రొత్త తేదీలతో షెడ్యూల్ ను తదుపరి ప్రకటించడం జరుగుతుంది.
పాఠశాల విద్య కమిషనర్
శ్రీ ఎస్. సురేష్ కుమార్, I.A.S
0 Post a Comment:
Post a Comment