Monday 24 July 2023

తేదీ: 24.07.2023 న జరిగిన కాంప్లెక్స్ స్థాయి ఉపాధ్యాయుల శిక్షణకు సంబంధించి సి ఆర్ సి హెడ్మాస్టర్ ల ఓరియంటేషన్ కార్యక్రమంలోని ముఖ్యంశాలు.

 తేదీ: 24.07.2023 న జరిగిన  కాంప్లెక్స్ స్థాయి ఉపాధ్యాయుల శిక్షణకు సంబంధించి సి ఆర్ సి హెడ్మాస్టర్ ల ఓరియంటేషన్ కార్యక్రమంలోని ముఖ్యంశాలు.



◾గౌరవ SPD, సమగ్ర శిక్ష వారు  జారీ చేసిన ప్రొసీడింగ్స్ ప్రకారము  ట్రైనింగ్స్ ను నిర్వహించవలెను.

◾2023-24 విద్యా సంవత్సరంలో  8 CRC స్థాయి ట్రైనింగ్ లను  నిర్వహించవలెను.

◾జూలై మాసంనకు సంబంధించి  25 మరియు 26 వ తేదీలలో ప్రైమరీ మరియు సబ్జెక్టు టీచర్ల  కాంప్లెక్స్ రిసోర్స్ ట్రైనింగ్స్  ను నిర్వహించవలెను.

◾ఖచ్చితంగా 30 నుండి 40 మంది ఉపాధ్యాయులు  ఒక సెంటర్ నందు హాజరగునట్లు  ప్రణాళికలు సిద్ధం చేసుకోవలెను.

◾ప్రైమరీ మరియు సబ్జెక్టు కాంప్లెక్స్ ట్రైనింగులకు ఒకటే అజెండా.

◾హైస్కూల్ నందు  మూడు, నాలుగు, ఐదు తరగతులు బోధించే స్కూల్ అసిస్టెంట్లు సబ్జెక్ట్ టీచర్  ట్రైనింగ్ కు హాజరుకావలెను.

◾ప్రతి సి ఆర్ సి ట్రైనింగ్ సెంటర్లో    IFP/స్మార్ట్ TV /ట్యాబు లను ఉపయోగించి శిక్షణను నిర్వహించాలి.

రేపు ఉదయం 10 గంటలకు  SCERT వారి లైవ్ స్ట్రీమింగ్ ను  ట్రైనింగ్ సెంటర్లో  ఉపాధ్యాయులందరూ వీక్షించాలి.

◾ప్రతి సిఆర్సి సెంటర్లో  అటెండెన్స్ రిజిస్టర్ ను మైంటైన్ చేయాలి. అలాగే కాంప్లెక్స్ పరిధిలోని ఉపాధ్యాయుల సమగ్ర సమాచారమును అందులో పొందుపరచాలి.

◾ట్రైనింగ్ లో పాల్గొన్న ఉపాధ్యాయుల వివరాలు  CSE వెబ్సైట్లో టీచర్ ట్రైనింగ్ సపోర్ట్ సిస్టం- TTSS నందు నమోదు చేయవలెను.

◾ట్రైనింగ్ లో బోధన అభ్యసన ప్రక్రియలో  ఉపాధ్యాయుల BEST PRACTICES (వినూత్న కార్యక్రమాలు ) ను షేర్ చేసుకోలేను.

◾కాంప్లెక్స్ స్థాయిలో ఉపాధ్యాయుల బెస్ట్ ప్రాక్టీసెస్ను డాక్యుమెంటేషన్ రూపంలో జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయమునకు పంపవలెను.

◾అజెండా ప్రకారం మాత్రమే  కాంప్లెక్స్ మీటింగులు నిర్వహించాలి. వ్యక్తిగత చర్చలకు, సర్వీస్ మేటర్స్ కు, సెలబ్రేషన్స్  మొదలైన వాటికి ఈ మీటింగ్స్ ను వేదికగా చేసుకోకూడదు. కేవలం అకడమిక్   విషయాల పైన మాత్రమే చర్చ జరగవలెను.

◾కాంప్లెక్స్ స్థాయి ట్రైనింగుల నిర్వహణ పూర్తిగా సంబంధిత CRC హెడ్మాస్టర్లది.

◾ప్రతి కాంప్లెక్స్ లో  NIPUN BHARATH /FLN  కార్యక్రమాలు నిర్వహించే క ఒక ప్రాథమిక పాఠశాలను గుర్తించి ఎంపిక చేసి ఆ పాఠశాల వివరాలను జిల్లా కార్యాలయానికిపంపవలెను.

◾మండల స్థాయిలో ఎంఈఓ 1 & 2  లు పర్యవేక్షణ చేయవలెను.

◾డైట్ సిబ్బంది, సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారులు మరియు రాష్ట్ర స్థాయి అధికారులు  ఆకస్మిక తనిఖీలు చేయుదురు.

◾ట్రైనింగ్ సమయంలో ఏ ఒక్క పాఠశాల కూడా మూతపడకుండా చూసుకోవలెను.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's need

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More
Blinking Text
Top