ఆధార్కార్డు లాగే విద్యార్ధులకు అపార్ ఐడీకార్డు. దరఖాస్తు చేసుకోండిలా...
✦ దేశ పౌరులందరికి ఒకేఒక్క గుర్తింపుకార్డు.. ఆధార్.. అది మనందరికి తెలుసు. ఇప్పుడు దేనికైనా ఆధార్ లేకుండా పని జరగదు. ప్రభుత్వ, ప్రైవేట్ అనికాకుండా అన్నిసంస్థల్లోనూ గుర్తింపునకు ఆధార్ కార్డు చూపించాల్సిందే.. అయితే కేంద్ర ప్రభుత్వం అచ్చు ఆధారు కార్డు మాదిరిగానే విద్యార్థులకోసం కూడా కొత్త కార్డును అందుబాటులోకి తెచ్చింది. అదే అపార్ కార్డు (APAAR CARD). జాతీయ విద్యావిధానం (NEP) 2020 లో భాగంగా భారతదేశం అంతటా పాఠశాల విద్యార్థులకోసం ప్రత్యేక ID నంబర్లను రూపొందించేందుకు APAAR ID కార్డును ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం.
✦ APAAR ID: వన్ నేషన్ - వన్ స్టూడెంట్ ID కార్డు అని కూడా పిలుస్తారు. ఈ కార్డు ద్వారా రివార్డులు, డిగ్రీలు, స్కాలర్ షిప్ లు , ఇతర క్రెడిట్ లు వంటి పూర్తి అకడమిక్ డేటాను డిజిటలైజేషన్ చేస్తారు. ఇది విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
✦ APAAR ID అంటే ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. APAAR ID కార్డులను జారీ చేసేందుకు భారత ప్రభుత్వం అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ (ABC)ని ప్రారంభించింది. ఈ కార్డు ఎకో సిస్టమ్ రిజిస్ట్రీగా పనిచేస్తుంది. దీనిని Edulocker గా సూచిస్తారు.
APAAR ID కార్డు అంటే...
✦ APAAR ID కార్డుని కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ప్రారంభించింది. దేశంలోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు, లేదా కళాశాలలో చదువుతున్న విద్యార్థులకోసం డిజిటల్ ID కార్డు ఇది. APAAR ID కార్డు విద్యార్థులు తమ అకడమిక్ క్రెడిట్లు, డిగ్రీలు, ఇతర సమాచారాని్న ఆన్ లైన్ ద్వారా సేకరించేందుకు వీలు కల్పిస్తుంది.
✦ APAAR ID కార్డు అనేది జీవిత కాల ఐడీ నెంబర్.. ఇది విద్యార్థుల విద్యా ప్రమాణం, విజయాలను నమోదు చేస్తుంది. ట్రాక్ చేస్తుంది. ఒక పాఠశాల నుంచి మరొ పాఠశాలకు బదిలీ సులభతరం చేస్తుంది. ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు చేరిన ప్రతి విద్యార్థికి పాఠశాలలు, కళాశాలలు ఈ కార్డును జారీ చేస్తాయి. APAAR ID కార్డు ఇప్పటికే ఉన్న విద్యార్థుల ఆధార్ ఐడీకి అదనంగా ఉంటుంది.
APAAR ID డౌన్ లోడ్ ఎలా...?
APAAR ID కార్డు రిజిస్ట్రేషన్ తర్వాత విద్యార్థులు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. APAAR కార్డు ప్రత్యేక గుర్తింపు సంఖ్య 12 అంకెల నంబర్ ను కలిగి వుంటుంది. దీని ద్వారా విద్యార్థులు తమ విద్యాసంబంధమైన రికార్డులు పొందు పర్చడం ప్రయోజనం పొందవచ్చు. APAAR స్టూడెంట్ ఐడీ కార్డు.. విద్యార్థుల ఆధార్ కార్డు నంబరుకు లింక్ చేయబడుతుంది.
APAAR ID కార్డు రిజిస్ట్రేషన్ ఎలా...?
✦ అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ (ABC బ్యాంక్) వెబ్ సైట్ ను సందర్శించాలి.
✦ My Account పై క్లిక్ చేసి Student ను ఎంపిక చేసుకోవాలి.
✦ డిజిలాకర్ ఖాతా తెరవడానికి Signup పై క్లిక్ చేసి మొబైల్, చిరునామా, ఆధార్ కార్డు వివరాలను నమోదు చేయాలి.
✦ ఆధారాలను ఉపయోగించి DigiLocker ఖాతాకు లాగిన్ చేయండి.
✦ KYCధృవీకరణకోసంABCతో ఆధార్ కార్డు వివరాలను పంచుకోవడానికి DigiLocker మీ అనుమతి అడుగుతుంది. I Accept క్లిక్ చేసి అనుమతించాలి.
✦ పాఠశాల, యూనివర్సిటీ పేరు, తరగతి, కోర్సు పేరు మొదలైన విద్యావివరాలను నమోదు చేసుకోవాలి.
✦ ఫారమ్ ను Submit చేస్తే APAAR iD కార్డు రూపొందించబడుతుంది.
APAAR ID కార్డు రిజిస్ట్రేషన్ చేసేముందు:
1. APAAR ID కార్డు కోసం నమోదుకు విద్యార్థులు తప్పనిసరిగా ఆధార్ కార్డును కలిగి ఉండాలి.
2. తప్పని సరిగా డిజిలాకర్ లో ఖాతా ఉండాలి. ఇది ఈ కేవైసీకి ఉపయోగపడుతుంది.
3. పాఠశాలలు, కళాశాలలు APAAR ID ని జారీ చేసే ముందు విద్యార్థుల తల్లిదండ్రుల అనుమతి పొందాలి. తల్లిదండ్రులు తమ సమ్మతిని ఏ సమయంలోనైనా ఉపసంహరించుకోవచ్చు.
4. తల్లిదండ్రుల సమ్మతి పొందిన తర్వాతే పాఠశాలు APAAR ID కార్డును జారీ చేస్తాయి.
APAAR ID కార్డు డౌన్ లోడ్:
✦ అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ (ABC బ్యాంక్) వెబ్ సైట్ కి లాగిన్ అవ్వాలి.
✦ డ్యాష్ బోర్డులో APAAR CARD DOWNLOAD క్లిక్ చేయాలి.
✦ APAAR కార్డు స్క్రీన్ పై కనిపిస్తుంది.
✦ డౌన్ లోడ్ లేదా ప్రింట్ క్లిక్ చేయడం ద్వారా APAAR కార్డు డౌన్ లోడ్ అవుతుంది.
APAAR కార్డు ప్రయోజనాలు:
✦ APAAR కార్డు విద్యార్థుల జీవత కాల గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుంది.
✦ APAAR కార్డు విద్యార్థుల డేటాను ఒకే చోట నిల్వ చేస్తుంది.
✦ APAAR కార్డు విద్యార్థి పూర్తి విద్యా డేటా కలిగి ఉన్నందున దేశంలోని ఏ ప్రాంతంలోనైనా, ఏ కొత్త సంస్థలలోనైనా ప్రవేశం పొందడం చాలా సులభం.
✦ విద్యార్థుల డ్రాపవుట్లను గుర్తించొచ్చు. వారిని తిరిగి పాఠశాలలో చేర్చవచ్చు.
✦ స్కాలర్ షిపులు, డిగ్రీలు, రివార్డులు, ఇతర విద్యా క్రెడిట్ లతో అకడమిక్ డేటా డిజిటల్ గా కేంద్రకరించబడుతుంది.
0 Post a Comment:
Post a Comment