Thursday 1 September 2022

బయోమెట్రిక్ పడితేనే ఇక జీతభత్యాలు

బయోమెట్రిక్ పడితేనే ఇక జీతభత్యాలు      


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఇలా అన్నిచోట్ల ప్రజలకు అధికారులు, సిబ్బందిని అందుబాటులో ఉంచేందుకు కఠిన నిర్ణయాలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగా బయోమెట్రిక్, ఆన్ లైన్ అటెండెన్సును పక్కాగా అమలు చేసేలా ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై అధికారులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ బయోమెట్రిక్, ఆన్ లైన్ అటెండెన్సు పక్కాగావేస్తే తప్పా నెలాఖరుకి జీతబత్యాలు వచ్చే పరిస్థితితి లేదని తేల్చి చెప్పింది. అందుకోసం సెప్టెంబరు 1వ తేదీ నుంచి ఈ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని అన్నిశాఖలకు ఆదేశాలు జారీచేసింది.  ఈ విషయంలో ఏ ఒక్కప్రభుత్వశాఖకు వెసులుబాటు లేదని, ప్రభుత్వ కార్యాలయాలు పనిచేసే సమయంలో అధికారులతోపాటు, ఉద్యోగులూ ప్రజలకు అందుబాటులో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ విధానాన్ని అమలు చేయడం ద్వారా కార్యాలయాల పనివేళల్లో ప్రజలు ఏ పనిపై వచ్చినా వారికి సిబ్బంది అందుబాటులో ఉండి వారి పనులు సత్వరమే చేస్తారనేది ప్రభుత్వ ఆలోచనగా ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.

సచివాలయాల్లో 3సార్లు బయో మెట్రిక్ :

ప్రభుత్వ శాఖల్లో తొలిసారిగా తీన్ మార్ బయోమెట్రిక్ ను గ్రామ, వార్డు సచివాలయశాఖలో అమలు చేశారు. ఇక్కడ ఉద్యోగులు రోజులో మూడు సార్లు భయో మెట్రిక్ వేయాల్సి వుంటుంది. మొత్తం 19శాఖలకు చెందిన సిబ్బందిలో అత్యవసర పని ఉన్నప్పుడు తప్పా బయటకు వెళ్లే వీలులేకుండా ఏర్పాట్లను పక్కాగా అమలు చేస్తోంది. నెలలో హాజరు లో తేడాలు, తక్కువ వస్తే సదు ప్రభుత్వశాఖ జిల్లా, డివిజన్, మండల శాఖ అధికారుల నుంచి డ్యూటీ సర్టిఫికేట్ తెస్తే తప్పా జీతాల బిల్లులు కూడా సచివాలయాల్లో పెట్టడం లేదు. దీనితో రోజులో మూడు సార్లు బయోమెట్రిక్ వేసే తొలి ప్రభుత్వ శాఖగా గ్రామ,వార్డు సచివాలయశాఖ తొలిస్థానంలో ఉంది. చాలా చోట్ల పాత పంచాయతీ కార్యదర్శిలు, కొందరు సచివాలయ కార్యదర్శిలు బయో మెట్రిక్ హాజరు విషయంలో తేడాలు చేస్తున్నవారిని కూడా ప్రభుత్వం గుర్తించి ఒక్కొక్కరినీ ఇంటికి పంపే కార్యక్రమానికి కూడా తెరలేపింది.

