పాఠశాల సముదాయాల నిర్వహణ పై సూచనలు
◾పాఠశాల అకాడమిక్ క్యాలెండర్లో సూచించిన విధముగా ఆగస్టు నెలలో 28,29 తేదీలలో అనగా సోమ మరియు మంగళవారంలలో ప్రైమరీ మరియు సబ్జెక్టు టీచర్ల కాంప్లెక్స్ ట్రైనింగ్స్ జరుగును
◾సి ఆర్ సి ట్రైనింగ్ కు ఒక రోజు మండలంలోని ఎంఈఓ లు సిఆర్సి హెడ్మాస్టర్ లతోను మరియు జాయింట్ సెక్రటరీలతోను planning and coordination మీటింగ్ ను ఏర్పాటు చేసుకుని మీటింగ్ ల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేసుకోలెను.
◾సిఆర్సి ట్రైనింగ్ జరిగేటువంటి గది మంచి గాలి, వెలుతురు సోకేదిగా ఉండాలి మరియు ఉపాధ్యాయులు కూర్చోవడానికి సౌకర్యవంతంగా ఉండవలెను. సౌకర్యవంతమైన కుర్చీలు, ఫ్యాన్లు, సౌండ్ సిస్టం, ఇంట్రాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ లేదా స్మార్ట్ టీవీ ఆ గదిలో ఉండునట్లు చర్యలు తీసుకోవలెను.
◾ప్రతి సి ఆర్ సి లో కూడాను 30 నుండి 45 మంది ఉపాధ్యాయులు హాజరవునట్లు ప్రణాళికలు సిద్ధం చేసుకోవలయును.
◾అలాగే సబ్జెక్టు టీచర్లకు రెండు లేదా మూడు మండలాలకు కలిపి ట్రైనింగ్స్ ను నిర్వహించాలి.
◾ఈ సంవత్సరం ఆగస్టు మాసం నుండి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు కూడా నియోజకవర్గ స్థాయిలో సి ఆర్ సి మీటింగులు జరుగుతాయి. నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో ఉన్న ఎంఈఓలు దీనికి తగిన ఏర్పాట్లు చేసుకోవలెను.
◾సిఆర్సి హెడ్మాస్టర్ మరియు సిఆర్సి జాయింట్ సెక్రెటరీ మీటింగ్ కు హాజరయ్యే ఉపాధ్యాయుల జాబితాను ముందుగానే సిద్ధం చేసుకోవలెను. రెండు కాపీలలో హాజరు సంతకములు ఉదయం మధ్యాహ్నం వేరువేరుగా తీసుకోవలెను.
◾సిఆర్సి ట్రైనింగుల కొరకు మంచి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ని రిసోర్స్ పర్సన్స్ గా ఎంపిక చేసుకుని శిక్షణను ఇప్పించవలెను.
◾షెడ్యూల్లో పేర్కొన్న విధముగా టైం టేబుల్ ప్రకారము ట్రైనింగ్ నిర్వహించవలయును.
◾సిఆర్సి ట్రైనింగ్లలో ఉపాధ్యాయులు తమ బోధనలో వారు చేపట్టినటువంటి వినూత్న కార్యక్రమాలను (best practices ) షేర్ చేసుకోవలెను.
◾ఇచ్చిన అంశాలపై అర్థవంతమైన చర్చలు జరగాలి
◾బోధనలో టి.ఎల్.ఎం వినియోగించడం, టి ఎల్ ఎం ను స్కూల్ కాంప్లెక్స్ లో ప్రదర్శించడం జరగాలి.
◾లేబరేటరీలు మరియు లైబ్రరీల ను సమర్థవంతంగా ఎలా ఉపయోగించుకోవాలో అనే అంశముపై చర్చ జరగాలి.
◾మన పాఠశాలలో అమలవుతున్న వివిధ కార్యక్రమాలైన TaRL, TEACH TOOL, SAALASIDDI మొదలైన ఇంటర్వెన్షన్ లపై చర్చలు జరగాలి.
◾కాంప్లెక్స్ పరిధిలో సి ఆర్ సి హెడ్మాస్టర్లు, మండల పరిధిలో ఎంఈఓ లు, జిల్లాస్థాయిలో ఉప విద్యాశాఖ అధికారులు మరియు సెక్టోరియల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేయుదురు. అదేవిధంగా రాష్ట్ర బృందాలు కూడా కాంప్లెక్స్ ట్రైనింగ్ లను విజిట్ చేయుదురు.
పై అంశాలను దృష్టి లో ఉంచుకొని స్కూల్ కాంప్లెక్స్ ట్రైనింగులను విజయవంతంగా నిర్వహించవలసింది.
0 Post a Comment:
Post a Comment