ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం
ఖజానా మరియు లెక్కల శాఖ
నుండి:
కాకాని, నాగేశ్వర రావు,
ఉప ఖజానాధికారి, నందిగామ.
~~~~~~~~~~~~~~~~~~~~
వరకు:
STO నందిగామ పరిధి లోని పాఠశాల విద్య DDO లకు
Lr.No STO/NDG/Estt./08/2024-1, dt 18/01/2024
Sir/Madam,
విషయము: SGT గా 24 సంవత్సరములు సర్వీసు పూర్తి చేసుకుని స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతి పొందిన ఉపాధ్యాయుల వేతన స్థిరీకరణ గురించి.
సూచిక: శ్రీ K.V. నరసింహా రావు, SA (English), MPUPS, పల్లగిరి, నందిగామ మండలం తదితరుల విజ్ఞాపన తేదీ: 05.01.2024
@@@
పై సూచిక లోని శ్రీ K.V. నరసింహా రావు, SA (English), MPUPS, పల్లగిరి, నందిగామ మండలం విజ్ఞాపన దృష్ట్యా ఈ క్రింది వివరణ ను మీ ద్రుష్టికి తీసుకురానైనది.
ప్రస్తుతం అందుబాటులో వున్న ప్రభుత్వ ఉత్తర్వులననుసరించి సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులుగా పనిచేస్తూ 24 సంవత్సరముల సర్వీస్ పూర్తి చేసి అప్రయత్న పదోన్నతి పధకం క్రింద 06/12 / 18 సంవత్సరాల స్కేళ్లను పొందిన వారు విధిగా 2nd లెవెల్ ప్రమోషన్ పోస్ట్ పే స్కేల్ అనగా SPP-IA పొందవలెను. సదరు ఉపాధ్యాయునికి లేదా ఉద్యోగికి ఈ అప్రయత్న పదోన్నతి స్కేల్ వర్తింపజేయడం విధిగా కంపేటెంట్ అథారిటీ బాధ్యత (మునుపటి అనగా 06 / 12 / 18 సంవత్సరాల స్కేళ్లను వర్తింప చేసిన విధంగానే). ఇక్కడ గమనించ తగిన విషయమేమంటే ఒక ఉద్యోగికి లేదా ఉపాధ్యాయునికి పదోన్నతి పొందే విషయమై తిరస్కరించడానికి (RELINQUISHMENT) అవకాశం వుంది కాన్ 06 / 12 / 18 / 24 /30 సంవత్సరాల స్కేళ్లను తిరస్కరించడానికి (RELINQUISHMENT) ప్రస్తుతం అందుబాటులో వున్న ప్రభుత్వ నిబంధనల మేరకు అవకాశం లేదు. అనంతరం వీరు స్కూల్ అసిస్టెంట్/ తదుపరి పదవికి పదోన్నతి పొందినట్లైతే పదోన్నతి పొందిన పోస్ట్ లో వీరికి FR22. (a)(i) క్రింద వేతన స్థిరీకరణ చేయాల్సి ఉంటుంది. వీరికి పదోన్నతి పొందిన పోస్ట్ లో 6 సంవత్సరముల సర్వీసు పూర్తి చేసిన పిమ్మట లభించే SGT వేతన స్థిరీకరణకు అవకాశం లేదు.
DDO లు పై విధానం క్రింద స్థిరీకరించిన వేతన స్థిరీకరణ బిల్లులను ఆమోదం నిమిత్తం ట్రెజరీకి పంపే సందర్భం లో బిల్లుకు విధిగా సర్వీస్ రిజిస్టర్ ప్రతిని జత పరచవలసి ఉంటుంది. DDO సమర్పించిన బిల్లు లోని వివరాలు సర్వీస్ రిజిస్టర్ లోని వివరాలతో సరి పోల్చుకుని బిల్లు పేమెంట్ కొరకు పంపడం జరుగుతుంది. సాధారణంగా అన్ని ట్రెజరీ కార్యాలయాలలో బిల్లులను పాస్ చేయడానికి ఇదేవిధమైన పద్ధతిని అనుసరించడం జరుగుతుంది. కానీ ఈ కార్యాలయ పరిధి లోని కొంతమంది DDO లు 24 సంవత్సములు సర్వీస్ పూర్తి అయినప్పటికీ అందుబాటులో వున్న నిబంధనలను అనుసరించక 24 సంవత్సరాల వేతన స్థిరీకరణ చేయకుండా మరియు సదరు విషయాన్ని గోప్యతగా ఉంచి పదోన్నతి పొందిన తరువాత పదోన్నతి పొందిన పోస్ట్ లో FR 22 (8) క్రింద వేతన స్థిరీకరణ చేసినట్లు మా దృష్టికి వచ్చినది. సదరు వేతన స్థిరీకరణ లను పునఃపరిశీలించి జరిగిన పొరపాటును సరిదిద్దుకుని భవిష్యత్ లో AG ఆడిట్ అభ్యంతరాలకు గురికాకుండా వుండవలసినదిగా DDO లకు ఈ కార్యాలయం ద్వారా తెలియ పరచడమైనది.
ఇందు మూలంగా తెలియపరచునదేమనగా, ఆంధ్ర ప్రదేశ్ ఆర్టికల్ 56, ఫైనాన్షియల్ కోడ్ వాల్యూమ్ ప్రకారం, చెల్లింపు మరియు భత్యాలు లేదా ఆకస్మిక ఖర్చుల కోసం బిల్లులను డ్రా చేసే ప్రతి ప్రభుత్వోద్యోగి, ప్రతి బిల్లు డ్రా చేయబడిన మొత్తం యొక్క ఖచ్చితత్వానికి ప్రాథమికంగా బాధ్యత వహిస్తారు. బకాయి ఉన్న దానికంటే ఎక్కువ మొత్తం డ్రా అయినట్లయితే, డ్రాయింగ్ అధికారి అలా డ్రా అయిన అదనపు మొత్తాన్ని సదరు ఉద్యోగి వద్ద నుండి రికవరీ చేయాల్సి ఉంటుంది. ఏదైనా కారణాల వల్ల అదనపు మొత్తాన్ని డ్రాయింగ్ అధికారి రికవరీ చేయలేకపోతే, అతని పక్షాన దోషపూరిత నిర్లక్ష్యం వల్ల ఉత్పన్నమయ్యే నష్టాన్ని భర్తీ చేయవలసి ఉంటుంది. కనుక కనుక పాఠశాల విద్య కు సంబంధించిన డ్రాయింగ్ అధికారులందరూ సదరు వేతన స్థిరీకరణలను పునః పరిశీలించి ఏమైనా వ్యత్యాసములు వున్నట్లైతే సరిచేసుకోవలసినదిగా కోరడమైనది.
మీ పరిధి లో పనిచేయు ఉద్యోగుల, ఉపాధ్యాయులు తమ విజ్ఞప్తులను మీ ద్రుష్టి కి తీసుకురాకుండా సమయ పాలన లేకుండా నేరుగా ఈ కార్యాలయాన్ని సంప్రదిస్తున్నారు. దీనివల్ల ఈ కార్యాలయ సిబ్బంది కి అసౌకర్యం కలుగుతుంది. కనుక అట్టి వారి విజ్ఞప్తులను THROUGH PROPER CHANNEL అనగా DDO ల ద్వారా పంపవలసినదిగా కోరడమైనది.
ధన్యవాదములతో...!!!
మీ విశ్వాసపాత్రుడు,
కాకాని నాగేశ్వర రావు,
ఉప ఖజానాధికారి, నందిగామ.
0 Post a Comment:
Post a Comment