NAS - SEAS INSTRUCTIONS
🎈స్టేట్ ఎడ్యుకేషనల్ ఎచీవ్మెంట్ సర్వే నవంబర్ మూడవ (3rd November) తేదీన నిర్వహించడం జరుగుతుంది.
🎈ఇది ఎంపిక చేయబడిన ప్రభుత్వ యాజమాన్య మరియు ప్రవేట్ యాజమాన్య పాఠశాలలలో నిర్వహిస్తారు.
🎈మూడవ తరగతి, ఆరవ తరగతి, తొమ్మిదవ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తారు.
🎈3వ తరగతి విద్యార్థులకు మూడవ తరగతి సిలబస్ పైన, 6వ తరగతి విద్యార్థులకు, ఐదవ తరగతి సిలబస్ పైన, 9వ తరగతి విద్యార్థులకు ఎనిమిదవ తరగతి సిలబస్ పైన పరీక్ష నిర్వహిస్తారు.
🎈3వ తరగతి మరియు 6వ తరగతి విద్యార్థులకు లాంగ్వేజ్, మాథ్స్, ఈ వి ఎస్ నందు, 9వ తరగతి విద్యార్థులకు లాంగ్వేజ్, మాథ్స్, సైన్స్, సోషల్ నందు పరీక్ష నిర్వహించడం జరుగుతుంది.
🎈3వ మరియు 6వ తరగతి విద్యార్థులకు నలభై ప్రశ్నలు, అరవై నిమిషాల సమయం ఇవ్వడం జరుగుతుంది.
🎈9వ తరగతి విద్యార్థులకు అరవై ప్రశ్నలు, తొంబై నిమిషాల సమయం ఇవ్వడం జరుగుతుంది.
🎈పరీక్షల నిర్వహణకు డిగ్రీ స్థాయి కోర్స్ లు చదువుతున్న విద్యార్థులను ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లు పేరుతో వినియోగించడం జరుగుతుంది.
🎈ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లకు జిల్లా స్థాయిలో సమావేశం ఏర్పాటుచేసి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.
🎈డిస్ట్రిక్ట్ లెవెల్ కోఆర్డినేటర్ ఏర్పాటుచేసే శిక్షణా కార్యక్రమానికి ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లందరూ తప్పనిసరిగా హాజరు కావాలి.
🎈కేటాయించిన పాఠశాలల వివరాలు మండల లెవెల్ కోఆర్డినేటర్ నుండి పొందాలి.
🎈ఇవ్వబడిన సూచనల ప్రకారం పరీక్షను నిర్వహించాలి.
పరీక్ష పూర్తైన పిదప ఓ ఎం ఆర్ పాకెట్స్ జాగ్రత్తగా సేకరించి మండల లెవెల్ కోఆర్డినేటర్ కు అప్పగించాలి.
🎈ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లకు మూడు రకాలైన ప్రశ్నాపత్రాలు అంటే ప్యూపిల్స్ క్వచనైర్ (PQ), స్కూల్ క్వచనైర్ (SQ), టీచర్ క్వచనైర్ (TQ) ఇవ్వడం జరుగుతుంది.
🎈ప్యూపిల్స్ క్వచనైర్ ను విద్యార్థులకు, స్కూల్ క్వచనైర్ ను ప్రధానోపాధ్యాయులకు టీచర్ క్వచనైర్ ను ఉపాధ్యాయులకు ఇచ్చి సమాధానాలను రాయించాలి.
🎈ఓ ఎం ఆర్ షీట్స్ నందు సమాధానాలు గుర్తించవలసి ఉంటుంది.
🎈మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ 2 మండల / బ్లాక్ లెవెల్ కోఆర్డినేటర్ గా వ్యవహరించాలి.
🎈చీఫ్ కంట్రోలింగ్ ఆఫీసర్ నుండి పరీక్ష నిర్వహణకు సంబంధించిన మెటీరియల్ సేకరించాలి.
🎈దానిని ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లకు సమర్ధవంతంగా పంపిణీచేయాలి.
🎈పరీక్ష జరిగే సందర్భంలో సరైన పర్యవేక్షణ చేయాలి.
🎈పరీక్ష పూర్తైన పిదప ప్యాకింగ్, కలెక్షన్, చీఫ్ కంట్రోలింగ్ ఆఫీసర్ కు అందించడం వంటివి సమయానుసారం జరిగేటట్లు చర్యలు తీసుకోవాలి.
🎈ప్రతి శనివారం అన్ని యాజమాన్య పాఠశాలలలో ప్రాక్టీస్ టెస్ట్ లు నిర్వహించినట్లైతే విద్యార్థులు సులువుగా పరీక్ష రాయగలుగుతారు. కనుక ప్రాక్టీస్ చేయించాలి.
0 Post a Comment:
Post a Comment