Friday 1 December 2023

NMMS - 2023 ఫిబ్రవరిలో NMMS కు సెలెక్ట్ అయిన విద్యార్థులు తమ వివరాలను స్కాలర్షిప్ పోర్టల్ నందు నమోదు చేసుకొనుటకు చివరి తేదీ 31-12-2023 వరకు పొడిగింపు

 ప్రభుత్వ పరీక్షల కార్యాలయం
పత్రికా ప్రకటన



ఫిబ్రవరి 2023 లో జరిగిన నేషనల్ మీన్స్- కం-మెరిట్ స్కాలర్షిప్ పరీక్షలో ఎంపిక అయిన విద్యార్థులు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ నందు తమ వివరములు నమోదు చేసుకొనుటకు మరొక అవకాశంగా 31-12-2023 వరకు పొడిగించినారు. విద్యార్థి వివరములు ఒక్క అక్షరం కూడా తేడా లేకుండా మెరిట్ కార్డ్ పైన ముద్రించిన విధంగానే ఆధార్ మరియు బ్యాంక్ పాస్ బుక్ లో ఉండేవిధంగా సరిచూసుకుని పోర్టల్ నందు తమ వివరములు ది. 31-12-2023 లోపు నమోదు చేసుకొనవలెను. విద్యార్థి వివరములను సంబంధిత స్కూల్ నోడల్ ఆఫీసర్ లెవెల్ లో ది.15-01-2024 లోపు క్షుణ్ణం గా పరిశీలించి, స్కూల్ నోడల్ ఆఫీసర్ లాగిన్ (INO) ద్వారా ధృవీకరించవలెను. ఈ సంవత్సరం ప్రతి DNO (District Nodal Officer) మరియు INO (Institute Nodal Officer) & HOI (Head of Institution) ఖచ్చితంగా Biometric Authentication చేయించుకోవాలి అనే రూల్ పెట్టడం వల్ల మైనారిటీ స్కీమ్ కొరకు Biometric Authentication చేయించుకున్న పాఠశాలల వారు కాక మిగిలిన పాఠశాలల వారు తప్పకుండా Biometric Authentication చేయించుకొనవలెను. ఈ విషయమై పూర్తి వివరములు సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయమునకు అతి త్వరలో పంపించడం జరుగుతుంది. కనుక ఇంకా Biometric Authentication చేయించుకొనని INO /HOI లు సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయమును సంప్రదించవలెను. మెరిట్ కార్డ్ పైన ముద్రించిన విధంగానే ఆధార్ కార్డ్ పైన లేని విద్యార్ధులు వెంటనే ఆధార్ మరియు బ్యాంక్ పాస్ బుక్ లలో సరిచేయించుకొనవలెను. మెరిట్ కార్డ్ పైన ఉన్న వివరములే తప్పుగా ఉన్న యెడల వెంటనే సంబంధిత స్కూల్ వారు సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయంలో ఆధార్ Mismatch వివరములను ఇవ్వవలెను. విద్యార్ధి పేరు, పుట్టిన తేదీ, తండ్రి పేరు ఒక్క అక్షరం తేడా ఉన్నా కూడా Mismatch proforma (Excel) సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయములో ఇవ్వవలెను. అదేవిధంగా నవంబరు 2019, ఫిబ్రవరి 2021 మరియు మార్చి 2022 సంవత్సరములలో ఎంపిక కాబడి ప్రభుత్వ మరియు అయిడెడ్ పాఠశాలల్లో / కళాశాలల్లో చదువుచున్న విద్యార్థులు ఈ సంవత్సరం తప్పకుండా రెన్యువల్ చేసుకొనవలెను. గత సంవత్సరాలలో బ్యాంక్ పాస్ బుక్ ద్వారా నమోదు చేసుకున్న రెన్యువల్ విద్యార్థులు తప్పకుండా ఈ సంవత్సరం ఆధార్ వివరములు నమోదు చేయవలెను. ఆధార్ Mismatch ఉన్న వారు వారి అప్లికేషన్ లో ఉన్న face-auth ఆప్షన్ ద్వారా వారి అప్లికేషన్ సబ్మిట్ చేయవలెను. అలా కాని పక్షంలో ఆధార్ లో సరిచేయించుకొనవలెను. లేనియెడల స్కాలర్షిప్ మంజూరు కాబడదు. ఈ పధకం యొక్క విధి విధానాలు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ నందు పొందగలరు. విద్యా మంత్రిత్వ శాఖ, న్యూ ఢిల్లీ వారు నిర్దేశించిన గడువులోపు ఈ ప్రక్రియ పూర్తి చేయని విద్యార్థులకు స్కాలర్షిప్ మంజూరు కాబడదు, దానికి విద్యార్థి తల్లితండ్రులు మరియు సంబంధిత పాఠశాలవారే బాధ్యత వహించవలసి ఉంటుంది అని ప్రభుత్వ పరీక్షల కార్యాలయ సంచాలకులు శ్రీ డి దేవానంద రెడ్డి గారు తెలియజేసారు.


సం/- డి. దేవానంద రెడ్డి

సంచాలకులు

ప్రభుత్వ పరీక్షల కార్యాలయం


CLICK HERE TO DOWNLOAD 

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top