Tuesday 4 April 2023

ప్రవర్తనా నియమావళి - 1964 నియమ నిబంధనలు

ప్రవర్తనా నియమావళి - 1964 నియమ నిబంధనలు



Rule 3(a) : ఏ ఉద్యోగియైన దేశ భద్రతకు, రాష్ట్ర భద్రతకు ముప్పు కలిగించే ఉద్దేశ్యం గల సంస్థలతో సంబంధాలు కలిగిన సభ్యునిగా ఉండకూడదు.

Rule 3(b) : విధి నిర్వాహణలో గాని ఇతరత్రా గాని ప్రజలతో సమంజసమైన రీతిలో ప్రవర్తించాలి. అసభ్యంగా ప్రవర్తించకూడదు.తనకు కేటాయించిన పనిని దురుద్దేశ్యంతోగాని మరి ఇతరత్రా కారణాల వల్లగాని అదేపనిగా ఆలస్యం చేయకూడదు.

Rule 4 :  ఏ ఉద్యోగి కూడా సమ్మెలు తదితర రెచ్చగొట్టే కార్యక్రమాలలో పాల్గొనకూడదు.

Rule 5 :  రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలకు భంగం కలిగించే ప్రదర్శనలలో (Demonstrations) పాల్గొనకూడదు.

Rule 7 : ప్రభుత్వ పూర్వానుమతి లేనిదే ఏ కార్యక్రమానికైనా చందాలు వసూలు చేయటం కాని తీసుకొనటం కాని చేయకూడదు.

Rule 10 : ఏ ఉద్యోగస్థుడు కూడా ప్రయివేటు వ్యాపారములు తదితరములు చేయకూడదు. ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని అట్టి పనులు చేయకూడదు. అదే విధంగా భీమా ఏజెంటుగా గాని, కమిషన్ ఎజెంటుగా గాని పనిచేయకూడదు.

Rule 11 :  ఏ ఉద్యోగస్థుడు కూడా  వ్యక్తిగత హోదాలో బ్యాంకులు గాని, రిజిస్టర్డు కంపెనీలు గాని పెంచి పోషించకూడదు. కాని సామాజిక సేవా దృక్పధంతో రిజిస్టర్డు కాబడిన సహకార సంస్థల కార్యకలాపాలలో పాలు పంచుకోవచ్చును.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top