Learn A Word A Day Base Line Test నిర్వహణ - సూచనలు
ప్రొసీడింగ్స్ Rc.No.ESE 02/359/2022-SCERT dated: 24-04-2022 ప్రకారం 1 నుంచి 9 తరగతులకు మే 5 వ తేదీ న Learn A Word A Day Base Line Test అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో నిర్వహించబడును.
● ప్రశ్న పత్రం పరీక్ష రోజు ఉదయం జిల్లా విద్యా శాఖాధికారుల ద్వారా ప్రధానోపాధ్యాయులకు వాట్స్ ఆప్ ద్వారా అందించబడును .
● Learn A Word A Day కార్యక్రమం లో ఇవ్వబడిన పదాల మీద మాత్రమె ఈ పరీక్ష నిర్వహించబడును .
◆ లెవెల్ 1 లో 1,2 తరగతులకు ప్రశ్న పత్రం నాలుగు అంశాలలో 25 మార్కులకు ఉండును.
READING : ఇచ్చిన 5 పదాలను విద్యార్ధి చదవగలగడం(5 మార్కులు )
SPELLING : ఖాళీలు పూరించడం(10 మార్కులు).
MEANING : ఇచ్చిన తెలుగు పదాలకు విద్యార్ధి ఆంగ్ల పదాలు వ్రాయడం(5 మార్కులు).
WRITING : ఉపాధ్యాయుడు డిక్టేట్ చేసిన 5 పదాలను విద్యార్ధి వ్రాయడం(5 మార్కులు) .
◆ లెవెల్ 2 (3,4,5 తరగతులు విద్యార్ధులకు),
◆ లెవెల్ 3 (6,7,8 తరగతులు విద్యార్ధులకు ),
◆ లెవెల్ 4 (9 వ తరగతి విద్యార్ధులకు)
SYNONYMS : ఇవ్వబడిన వాక్యాన్ని అర్ధవంతమైన పదం తో పూరించడం (5 మార్కులు) బహుళైచ్చిక ప్రశ్నలు
SPELLING : ఖాళీలు పూరించుట మరియు తప్పు గా ఇవ్వబడిన పదాల స్పెల్లింగ్ సరి చేసి వ్రాయుట(10 మార్కులు) .
DICTIONARY SKILLS : ఇవ్వబడిన పదాలను ఆల్ఫా బెటికల్ ఆర్డర్ లో అమర్చుట (5 మార్కులు)
WORD USAGE : ఇవ్వబడిన పదాలను స్వంత వాక్యాలలో వ్రాయుట(5 మార్కులు) .
● ప్రశ్న పత్రం ప్రతి లెవెల్ కి ఆ లెవెల్ లో నేర్చుకున్న పదా లపై విడివిడి గా ఉండును.
● ఈ పరీక్షను ఆయా తరగతి ఉపాధ్యాయులు లేదా అందుబాటు లోని ఉపాధ్యాయుల కు DUTY కేటాయించి ప్రధానోపాధ్యాయులు నిర్వహించవలెను.
● ప్రశ్న పత్రమును బ్లాక్/గ్రీన్ బోర్డు మీద వ్రాయించడం ద్వారా పరీక్ష నిర్వహించవలెను.
● తరగతుల వారీగా మరియు సామర్ధ్యాల వారీగా మార్కులను పాఠశాల రిజిస్టర్ మరియు ఆన్లైన్ లో మే 20 వ తేది లోపు తరగతి ఉపాధ్యాయులు నమోదు చేయాలి .
0 Post a Comment:
Post a Comment