గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ వారు విద్యా శాఖ, ఆంధ్రప్రదేశ్ వారి ఎపిసోడ్ 15 ద్వారా అందజేయబడిన అంశాలు. Dated: 01.03.2024 3.00 pm.
ఆంధ్రప్రదేశ్ లో గల విద్యాశాఖలో పని చేస్తున్న అందరు RJDs,DEOs,Dy.E.Os,MEOs, HMS Teachers,FSEs, 8 th& 9 th class students
అందరికీ తెలియ జేయ అంశాలు.
1.మన దేశంలో విద్యా రంగంలో అత్యున్నత అవార్డుగా పరిగణింప బడు చున్న"ప్రధాన మంత్రి ఎక్స్ లెన్స్ అవార్డ్ ఇన్ ఎడ్యుకేషన్" నిమిత్తం 160 ప్రాజెక్ట్స్ పోటీ పడుచున్నవి.
వీటిలో 12 ప్రాజెక్ట్స్ తుది ఎంపిక దశకు చేరుకోవడం జరిగాయి.వీటిలో ఆంధ్రప్రదేశ్ నుండి ...అమలు చేయు చున్న Byjus టాబ్స్, IFPs, స్మార్ట్ TVs, FSE వ్యవస్త.. ఎంపిక చేయబడినవి.
ఈ Prime Minister Exellence Award__మన రాష్ట్రం నకు దక్కాలి అంటే పై వాటిని సక్రమంగా అమలు చేయాలి.
వీటి యొక్క అమలు తీరు గూర్చి నేషనల్ టీమ్స్ వస్తాయి. వారు వచ్చి పరిశీలించి చివరిగా అవార్డ్ కి ఎంపిక చేస్తారు.
కావున అందరూ RJDs,DEOs,Dy.e.os,Meos, HMS, Teachers, FSEs తగు విధంగా శ్రద్ధ వహించి 8 & 9 th students Tabs, IFPs, స్మార్ట్ TVs పూర్తి స్థాయిలో వినియో గించేలా కృషి చేయాలి.
ఈ అవార్డ్ పొందేందుకు అందరూ భాగస్వాములు కావాలి. దీనికై అందరూ ఎవరి స్థాయిలో వారు...తగు చర్యలు తీసుకోవాలని కోరడమైనది.
ఏప్రిల్ 20, 2024 లోపు అమలు తీరును పరిశీలన కోసం ఫోన్ కాల్స్ వస్తాయి ఫోన్ కాల్స్ వస్తే ఈ అంశాలు అమలు జరుగు చున్న తీరును చక్కగా వివరించాలి.
వివిధ టీమ్స్ వస్తాయి. వారు వచ్చినా పైన పేర్కొన్న అన్నీ చక్కగా అమలు జరుగు చున్నట్లుగా వారు సంతృప్తి చెందేలా మన అమలు తీరు ఉండాలి. అదేవిధంగా వివరించాలి.
ఈ అవార్డ్ ఒక భారత రత్న, పద్మ విభూషణ్, పద్మశ్రీ అవార్డు తో సమానం.
కావున ఈ అవార్డ్ పొందేందుకు అందరూ భాగస్వాములు కావాలని ఈ అవార్డ్ ద్వారా మన రాష్ట్ర ఖ్యాతి దేశ స్థాయిలో పెరగాలని దీనికి మీరంతా తగు విధంగా కృషి చేయాలని ఆశిస్తూ యున్నాను.
అందరికీ ధన్యవాదములు.
మీ
ప్రవీణ్ ప్రకాష్,
ప్రిన్సిపల్ సెక్రటరీ,
విద్యా శాఖ, ఆంధ్రప్రదేశ్.
0 Post a Comment:
Post a Comment