Saturday 29 October 2022

CBA Examination Information

 CBA Examination Information



celebration of the birth Anniversary of sardar Vallabh Bhai patel on 31st October, every year with great enthusiasm across the country in the form of Rashtriya Ekta Diwas. Memo No.138/A&I/2022 , Dated: 29-10-2022.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో గల 26 జిల్లాలలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలో మరియు ప్రవేట్ యాజమాన్య పాఠశాలలలో ఎస్ సి ఈ ఆర్ టి వారి ద్వారా జారీ చేయబడ్డ ప్రశ్నా పత్రాలతో మాత్రమే తేదీ 02.11.2022 నుండి Classroom based Assessments -1 / ఎఫ్ ఏ 1 పరీక్షలు నిర్వహించాలి.

> ఈ విద్యా సంవత్సరం 1 వ తరగతి నుండి 8 తరగతి వరకు గల విద్యార్థులకు క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ (CBA) నిర్వహించడం జరుగుతుంది. 9వ మరియు 10వ తరగతుల విద్యార్థులకు, గతంలో మాదిరిగానే ఎఫ్ ఏ 1 పరీక్షలు. నిర్వహించడం జరుగుతుంది.

> క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ కు ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల విద్యార్థులకు ప్రశ్నా పత్రంతో పాటు ఓ ఏం ఆర్ షీట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రవేట్ యాజమాన్య పాఠశాలల విద్యార్థులకు కేవలం ప్రశ్నా పత్రములు మాత్రమే ఇవ్వబడతాయి. ఓ ఏం ఆర్ లు ఇవ్వబడవు.

> ప్రశ్నా పత్రంలో ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలతో పాటు డిస్క్రిప్టివ్ తరహా ప్రశ్నలు కూడా ఇవ్వబడతాయి. విద్యార్థులు జవాబులను ప్రశ్నా పత్రం లోనే టిక్ చేయాలి మరియు వ్రాయాలి. మరియు ఓ ఏం ఆర్ నందు బబుల్ చేయాలి.

> అన్ని పరీక్షలకు కలిపి ఒకే ఓ ఏం ఆర్ షీట్ ఇవ్వబడుతుంది. కనుక ప్రతిరోజూ పరీక్ష పూర్తైన వెంటనే విద్యార్ధులనుండి ప్రశ్నా పత్రంతో పాటు ఓ ఏం ఆర్ షీట్ కూడా వెనుకకు తీసుకోవాలి.

> పరీక్షలు అన్ని పూర్తైన వెంటనే ఓ ఏం ఆర్ షీట్స్ అన్నింటిని సబ్జెక్టు వారీగా, తరగతి వారీగా వేరు చేసి వేరు వేరు పాలిథిన్ కవర్స్ నందు ఉంచి, ప్యాక్ చేసి సి ఆర్ పి ద్వారా మండల విద్యాశాఖాధికారి వారి కార్యాలయానికి పంపాలి.

> మండల విద్యాశాఖాధికారి తన మండలంలోని అన్ని పాఠశాలల ఓ ఏం ఆర్ షీట్స్ పాకెట్స్ సేకరించి జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు కార్యాలయానికి పంపాలి.

> ఓ ఏం ఆర్ షీట్స్ ను జిల్లా స్థాయిలో స్కాన్ చేయించడం జరుగుతుంది. ఓ ఏం ఆర్ నందు విద్యార్థులు పొందిన మార్కుల వివరాలు పాఠశాలలకు తెలియజేయబడవు. అవి కేవలం విద్యార్థుల స్థాయిని అంచనావేసి భవిష్యత్తులో ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఇవ్వవలసిన శిక్షణా కార్యక్రమాల రూపకల్పనకు మాత్రమే వినియోగించడం జరుగుతుంది.

> ఉపాధ్యాయులు విద్యార్థుల వద్ద నుండి ప్రతి రోజు పరీక్ష తదనంతరం వెనుకకు సేకరించిన జవాబులతో కూడిన ప్రశ్నా పత్రములలోని జవాబులను దిద్దాలి. విద్యార్థులు పొందిన మార్కులను సంబంధిత రిజిస్టర్లు నందు నమోదు చేయడంతో పాటు, నిర్ణీత సమయం లోపల సీ ఎస్ సి సైట్ నందు ఎంటర్ చేయాలి. జవాబులతో కూడిన ప్రశ్నా పత్రాలను తనిఖీ అధికారుల పరిశీలనార్థం భద్రపరచాలి.

