Saturday 25 June 2022

ఉద్యోగుల సేవా నిబంధనలు (Employee Service Rules) : సీనియారిటీ, ప్రమోషన్సు రిజిస్టర్లు

 ఉద్యోగుల సేవా నిబంధనలు (Employee Service Rules) : 

సీనియారిటీ, ప్రమోషన్సు రిజిస్టర్లు



సీనియారిటీ, ప్రమోషన్సు రిజిస్టర్ల గురించి తెలుసుకుందాం.

DSC లోని మెరిట్ ర్యాంకు, DOB ల సహాయంతోనూ, SC, ST,  PH, BC లకు కేటాయించిన రోష్టరు ప్రకారం తయారు చేసిన ప్రమోషన్ రిజిస్టర్నే మెరిట్ కం రోష్టరు రిజిస్టర్ అంటారు.

గౌరవ కోర్టువారు మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారమే సీనియారిటీ లిష్టు తయారు చేయాలని తీర్పులిస్తున్నారు. గౌరవ భారత సుప్రీం కోర్టు వారు మెరిట్కి,రోస్టర్ ర్యాంకుకు అన్యాయం జరగకుండా పదోన్నతులు ఇవ్వాలని తీర్పునిచ్చింది. APSSSR 1996 రూల్సు నందుకూడా 33 నుండి 37 వరకు మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం సీనియారిటీ లిష్టులు ఎలాతయారు చేయవలసి ఉందో స్పష్టంగా ఉన్నది.

1. సీనియారిటీ లిష్టులు మెరిట్  కమ్  రోస్టర్ ప్రకారం తయారు చేసి, దీని ఆధారంగా  ప్రమోషన్సు రిజిస్టర్ తయారు చేయాలి. ఈ ప్రమోషన్సు రిజిస్టర్లో ప్రమోషన్సులో రిజర్వేషన్లు ఉన్న SC, ST, PH  అభ్యర్థులను రోష్టర్లో పెట్టి ప్రమోషన్సు ఇవ్వాలి, SC,ST, PH, అభ్యర్ధులకు ప్రమోషన్సులో రిజర్వేషన్లు ఉన్నా ఫీమేల్ కోటాలేదు కనుక అంతా  జనరల్ అవుతారు.

2. సీనియారిటీ రిజిస్టర్ (లిష్టు): ఒకే సారి(DSC) లో సెలక్టు కాబడిన వారందరూ డేట్ ఆఫ్ జాయినింగ్ తో సంభందం లేకుండా మెరిట్ కమ్ రోస్టర్( DSC Appointment)ర్యాంకు  ప్రకారం సీనియారిటీ లిష్టులు తయారు చేయాలి, ఈ రిజిస్టర్ ప్రకారం SC, ST, PH అభ్యర్థులు లిష్టులో చివరలో ఎక్కడ ఉన్నా మెరిట్ కమ్ రోష్టరు ప్రకారం ప్రమోషన్సు పొందుతారు.

3.  ప్రమోషన్సు రిజిస్టర్: ప్రమోషన్సులో రిజర్వేషన్లు ఉన్న SC, ST, PH లకు  రోష్టరు పాయింట్లు అడక్వసీ నిబంధనలకు లోబడి  వర్తిస్తాయి.

SC :  2,7,16,22,27,41,47,52,62,66,72,77,87,91,97 - Total: 15

PH : 6,31,56 - Total : 3

ST : 8,25,33,58,75,83 - Total : 6

Grand Total (Roster): 24

మిగిలిన 76 పాయింట్లు అన్నీ ఓపెన్ కేటగిరీ క్రింద అందరికీ కలిపి (మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం) పదోన్నతులు ఇవ్వబడతాయి. ఈ ఓపెన్ కేటగిరీలో OC, BC, SC, ST,PH అభ్యర్ధులు అందరూ మెరిట్  కమ్ రోస్టర్ ర్యాంకు (DSC Appointment Rank) ప్రకారం ప్రమోషన్సు పొందుతారు, SC, ST, PH లు   నిర్ణీత కోటా మేరకు పదోన్నతి పొందితే వారి కోటాలో అడక్వసీ చేరుకున్నట్లు. అప్పుడు వారి యొక్క  రోష్టరు పాయింట్లు జనరల్ గామార్చబడుతాయి. ఇదంతా ప్రమోషన్సు రిజిస్టర్లో ఉంటుంది.

అడక్వసీ అంటే  "ఒక కేడర్ పోస్టులకు సంబందించి, ఆ కేడర్లో SC,ST ,PHఅభ్యర్థులు తమకు కేటాయించిన పర్సంటేజి మేరకు ఇప్పటికే పనిచేస్తూ ఉంటే ,ఆ కేడర్ లో అడిక్వసీ చేరుకున్నట్లు". అడిక్వసీ చేరుకుంటే తదుపరి ప్రమోషన్లకు రిజర్వేషన్ వర్తించదు.అప్పుడు వారి పాయింట్లు అన్నీ జనరల్‌ క్రింద మారతాయి. అప్పుడు అందరినీ కలిపి కామన్ గా మెరిట్ కమ్ రోస్టర్ (DSC Appointment Rank) ర్యాంకు ప్రకారం సీనియారిటి లిస్ట్ తయారు చేసి పదోన్నతులు ఇస్తారు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's need

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More
Top