మరో 8 వేల ఏకోపాధ్యాయ పాఠశాలలు - రేషనలైజేషన్‌తో పొంచి ఉన్న ప్రమాదం.
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య మరింతగా పెరగనుంది.
ఇప్పటికే సుమారు 8 వేల వరకు ఏకోపాధ్యాయ పాఠశాలలు రాష్ట్రంలో ఉన్నాయి. ఇప్పుడు మరో 8 వేల వరకు ఏకోపాధ్యాయ పాఠశాలలు కొత్తగా రానున్నాయి. దీంతో రాష్ట్రంలో సుమారు 16 వేల పాఠశాలలుగా సింగిల్ టీచర్‌గా మారనున్నాయి.
ప్రస్తుతం పాఠశాల విద్యాశాఖలో రేషనలైజేషన్ ప్రక్రియ జరుగుతోంది. ఈ ప్రక్రియలో 8 వేల పాఠశాలలు సింగిల్ టీచర్‌కే పరిమితం కాబోతున్నాయని అధికారులు లెక్కలు తేల్చినట్లు తెలిసింది. రేషనలైజేషన్‌లో భాగంగా ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 20 లోపు ఉంటే సింగిల్ టీచర్‌నే కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు జిఓ 117ను కూడా విడుదల చేసింది. విద్యాశాఖలో చేపట్టిన సంస్కరణల్లో భాగంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసిన విషయం తెలిసిందే.
5 వేల పాఠశాలలను విద్యాశాఖ విలీనం చేసింది. ఈ పాఠశాలల్లోని 3, 4, 5 తరగతుల విద్యార్థులను ఉన్నత పాఠశాలలకు పంపడంతో మిగతా విద్యార్థుల సంఖ్య 20లోపు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ విలీనం వల్ల సుమారు 4 వేల పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 20లోపే ఉనుట్లు విద్యాశాఖ తేల్చింది. విలీనం కాని మరో 4 వేల పాఠశాలల్లో కూడా విద్యార్థుల సంఖ్య 20 మంది లోపే ఉన్నట్లు గుర్తించింది. దీంతో ఇవి ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారనున్నాయి. ఇప్పటికే ఉన్న 8 వేల పాఠశాలలతో కలిపి మొత్తంగా 16 వేల పాఠశాలలు రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మిగలనున్నాయి. ఇప్పటికే సింగిల్ టీచర్ ఉన్న పాఠశాలల్లో బోధన సరిగ్గా సాగడం లేదని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయుడు అనారోగ్యం, ఇతర కారణాలతో సెలవులో ఉంటే ఆ పాఠశాలను మూసివేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పాఠశాల విద్యాశాఖ తీసుకొస్తున్న కొత్త కొత్త యాప్‌లలో సమాచారం నమోదు చేసేందుకు ఉపాధ్యాయులు నానా అవస్థలు పడుతూ బోధనపై దృష్టి సారించలేకపోతున్నారు.
ఎంటిఎస్ టీచర్లతో సర్దుబాటు :
సింగిల్ టీచర్ పాఠశాలల్లో మినిమం టైమ్‌స్కేల్ (ఎంటిఎస్) ఉపాధ్యాయులను నియమించి ఏకోపాధ్యాయ పాఠశాలలను ఉంచబోమని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. డిఎస్‌సి-1998, 2008లో అర్హత సాధించిన అభ్యర్థులను ఎంటిఎస్ విధానంలో విద్యాశాఖ తీసుకుంటోంది.
2008లో అర్హత సాధించిన అభ్యర్థులను ఎంటిఎస్ విధానంలో తీసుకుంది కేవలం 2,500 మంది లోపే. ప్రస్తుతం 1998 అభ్యర్థులను తీసుకునే ప్రక్రియ జరుగుతోంది. ఈ రెండింటితో కలిపి 6 వేల మంది కూడా వచ్చే అవకాశం ఉండదని అధికారులే చెబుతునాురు. అయితే వీరందరినీ ఈ పాఠశాలలకే కేటాయిస్తారా? మరోచోట కేటాయిస్తారా? అనే అంశం కూడా తేలాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ లో విద్య వ్యవస్థ గందరగోళం నెలకొంది.
0 Post a Comment:
Post a Comment