> విద్యార్థులు పొందిన మార్కులను ప్రోగ్రెస్ కార్డులందు నమోదుచేసి విద్యార్థుల తల్లిదండ్రులకు పంపాలి. తక్కువ ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. ఉపాధ్యాయుల మరియు తల్లిదండ్రుల సమీక్షా సమావేశంలో ఎఫ్ ఏ 1 నందు విద్యార్థులు చూపిన ప్రతిభపై చర్చించాలి.

DCEB :

ఉపాధ్యాయులకు సూచనలు –  పరీక్షలు నిర్వహించడానికి ముందుగా పాటించవలసిన సాధారణ సూచనలు

(పరీక్ష నిర్వహించే ముందు ఈ క్రింది సూచనలను సరిగ్గా చదవండి)

1. ప్రతి ఇద్దరి విద్యార్ధుల మధ్య తగినంత దూరంతో విద్యార్థులందరూ సరిగ్గా కూర్చున్నట్లు నిర్ధారించుకోండి.

2. విద్యార్ధులు తమ పెన్నులు/పెన్సిళ్లను బయటకు తీసి సిద్ధంగా ఉంచుకున్నారని నిర్ధారించుకోండి.

3. పరీక్ష పత్రాలను విద్యార్థులకు అందజేయండి.

4. పరీక్ష పత్రాలలో రెండు రకాల ప్రశ్నలు ఉంటాయి.

i) బహుళైశ్చిక ప్రశ్నలు – బహుళైశ్చిక ప్రశ్నలకి 2 నుండి 4 ఎంపికలు ఇవ్వబడతాయి, వాటిలో ఒక ఎంపిక మాత్రమే సరైన సమాధానాన్ని సూచిస్తుంది.

ii) ఎంపికలు లేని ప్రశ్నలు – ఈ ప్రశ్నలకి ఎంపికలు ఉండవు మరియు ఇటువంటి ప్రశ్నలకు మార్కులకు అనుగుణంగా సమాధానాలు వ్రాయవలసి ఉంటుంది.

5. ప్రశ్నల సంఖ్య గురించి విద్యార్థులకు ముందుగా తెలియజేయండి. పరీక్ష పత్రంలో ఈ సమాచారం పైన లేబుల్ లో ఇవ్వబడుతుంది.CBA-instructions-Telugu

6. సబ్జెక్టు వివరాలు, పరీక్ష ప్రారంభ సమయం మరియు ముగింపు సమయములు బ్లాక్ బోర్డుపై వ్రాయబడ్డాయని నిర్ధారించుకోండి.

7. విద్యార్థి యొక్క అన్ని వివరాలు: OMRపై విద్యార్థి ఐడి, విద్యార్థి పేరు, UDISE కోడ్ మరియు తరగతి ఇవ్వబడతాయి.

8. OMR షీట్లు అన్ని తరగతులకు ఒకేలా ఉంటుంది, 6 సబ్జెక్టులు: ఇంగ్లీషు, తెలుగు, హిందీ, గణితం, EVS/ విజ్ఞాన శాస్త్రం, సాంఘిక శాస్త్రం కలిగి ఉంటుంది. విద్యార్థులు, వారి యొక్క తరగతికి ఆధారంగా, సంబంధిత సబ్జెక్టులకు అనుగుణంగా సమాధానాలను గుర్తించాలి.

9. అన్ని పేపర్లకు పరీక్షా సమయం 1 గంట మాత్రమే. అవసరమైతే అదనంగా 30 నిమిషాల సమయం ఇవ్వండి.

10. అందించిన ఆన్లైన్ పోర్టల్లో విద్యార్థుల హాజరు వివరాలను పూరించండి.

11. సరైన OMR లేకపోయినా లేదా OMR పాడై పోయినా, మండల స్థాయిలో అందుబాటులో ఉన్న బఫర్ OMRని విద్యార్థికి అందజేయాలి. బఫర్ OMR షీటులో విద్యార్థుల వివరాలన్నీ మాన్యువల్గా నమోదు చేయాలి మరియు బబుల్ చేయాలి.

12. క్లాసూమ్ బేస్డ్ అసెస్మెంట్ -1 పూర్తయిన తర్వాత ఆన్సర్ కీ విడుదల చేయబడుతుంది.

