Instructions on State Educatinal Achievement Survey
• స్టేట్ ఎడ్యుకేషనల్ ఎచీవ్మెంట్ సర్వే నవంబర్ మూడవ (3rd November) తేదీన నిర్వహించడం జరుగుతుంది.
• ఇది ఎంపిక చేయబడిన ప్రభుత్వ మరియు ప్రవేట్ యాజమాన్య పాఠశాలలలో నిర్వహిస్తారు.
• 3వ తరగతి, 6వ తరగతి, 9వ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తారు. 3వ తరగతి విద్యార్థులకు 3వ తరగతి సిలబస్ పైన, 6వ తరగతి విద్యార్థులకు 5వ తరగతి సిలబస్ పైన, 9వ తరగతి విద్యార్థులకు 8వ తరగతి సిలబస్ పైన పరీక్ష నిర్వహిస్తారు.
• ఈ SEAS పరీక్ష 3వ, 6వ, 9వ తరగతుల విద్యార్థులకు మాథ్స్, మరియు లాంగ్వేజ్ నందు పరీక్ష నిర్వహించడం జరుగుతుంది.
పరీక్ష నిర్వహణ రెండు మీడియంలలో జరుగుతుంది.
◾ఇంగ్లీష్ మీడియం మ్యాప్ అయిన స్కూల్స్ కు ఇచ్చే SEAS పేపర్లో మాథ్స్, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి. (3వ, 6వ మరియు 9వ తరగతుల విద్యార్థులకు)
◾తెలుగు మీడియంకు మ్యాప్ అయిన స్కూల్స్ కు ఇచ్చే SEAS పేపర్లో మాథ్స్, తెలుగు సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి. (3 వ, 6వ మరియు 9వ తరగతుల విద్యార్థులకు)
✅ 3వ తరగతి విద్యార్థులకు 40 ప్రశ్నలు, 60 నిమిషాల సమయం ఇవ్వడం జరుగుతుంది. 3 వ తరగతి విద్యార్థులకు ఇచ్చే SEAS పేపర్లో FLN మాథ్స్ నుండి 10 క్వశ్చన్స్, FLN ఇంగ్లీష్/ తెలుగు నుండి 10 క్వశ్చన్స్ ఉంటాయి. మిగిలినవి 10 జనరల్ మాథ్స్ క్వశ్చన్స్, 10 జనరల్ ఇంగ్లీష్/ తెలుగు క్వశ్చన్స్ ఉంటాయి.
✅ 6వ తరగతి విద్యార్థులకు 50 ప్రశ్నలు,75 నిమిషాల సమయం ఇవ్వడం జరుగుతుంది. 6 వ తరగతి విద్యార్థులకు ఇచ్చే SEAS పేపర్లో FLN మాథ్స్ నుండి 10 క్వశ్చన్స్, FLN ఇంగ్లీష్/ తెలుగు నుండి 10 క్వశ్చన్స్ ఉంటాయి. మిగిలినవి 15 జనరల్ మాథ్స్ క్వశ్చన్స్ (5వ తరగతి పై), 15 జనరల్ ఇంగ్లీష్/ తెలుగు క్వశ్చన్స్ (5వ తరగతి పై) ఉంటాయి.
✅ 9వ తరగతి విద్యార్థులకు 60 ప్రశ్నలు, 90 నిమిషాల సమయం ఇవ్వడం జరుగుతుంది. 9 వ తరగతి విద్యార్థులకు ఇచ్చే SEAS పేపర్లో FLN మాథ్స్ నుండి 10 క్వశ్చన్స్, FLN ఇంగ్లీష్/ తెలుగు నుండి 10 క్వశ్చన్స్ ఉంటాయి. మిగిలినవి 20 జనరల్ మాథ్స్ క్వశ్చన్స్(8వ తరగతి పై), 20 జనరల్ ఇంగ్లీష్/ తెలుగు క్వశ్చన్స్ (8వ తరగతి పై) ఉంటాయి.
• పరీక్షల నిర్వహణకు డిగ్రీ స్థాయి కోర్స్ లు చదువుతున్న విద్యార్థులను, డిఎడ్ చదువుతున్న విద్యార్థులు, ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులను ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లు పేరుతో వినియోగించడం జరుగుతుంది.
• ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లకు జిల్లా స్థాయిలో సమావేశం ఏర్పాటుచేసి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.
• డిస్ట్రిక్ట్ లెవెల్ కోఆర్డినేటర్ ఏర్పాటుచేసే శిక్షణా కార్యక్రమానికి ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లందరూ తప్పనిసరిగా హాజరు కావాలి.
• కేటాయించిన పాఠశాలల వివరాలు మండల లెవెల్ కోఆర్డినేటర్ నుండి పొందాలి.
• ఇవ్వబడిన సూచనల ప్రకారం పరీక్షను నిర్వహించాలి.
• పరీక్ష పూర్తైన పిదప ఓ ఎం ఆర్ పాకెట్స్ జాగ్రత్తగా సేకరించి మండల లెవెల్ కోఆర్డినేటర్ కు అప్పగించాలి.
• ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లకు మూడు రకాలైన ప్రశ్నాపత్రాలు ఇస్తారు.
1) ప్యూపిల్స్ క్వచనైర్ (PQ),
2) స్కూల్ క్వచనైర్ (SQ),
3) టీచర్ క్వచనైర్ (TQ)
• పూపిల్స్ క్వచనైర్ ను ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లు, స్కూల్ క్వచనైర్ ను ప్రధానోపాధ్యాయులకు, టీచర్ క్వచనైర్ ను ఉపాధ్యాయులకు ఇచ్చి పూరించాలి.
• ఓ ఎం ఆర్ షీట్స్ నందు సమాధానాలు గుర్తించవలసి ఉంటుంది.
• మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ 2 మండల / బ్లాక్ లెవెల్ కోఆర్డినేటర్ గా వ్యవహరించాలి.
• చీఫ్ కంట్రోలింగ్ ఆఫీసర్ నుండి పరీక్ష నిర్వహణకు సంబంధించిన మెటీరియల్ సేకరించాలి.
• దానిని ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లకు సమర్ధవంతంగా పంపిణీచేయాలి.
• పరీక్ష జరిగే సందర్భంలో సరైన పర్యవేక్షణ చేయాలి.
• పరీక్ష పూర్తైన పిదప ప్యాకింగ్, కలెక్షన్, చీఫ్ కంట్రోలింగ్ ఆఫీసర్ కు అందించడం వంటివి సమయానుసారం జరిగేటట్లు చర్యలు తీసుకోవాలి.
• ప్రతి శనివారం అన్ని యాజమాన్య పాఠశాలలలో ప్రాక్టీస్ టెస్ట్ లు నిర్వహించినట్లైతే విద్యార్థులు సులువుగా పరీక్ష రాయగలుగుతారు. కనుక ప్రాక్టీస్ చేయించాలి.
0 Post a Comment:
Post a Comment