కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశాలు
ఆంధ్రప్రదేశ్ లోని 352 కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో (కేజీబీవీ) 2024-25 విద్యా సంవ త్సరానికి సంబంధించి ఆరు, 11వ తరగతుల్లో ప్రవేశాల కోసం ఏడు, ఎనిమిది, తొమ్మిది తరగ తుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం ఇంటర్మీడియట్లో అర్హులైన బాలికల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
» అర్హత: అనాథలు, బడి బయట ఉన్న పిల్లలు, బడి మధ్యలో మానేసిన వారు (డ్రాపౌట్స్), పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దారిద్య్రరేఖకు(బీపీఎల్) దిగువున ఉన్న బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకో వాలి. విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయ పరి మితి గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,20,000, పట్టణ ప్రాంతాల్లో రూ.1,40,000 మించకూ డదు.
» ఎంపిక విధానం: ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖా స్తులను మాత్రమే అడ్మిషన్ కోసం పరిగణి స్తారు.ఎంపికైన విద్యార్థులకు ఫోన్ మేసేజ్ ద్వారా సమాచారం అందిస్తారు. అడ్మిషన్లు పొందిన వారి వివరాలను ఆయా పాఠశాల నోటిఫికేషన్ బోర్డులో ప్రదర్శిస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 11.04.2024
» వెబ్ సైట్: https://apkgbv.apcfss.in
0 Post a Comment:
Post a Comment