ప్రాథమిక విద్యావిధానంలో నూతన మార్పులు : ప్రకటించిన సీబీఎస్ఈ
జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ప్రాథమిక విద్యా విధానంలో సీబీఎస్ఈ బోర్డు మార్పులు తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఎన్సీఈఆర్టీ రూపొందించిన నేషనల్ కరికులమ్ ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫౌండేషన్ స్టేజ్ (ఎన్సీఎఫ్ఎఫ్ ఎస్)ను అమలు చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో నర్సరీ నుంచి రెండో తరగతి వరకు సిలబస్ తో పాటు ఇతర అంశాల్లోనూ మార్పులు రానున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం (2023-24) నుంచి అమల్లోకి రానున్న ఈ మార్గదర్శకాల ప్రకారం.. ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల సామర్థ్యాల అంచనా, అభ్యాసన, విధానాలకు సంబంధించి ఉపాధ్యాయులు చొరవ చూపాలి. ప్రస్తుతం ప్రతి చిన్నారికి కంటి చూపు, వినికిడి, ఇతర వైద్య పరీక్షలు చేస్తుండగా వీటితో పాటు ప్రవేశాల సమయంలోనే వారి ఆరోగ్య పరిస్థితి, వాడుతున్న మందులు తదితర వివరాలను విద్యాసం స్థలు తీసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు ఇండోర్, అవుట్ డోర్ ఆటలు ఆడుకునేందుకు సదుపాయాలు కల్పించాలి. ఈ తరగతులు గ్రౌండ్ లేదా మొదటి అంతస్తులో మాత్రమే ఉండాలని సీబీఎస్ఈ తన మార్గదర్శకాల్లో పేర్కొంది. తగినంత వెలుతురు వచ్చే తరగతులు, పారిశుద్ధ్య సదుపాయాలు ఏర్పాటు చేయాలని, తరగతి గదుల్లో కాంక్రీట్ అంచులు గుండ్రగా ఉండాలని స్పష్టం చేసింది.
0 Post a Comment:
Post a Comment