13. ప్రశ్నపత్రాలపై టిక్ చేసిన లేదా బాక్స్ లో నమోదు చేసిన సమాధానాల ఆధారంగా, పేపర్లు దిద్దబడ్డాయని నిర్ధారించుకోండి. ఆపై CCE వెబ్సైట్లో మార్కులను అప్లోడ్ చేయండి.

14. OMR షీట్లపై డేటాను విశ్లేషించిన తర్వాత తరగతి మరియు సబ్జెక్ట్ వారీగా రెమిడియేషన్ తెలియజేయబడుతుంది.

Packaging Instructions :

1. అన్ని సబ్జెక్టుల అసెస్మెంట్ పూర్తయిన తర్వాత, ఉపయోగించిన OMR షీట్లు తరగతుల వారీగా విడివిడిగా ప్యాక్ చేయండి.

2. పాఠశాల స్థాయిలో, తరగతుల వారీగా ప్యాక్ చేసిన ప్యాకెట్లను ఒక పెట్టెలో ఉంచి, ఈ ప్యాకేజీలను MEOs కి పంపినట్లు నిర్ధారించుకోండి.

Specific Instructions for Test administration – Classes 1, 2 and 3 :

CBA instructions Telugu_page-00021. పరీక్ష పత్రంలో ఇచ్చిన లేబుల్ పై UDISE కోడ్, విద్యార్థి ID మరియు విద్యార్థి పేరు వివరాలను పూరించండి.

2. ప్రతి సబ్జెక్టులో అన్ని ప్రశ్నలను ఉపాధ్యాయులు గట్టిగా చదివి విద్యార్ధులకి వినిపించాలి.

3. ప్రశ్నాపత్రంలోని ఒక్కొక్క ప్రశ్నను గట్టిగా మరియు నిధానంగా చదివినట్లయితే, విద్యార్థులు సులభంగా అర్ధం చేసుకోవచ్చు.

4. ఒక ప్రశ్న చదవడం పూర్తయిన తర్వాత, విద్యార్థులు తమ ప్రశ్నాపత్రాల్లో సమాధానాలను గుర్తించడానికి తగినంత సమయం ఇవ్వండి. అవసరమైతే ప్రశ్నను మరలా ఇంకొక్కసారి చదివి వినిపించండి.

5. విద్యార్థులు, పరీక్ష పత్రాలలో వారు అనుకున్న సమాధానాలను సరిగ్గా గుర్తిస్తున్నారో లేదో నిర్ధారించుకోండి.

6. అదనపు సూచనలు లేదా సహాయం లేదా సమాధానాలకు సంబంధించిన క్లూలు విద్యార్థులకి ఇవ్వకూడదు ఎందుకంటే అది విద్యార్థులకు అదనపు సహాయాన్ని అందించవచ్చు.

7. బ్లాక్ బోర్డపై, పరీక్ష పత్రాలపై సమాధానాలను గుర్తించే పద్ధతిని విద్యార్ధులకి చూపండి.

8. ఎంపికలు లేని ప్రశ్నలకి, పరీక్ష పత్రాలలో సమాధానాలను స్పష్టంగా రాయమని విద్యార్థులకి తెలియజేయండి. పరీక్ష పూర్తయిన తర్వాత, పరీక్ష పత్రాలను తిరిగి తీసుకోండి. ప్రశ్నలకు సమాధానాలను విద్యార్థులు సరిగ్గా నింపారో లేదో చూసుకోండి.

9. సంబంధిత సబ్జెక్టు పరీక్ష పూర్తయిన తర్వాత, ఇన్విజిలేటర్ సంబంధిత సబ్జెక్ట్ కింద బాల్ పెన్నుని ఉపయోగించి OMRలలో విద్యార్థులు ప్రశ్నా పత్రాలలో వ్రాసి ఇచ్చిన బహుళైశ్చిక ప్రశ్నలకు సమాధానాలను గుర్తించాలి.

10. 3వ తరగతి EVS పరీక్ష వ్రాస్తున్నవారు, EVS/ సైన్స్ కాలమ్ కింద వారి సమాధానాలను గుర్తించాలి.

