Saturday 10 February 2024

మహాత్మా జ్యోతిభాపూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ : 2024-25 విద్యా సంవత్సరానికి 5వ తరగతి ప్రవేశ ప్రకటన.

మహాత్మా జ్యోతిభాపూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల
విద్యాలయాల సంస్థ, (రి), 2వ అంతస్తు, ఫ్లాట్ నం.9, 4వ వీధి, బండిస్టాన్లీ వీధి,
ఉమాశంకర్ నగర్, కానూరు, విజయవాడ - 520 007.



2024-25 విద్యా సంవత్సరానికి 5వ తరగతి ప్రవేశ ప్రకటన

మహాత్మా జ్యోతిభాపూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, విజయవాడ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బి.సి బాలబాలికల పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి (ఇంగ్లీషు మీడియం) స్టేట్ సిలబస్ బి.సి, ఎస్సీ, ఎస్టీ మరియు ఇ.బి.సి అభ్యర్ధుల నుండి ప్రవేశానికి ధరఖాస్తులు కోరడమైనది. ప్రవేశ పరీక్ష తేది నాడు ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ధరఖాస్తుల ననుసరించి ఆయా MJP పాఠశాలల్లో లేదా B.C హాస్టళ్ళలో పరీక్ష నిర్వహించబడును.

1. పరీక్ష కొరకు అర్హత :

వయస్సు: బి.సి, ఇ.బి.సి మరియు ఇతర విద్యార్థులు 9 నుండి 11 సం.ల వయస్సు మించి ఉండరాదు, వీరు 01.09.2013 మరియు 31.08.2015 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 9 నుండి 13 సం.ల వయస్సు మించి ఉండరాదు. వీరు 01.09.2011 మరియు 31.08.2015 మధ్య జన్మించి ఉండాలి.

2. ఆదాయ పరిమితి:

విద్యార్థుల తల్లిదండ్రుల సంరక్షకుల సంవత్సర ఆదాయం రూ.1,00,000 లకు మించరాదు.

• జిల్లాలోని గురుకుల పాఠశాలలలో ప్రవేశానికి ఆ జిల్లాలోని పాఠశాలల్లో చదువుతూ. ఉండాలి.

• విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో గత 2 సంవత్సరాల నుండి నిరంతరంగా (2022-23, 2023-24) చదువుతూ ఉండాలి. విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 4వ తరగతి 2023-24 విద్యా సంవత్సరంలో చదివి ఉండాలి.

3. పాఠశాలల్లో ప్రవేశం:

విద్యార్థుల ఎంపికకు ప్రతి జిల్లా ఒక యూనిట్గా పరిగణించబడుతుంది. పట్టిక-1 లో ఆయా జిల్లాలకు సీట్ల కేటాయింపు వివరాలు పొందుపరచడమైనది.

4. ప్రవేశ పరీక్ష:

ప్రవేశ పరీక్ష తెలుగు, ఇంగ్లీషు, లెక్కలు పరిసరాల విజ్ఞానం (సైన్స్ మరియు సాంఘీక శాస్త్రం) లలో 4వ తరగతి స్థాయిలో 2 గం. వ్యవధిలో 50 మార్కులకు (తెలుగు 10, ఇంగ్లీషు 10, లెక్కలు 15, పరిసరాల విజ్ఞానం 15 మార్కులలో) ఆబ్జెక్టివ్ టైపులో ఉంటుంది.

• జవాబులను ఓ.యమ్. అర్ షీట్లో గుర్తించాలి.

• పరీక్ష ప్రశ్నా పత్రం తెలుగు మరియు ఇంగ్లీషులో ఉంటుంది.

5. పరీక్షా కేంద్రం:

విద్యార్థిని, విద్యార్థులకు వారి సొంత జిల్లాల్లో మాత్రమే పరీక్ష నిర్వహించబడును. పరీక్షా కేంద్రం వివరాలు హాల్ టిక్కెట్ లో ఇవ్వబడును. ఒక పరీక్షా కేంద్రంలో విద్యార్థుల సంఖ్య తక్కువైనప్పుడు ఆ విద్యార్థులను దగ్గర లోని ఇతర పరీక్షా కేంద్రాలకు కేటాయించబడును.

6. పాఠశాలల్లో ప్రవేశానికి ఎంపిక విధానం:

అర్హులైన విద్యార్థులకు ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరి (అనాధ, మత్స్యకార) మరియు అభ్యర్థి కోరిన పాఠశాల ప్రాధాన్యతల ఆధారంగా ఎంపిక చేయబడును.

• ఏదేని రిజర్వేషన్ కేటగిరీలో అభ్యర్థులు లేని యెడల అట్టి ఏదేని రిజర్వేషన్ ఖాళీలను బి.సి కేటగిరి అభ్యర్థులకు కేటాయిస్తారు.

