Sunday 2 July 2023

IFP TRAINING FOR TEACHERS (సందేహాలు - సమాధానాలు)

 IFP TRAINING FOR TEACHERS (సందేహాలు  - సమాధానాలు)



1. ట్రైనింగ్ కు బైజుస్ ట్యాబ్ తీసుకురావాలా వద్దా ?

సమాధానం: ఉపాధ్యాయులు ట్రైనింగ్ వచ్చేటప్పుడు తమతో పాటు ఉపాధ్యాయులకు ఇచ్చిన బైజుస్ ట్యాబ్ కంపల్సరిగా తీసుకురావాలి.


2. ట్రైనింగ్ సెంటర్ లో భోజనం వసతి ఉందా ?

సమాధానం: ట్రైనింగ్ కు వచ్చే ప్రతి ఒక్కరికి భోజన సదుపాయం కల్పించడం జరుగుతుంది.


3. ట్రైనింగ్ కు హెడ్మాస్టర్ హాజరు కావాలా వద్దా ?

సమాధానం: ట్రైనింగ్ కు పాఠశాలలో పనిచేసే టీచింగ్ స్టాఫ్ తో పాటు హెడ్మాస్టర్ కూడా హాజరు కావాల్సి ఉంటుంది.


4. మా పాఠశాలలో ఉండే ఉపాధ్యాయుల సంఖ్య కంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులను చూపిస్తున్నారు ఎలా ?

సమాధానం: మీ పాఠశాలలో పనిచేసే టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సిబ్బంది అంతా కూడా ట్రైనింగు చూపించడం జరిగింది అందువలన మీ పాఠశాల నుంచి ఎక్కువ మందిని ట్రైనింగ్ లో చూపించడం జరుగుతుంది. ట్రైనింగ్ కు కేవలం హెడ్మాస్టర్ తో పాటు టీచింగ్ స్టాఫ్ మాత్రమే రావాల్సి ఉంటుంది.


5. ట్రైనింగ్ కు ఎంత మంది హాజరు కావాలి ?

సమాధానం: మీ పాఠశాలలో ఉండే టీచర్స్ సంఖ్యను బట్టి బ్యాచ్లు కేటాయించి ఇవ్వడం జరిగింది. మీ పాఠశాలకు రెండు బ్యాచ్లు మాత్రమే కేటాయించి ఉంటే తప్పకుండా సగం మంది ఒక బ్యాచ్ లో సగం మంది రెండో బ్యాచ్ లో హాజరు కావాల్సి ఉంటుంది. ఒకవేళ మూడు లేదా నాలుగు బ్యాచుల్లో మీ పాఠశాల పేరు ఉంటే ఆ బ్యాచుల సంఖ్యను బట్టి మీ ఉపాధ్యాయులను సమానంగా పంపించవచ్చు.


6. మా పాఠశాలకు కేటాయించిన బ్యాచ్లో కాకుండా వేరే బ్యాచ్ లో జాయిన్ అవ్వవచ్చా ?

సమాధానం: మీ పాఠశాలకు ఏ బ్యాచ్ లో కేటాయించారు ఆ బ్యాచ్ లో మాత్రమే మీ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు హాజరు కావాల్సి ఉంటుంది. మిగతా బ్యాచ్ లో హాజరు కావడానికి అవకాశం లేదు. ఎందుకంటే అటెండెన్స్ ఆన్లైన్ అటెండెన్స్ ఉంటుంది కాబట్టి మీకు ఏ డేట్ లో బ్యాచ్ క్రియేట్ చేశారో ఆ డేట్ లో మాత్రమే మీ పాఠశాల ఉపాధ్యాయుల అటెండెన్స్ ఆన్లైన్లో ఓపెన్ అవుతుంది.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top