Tuesday 28 June 2022

CM Jagan Review Meeting: విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ : సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

CM Jagan Review Meeting: విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ : సీఎం జగన్‌ కీలక ఆదేశాలు



విద్యాశాఖలో నాడు-నేడుపై సీఎం జగన్‌ సమీక్ష

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం విద్యాశాఖలో నాడు-నేడు, డిటిజల్‌ లెర్నింగ్‌పై సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో బైజూస్‌తో ఒప్పందం దృష్ట్యా విద్యార్థులకు సంబంధిత కంటెంట్‌ అందించడంపై సీఎం జగన్‌ చర్చించారు. అలాగే సెప్టెంబరులో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇవ్వడంపై సమీక్షించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తరగతి గదుల్లో డిజిటల్‌ స్క్రీన్ల ఏర్పాటుపై కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామన్నారు.. సెప్టెంబరులో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ ఇస్తామని, ఆ ట్యాబ్‌లో బైజూస్‌ కంటెంట్‌ను లోడ్‌ చేయాలని తెలిపారు. దీనికి తగినట్టుగా ట్యాబ్‌ స్పెసిఫికేషన్స్, ఫీచర్లు ఉండాలన్నారు ఇవి నిర్దారించాక ట్యాబ్‌ల కొనుగోలు ప్రక్రియ మొదలుపెట్టాలని పేర్కొన్నారు.. టెండర్లు పిలిచేటప్పప్పుడు నాణ్యత, డ్యూరబులటీని దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు.

8వ తరగతిలో ఇచ్చే ట్యాబ్‌ సంబంధిత విద్యార్థి తర్వాత చదివే తరగతులకు కూడా అంటే 9, 10 తరగతుల్లో కూడా పనిచేయాలని తెలిపారు. అందుకే నిర్వహణ కూడా అత్యంత ముఖ్యమని, ఏదైనా సమస్య వస్తే వెంటనే దాన్ని రిపేరు చేసే అంశాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలన్నారు. నిర్దేశిత సమయంలోగా ట్యాబ్‌లు పిల్లలకు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంచి కంపెనీలను పరిగణలోకి తీసుకోవాలని తెలిపారు.

ఇంకా ఏమన్నారంటే...

►అలాగే తరగతి గదిలో డిజిటల్‌ బోర్డులు, టీవీలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం.

►దీనికి సంబంధించి కార్యాచరణ కూడా రూపొందించండి:

►విద్యా నిపుణుల సలహా మేరకు కొన్ని తరగతుల్లో ఇంటరాక్టివ్, మరికొన్ని తరగతులకు టీవీ స్క్రీన్లు పెట్టేందుకు ప్రతిపాదిస్తున్నామన్న అధికారులు.

►ప్రతి తరగతి గదిలోనూ ఇవి ఉండేలా చూడాలని సీఎం ఆదేశం

తరగతి గదిలో డిజిటల్‌ స్క్రీన్, బ్లాక్‌ బోర్డులు.. వీటి అమరిక ఎలా ఉండాలన్న దానిపై కూడా ఆలోచన చేయాలన్న సీఎం.

►బోధనకు ఎప్పుడు, దేన్ని ఉపయోగించుకున్నా..  అందుకు అనుగుణంగా వీటి అమరిక ఉండాలన్న సీఎం.

►ఇప్పటికే డిజిటల్‌ స్క్రీన్లు, బోర్డులు వినియోగిస్తున్న తీరును పరిశీలించాలన్న సీఎం.

►వీటి వల్ల సైన్స్, మాథ్స్‌ లాంటి సబ్జెక్టులు పిల్లలకు మరింత సులభంగా చక్కగా అర్థం అవుతాయన్న సీఎం.

►వీటి వల్ల టీచర్ల బోధనా సామర్ధ్యం కూడా పెరుగుతుంది.

స్క్రీన్‌ మీద కంటెంట్‌ను హైలెట్‌ చేసుకునేలా, ఎనలార్జ్‌ చేసుకునేలా ఏర్పాటు ఉంటే బాగుంటుంది.

►డిజిటల్‌ స్క్రీన్లు, ప్యానెళ్ల ఆస్తుల భద్రతపైనా దృష్టి పెట్టాలి

►దీనికి సంబంధించి కూడా ప్రతిపాదనలు తయారుచేయాలి

ఈ సమీక్షా సమావేశానికి సీఎస్‌ సమీర్‌ శర్మ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌ సురేష్‌ కుమార్, సర్వ శిక్షా అభయాన్‌ ఎస్‌పీడీ వెట్రిసెల్వి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top