11. OMR షీట్లో విద్యార్థి సమాధానాలను గుర్తించేటప్పుడు, విద్యార్థి పేరు, విద్యార్థి ID అను వివరాలు పరీక్ష పత్రంపై పేరుతో సరిపోలుతున్నట్లు నిర్ధారించుకోండి.S

1. బోర్డుపై UDISE కోడ్ వ్రాసి, విద్యార్థి IDలు సిద్ధంగా ఉండేలా చూసుకోండి. అంతేకాకుండా పరీక్షకు ముందుగా విద్యార్ధులకు ఈ IDలు గూర్చి తెలిసేలా నిర్ధారించుకోండి.

2. విద్యార్థులు పరీక్ష పత్రంలో UDISE కోడ్, విద్యార్థి ID మరియు విద్యార్థి పేరు వివరాలను సరిగ్గా వ్రాసినట్లు నిర్ధారించుకోండి.

3. OMR షీటుపై UDISE కోడ్, విద్యార్థి పేరు మరియు విద్యార్థి ID వివరాలు ఇవ్వబడతాయి. కాబట్టి OMR షీటులను విద్యార్థులకు అందజేస్తున్నప్పుడు, ప్రతి విద్యార్ధి వారి సంబంధిత OMRని పొందారని నిర్ధారించుకోండి.

4. విద్యార్థులు, OMR షీటులను జాగ్రత్తగా నలపకుండా ఉంచేలా నిర్ధారించుకోండి.

5. విద్యార్థులు ప్రశ్న పత్రాలపై సమాధానాలను టిక్ చేసి, వాటిని సమాధాన పత్రాలపై సరిగ్గా బబుల్ చేస్తున్నారో లేదో నిర్ధారించుకోండి.

6. బ్లాక్ బోర్డపై, పరీక్ష పత్రాలపై సమాధానాలను గుర్తించే పద్ధతిని విద్యార్ధులకి చూపండి.

7. OMRలలో బహుళైశ్చిక ప్రశ్నలకు మాత్రమే సమాధానాలను గుర్తించాలని విద్యార్థులకు సూచించండి.

8. ప్రతి బహుళైశ్చిక ప్రశ్నకు 4 ఎంపికలు ఉంటాయని, వాటిలో ఒక ఎంపిక మాత్రమే సరైనదని విద్యార్థులకు సూచించండి.

9. బ్లాక్ బోర్డపై OMRని బబ్లింగ్ చేసే పద్ధతిని విద్యార్థులకి చూపండి. బబ్లింగ్ సరిగ్గా ఎలా చేయాలో విద్యార్ధులు అ చేసుకోవడం చాలా అవసరం. విద్యార్థులు సమాధానాలను సరిగ్గా బబ్లింగ్ చేస్తున్నారో లేదో తనిఖీ చేయండి.

10. ఎంపికలు లేని ప్రశ్నలకి, విద్యార్థులకి అందజేసిన సమాధాన పత్రాలలో సమాధానాలను వ్రాయమని విద్యార్థులకు సూచించండి.

11. పరీక్ష పత్రాలను విద్యార్థులకు అందజేసిన తర్వాత, విద్యార్థులు పరీక్షను ప్రారంభించే ముందు, ఒకసారి పరీక్ష పత్రాన్ని నిశ్శబ్దంగా చదవమని వారికి తెలుపండి.

12. సంబంధిత సబ్జెక్టు కింద సమాధానాలను గుర్తించాలని విద్యార్థులకు సూచించండి. ఉదాహరణకు: ఇంగ్లీషు సబ్జెక్టు యొక్క సమాధానాలను ఇంగ్లీష్ కాలమ్ క్రింద గుర్తించాలి.

13. 4 మరియు 5వ తరగతి విద్యార్థులకు, తెలుగు మరియు ఇంగ్లిష్ సబ్జెక్టులలోని ఉన్న పాసేజ్ లను మాత్రమే గట్టిగా చదివి వినిపించాలి. విద్యార్థులందరికీ అర్థమయ్యేలా పాసేజ్ని గట్టిగా మరియు నిధానంగా చదవాలి. అవసరమైతే ఆ భాగాన్ని మరలా ఇంకోసారి చదవి వినిపించండి.

14. పరీక్ష పూర్తయిన తరువాత ప్రశ్నాపత్రాలు, OMR షీట్లను తిరిగి తీసుకోండి. OMR షీట్లను ప్రతి పరీక్ష ముందు అందచేయవలసి ఉంటుంది.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top