• ఎంపిక సమానమైన ర్యాంక్ ఒకరి కంటే ఎక్కువ మందికి వచ్చినపుడు పుట్టిన తేది ప్రకారం అధిక వయస్సు గల విద్యార్థికి ప్రాధాన్యత ఇవ్వబడును. అప్పుడు కూడా సమానమైన ర్యాంకు వస్తే, లెక్కలలో పొందిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. అప్పుడు కూడా సమాన మైన ర్యాంకు పొందితే, పరిసరాల విజ్ఞానంలో పొందిన మార్కులను పరిగణలోకి తీసుకుంటారు.

• జిల్లాల వారీగా పాఠశాల వివరాలు, ఆ పాఠశాలల్లో ప్రవేశానికి అర్హత గల జిల్లాలు పట్టిక-1 లో ఇవ్వబడినవి.

• ఎంపికైన విద్యార్ధులు ప్రవేశానికి అర్హులు కానిచో అట్టి ప్రవేశాన్ని నిరాకరించుటకు సంస్థకు అధికారం ఉంది.

• ప్రవేశానికి ఎంపికైన అభ్యర్ధులకు మాత్రమే ప్రవేశ అనుమతి పత్రాలు (కాల్ లెటర్స్) పంప బడును లేదా ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వబడును.

• మెరిట్ లిస్ట్ మార్కుల ఆధారంగా మొదటి లిస్టు, రెండవ లిస్టు, మూడవ లిస్టు ఖాళీళను బట్టి యివ్వబడుతుంది.

7. ధరఖాస్తు చేయు విధానం:

• అభ్యర్ధులు పై అర్హతలు పరిశీలించుకొని సంతృప్తి చెందిన తరువాత ఏదేని (Payment) ఏపీ ఆన్లైన్ కి ప్రాధమిక వివరాలతో (విద్యార్ధి పేరు, పుట్టిన తేది, తండ్రి సంరక్షకుని మొబైల్ నెం.) వెళ్ళి రూ.100/- చెల్లించిన తరువాత ఒక జర్నల్ నెంబరు ఇవ్వబడుతుంది. జర్నల్ నెంబర్ పొందినంత మాత్రాన ధరఖాస్తు చేసుకున్నట్లు కాదు. అది కేవలం ధరఖాస్తు రుసుము చెల్లించినట్లు తెలియజేయు నెంబర్ మాత్రమే.

• ఆ జర్నల్ నెంబర్ ఆధారంగా ఏదేని ఇంటర్ నెట్ సెంటర్ లేదా కంప్యూటర్ నుండి వెబ్సైట్ https://mjpapbcwreis.apcfss.in/ ద్వారా ఆన్లైన్నెం దరఖాస్తూ చేయాలి. ఈ జర్నల్ నెంబరును పరీక్ష ఫీజుచెల్లించిన వివరాలకు కేటాయించిన స్థలం (కాలమ్) లో నమోదు చే యవలయును.

గడువు:

• ఆన్లైన్ ధరఖాస్తును తేది 01.03.2024 నుండి తేది 31.03.2024 వరకు చేసుకోవచ్చును.

• ఆన్లైన్ ధరఖాస్తును పంపిన తరువాత ఒక రిఫరెన్స్ నెంబర్ ఇవ్వబడును. నింపిన ధరఖాస్తు నమూనా కాపీని ప్రింట్ తీసుకొని ఉంచుకోవాలి.

• ధరఖాస్తు చేయు సమయానికి అభ్యర్థి వద్ద కుల ధృవీకరణ, (సమీకృత కుల, జనన ఆదాయం ధృవ పత్రాలు) పుట్టిన తేదీ, ఆదాయ ధృవీకరణ, ప్రత్యేక కేటగిరి ధృవీకరణ, స్టడీ మరియు బోనఫైడ్ సర్టిఫికేట్ మొదలగు ధృవపత్రాలు (ఒరిజనల్) పొంది ఉండాలి. ఒరిజినల్ ధృవ పత్రాలను కౌన్సిలింగ్ సమయంలో సమర్పించాలి. లేని ఎడల విద్యార్ధి ఎంపిక కాబడిన సీటు ఇవ్వబడదు.

• ఆన్లైన్లో కాక నేరుగా సంస్థకు కానీ, గురుకుల పాఠశాలకు గాని మరియు ఇ- మెయిల్ ద్వారా గాని పంపిన ధరఖాస్తులను పరిశీలించరు. అట్టి అభ్యర్థులను పరీక్షకు అనుమతించరు.

• హాల్ టికెట్లు పరీక్ష తేదికి 7 రోజులు ముందుగా తమ రిఫరెన్స్ నెంబర్ ద్వారా హాల్ టిక్కెట్లు దగ్గరలోని ఎదైన ఇంటర్నెట్ ఆన్లైన్ సెంటరు నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చును.

• హాల్ టికెట్లు పోస్టులో గాని, నేరుగా కానీ అభ్యర్థులకు పంపబడవు. కేవలం ఇంటర్నెట్ ద్వారా మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి.

• అర్హత లేని అభ్యర్ధుల ధరఖాస్తులు పరిశీలించబడవు.

8. ధరఖాస్తు నింపుటకు అభ్యర్థులకు కొన్ని ముఖ్య సూచనలు:

• ధరఖాస్తును ఆన్లైన్లో నింపడానికి ముందుగా నమూనా ధరఖాస్తు నింపుకోవాలి.