విద్యాశాఖలో ఫేస్ రికగ్నైజేషన్ యాప్ :

విద్యాశాఖలో ఫేస్ రికగ్నైజేషన్ యాప్ తోపాటు, పిల్లల హాజరుని కూడా ఇకపై ఉపాధ్యాయులు ఆన్ లైన్ లో చేపట్టాల్సి వుంటుందని స్పష్టం చేస్తూ ప్రభుత్వం జీఓ కూడా జారీచేసింది. ఒక్క విద్యాశాఖలోనే ఉపాధ్యాయులు మొత్తం 13 రకాల యాప్ లలో డేటా ప్రతినిత్యం అప్లోడ్ చేయాల్సి వుంటుంది. పాఠశాలల్లో ఉపాధ్యాయులు పిల్లలకు పాఠ్యాంశాలు చెప్పే సమయం కంటే ప్రభుత్వం ఇచ్చిన యాప్స్ లలో డేటాను నమోదు చేయడానికే అత్యధిక సమయం పడుతోంది. అందులోనూ ఇన్ని రకాల యాప్ లు ఇచ్చిన ప్రభుత్వం ఎవరికీ సెల్ ఫోన్లు మాత్రం ఇవ్వలేదు. దీనితో ఉపాధ్యాయుల సొంత సెల్ ఫోన్లు కొనుగోలుచేసి ఒక ఫోన్ ను పాఠశాల యాప్ ల కోసం, మరో ఫోను వారి సొంత కార్యకలాపాలకోసం వినియోగించాల్సి వస్తున్నది. ప్రతినిత్యం చాలా అంశాలకు చెందిన ఫోటోలు, వీడియోలు తీసి అప్లోడ్ చేయాల్సి రావడంతో  ఫోన్ మెమొరీలు సైతం నిండిపోయి సొంత అవసరాలకు వినియోగించుకోలేని పరిస్థి ఏర్పడి ఒక్కొక్క ఉపాధ్యాయుడూ రెండు ఫోన్లు కొనాల్సి వస్తుందని వాపోతున్నారు. ఇపుడు ప్రభుత్వం ఆన్ లైన్ అటెండెన్సు యాప్ లోనే డేటాను అప్లోడ్ చేయాలని చెప్పడంతో పరిస్థితి మరింత జఠిలంగా మారింది.

నిబంధనలు పాటించకపోతే వేటు తప్పదు :

ప్రభుత్వ శాఖల సిబ్బంది, అధికారులు ఖచ్చితంగా ప్రభుత్వ యాప్ లను ఖచ్చితంగా వినియోగించాలి. ఫేస్ రికగ్నైజేషన్ యాప్ లోనే బయో మెట్రిక్ వేయాల్సి వుంటుంది. అలా కాకుండా నచ్చినట్టు చేయాలని చూస్తే ఇంటికి వెళ్లిపోవడానికి సిద్దపడాలి. మొన్నటి వరకూ పీహెచ్సీల్లో వైద్యులు, సిబ్బంది వారికి నచ్చినట్టుగా విధులు నిర్వహించేవారు ఇపుడు అక్కడ కూడా విధులకు ఎన్నిగంటలకు వస్తున్నారు..? ఎన్నిగంటలకు విధులు ముగించుకొని వెళుతున్నారు తదితర వివరాలు తెలుసుకునేందుకు ఆన్ లైన్ అటెండెన్సును ప్రభుత్వం ఖచ్చితంగా సెప్టెంబరు 1వ తేదీ నుంచి అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే మండల కార్యాలయాల్లో కూడా ఆన్ లైన్ అటెండెన్సు యాప్ లను అమలు చేయడానికి కార్యాచరణ సిద్ధం చేస్తుంది ప్రభుత్వం. అమలు చేసిన శాఖల వివరాలను రాష్ట్ర కార్యాలయంలోని డేష్ బోర్డు ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. పరిపాలనలో మార్పులు, చేర్పులు తీసుకు వచ్చి ప్రజలకు అన్ని ప్రభుత్వ శాఖలను అందుబాటులో ఉంచేలా చేయడంలో వడివడిగా అడుగులు వేస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే ప్రభుత్వ యాప్ లపై ఉద్యోగుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నవేళ అన్ని ప్రభుత్వ శాఖల్లో ఆన్ లైన్ అటెండెన్సు అమలు చేసే చర్యలు ముందు ముందు ఎలాంటి ఫలితాలు తెస్తాయనేది..!

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top