• పరీక్షా కేంద్రాన్ని వారి సొంత జిల్లాను మాత్రమే ఎంపిక చేయాలి.

• పాఠశాల ప్రాధాన్యతా క్రమము ఎంచుకోవడానికి ముందు పాఠశాలల పట్టికను చూసుకొని నింపాలి.

• పాస్పోర్ట్ సైజు ఫోటోను సిద్ధంగా ఉంచుకోవాలి.

• ధరఖాస్తులను నింపునప్పుడు అభ్యర్థి వివరాలను జాగ్రత్తగా నమోదు చేయవలెను.

• సెల్ నెంబర్ వ్రాయునపుడు విద్యార్థి కుటుంబమునకు సంబంధించిన నంబరు లేదా సమీప బంధువుల సంబరు ఇవ్వవలయును.

• ధరఖాస్తు నింపుటకు జరుగు పొరపాట్లకు అభ్యర్థియే పూర్తి భాధ్యత వహించాలి. తదుపరి ఏ విధమైన మార్పులు చేయబడవు.

• ఒకసారి ధరఖాస్తును ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తరువాత ఎలాంటి మార్పులకు తావులేదు. కావున ధరఖాస్తును అప్లోడ్ చేయుటకు ముందే అన్ని వివరాలు సరిచూసుకోవాలి.

• ప్రవేశ పరీక్షకు హాజరైనంత మాత్రాన ప్రవేశానికి అర్హులు కాదు.

• ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, కేటాయించిన సీట్లలో రిజర్వేషన్ అమలు చేయబడును.

• పట్టిక -1 లో చూపించిన విధంగా అయా జిల్లాల విద్యార్థిని విద్యార్థులు ఆయా పాఠశాలలలో ప్రవేశానికి అర్హులు, ఒక పాఠశాల నుండి వేరొక పాఠశాలకు ఎట్టి పరిస్థితులలో బదిలీ చేయబడరు.

విద్యార్థులకు అందించే సదుపాయాలు :

• ఉచిత వసతి మరియు గురుకుల విధానంలో చదుపుకునే అవకాశం

• నెలకు రూ. 1400 ల తో పౌష్టిక విలువలతో కూడిన మెనూ

జగనన్న విద్యాకానుక ద్వారా

• 4 జతల యూనిఫారం దుస్తులు

• దుప్పటి మరియు జంబ్కన

• బూట్లు, సాక్స్       

• టై మరియు బెల్ట్

• నోట్ పుస్తకాలు, టెక్స్ట్ పుస్తకాలు

• కాస్మోటిక్ చార్జీల నిమిత్తం బాలురకు నెలకు 125 రూ.ల చొప్పున (5,6 తరగతులు), 7వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు బాలురకు 150రూ.లు, బాలికలకు 6,7 వ తరగతుల వరకు చదువుతున్న పిల్లలకు నెలకు 130 రూ.ల చొప్పున మరియు 8వ తరగతి ఆపై క్లాసుల పిల్లలకు నెలకు 250 రూ.ల చొప్పున చెల్లించడం జరుగుతున్నది మరియు బాలురకు నెలకు రూ. 50 చొప్పున సెలూను నిమిత్తం ఖర్చు చేయడం జరుగుచున్నది.

• 5వ తరగతి ప్రవేశం పొందిన విద్యార్ధి ఇంటర్మీడియట్ వరకు గురుకుల పాఠశాలల్లోనే విద్యను అభ్యసించ వచ్చును.

• సమీకృత పౌష్టిక ఆహారం క్రింద రోజూ వేరుశెనగ చిక్కి, వారానికి ఆరు దినములు గ్రుడ్లు, రెండు సార్లు చికెన్ ఇవ్వబం

ఉల్లాసభరితమైన, ఆహ్లాదకరమైన వాతావరణం లో విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో బోధన చేయబడుతుంది. క్రీడలతో పాటు బోధనేతర కార్యక్రమాలలో కూడా శిక్షణ ఉంటుంది. గ్రంధాలయాలు, ప్రయోగశాలలు, డిజిటల్ తరగతులతో విద్యాభోధన జరుగుతుంది. ధరఖాస్తులను ఆన్ లైన్ లో https://mjpapbcwrels.apcfss.in/ వెబ్ సైట్ లో ఏదైనా ఇంటర్ధ నెట్ర సెంటర్ఖా నుండి దరఖాస్తు చేసుకోగలరు.

పూర్తి వివరాల కొరకు ఏదైనా మహాత్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయం నందు కానీ లేదా విజయవాడలో గల సంస్థ కార్యాలయం, ప్లాట్ నెం.9, స్ట్రీట్నం. 4, బండిస్టాన్లీ స్ట్రీట్, ఉమాశంకర్ నగర్, కానూరు, విజయవాడ కార్యాలయంలో కార్యాలయ పని వేళల్లో స్వయంగా సంప్రదించగలరు.

కార్యదర్శి

మహాత్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల

సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ, విజయవాడ


CLICK HERE TO DOWNLOAD

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top