Tuesday 24 May 2022

ఉద్యోగుల మంచి కోసమే GPS. పాత పెన్షన్ విధానం సాధ్యం కాదు : సజ్జల రామకృష్ణారెడ్డి

 ఉద్యోగుల మంచి కోసమే GPS. పాత పెన్షన్ విధానం సాధ్యం కాదు : సజ్జల రామకృష్ణారెడ్డి



ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ (Joint Staff Committee) , జీవోఎంల (GOM) సమావేశం ముగిసింది.

జీపీఎస్ ప్రతిపాదనపై చర్చిద్దామని , ప్రభుత్వం సూచించగా పాత పెన్షన్ విధానంపైనే చర్చించాలని ఉద్యోగ సంఘాలు పట్టుబట్టాయి.

ఇదిలావుండగా పాత పెన్షన్ విధానం (Old Pension Scheme)సాధ్యం కాదన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.

జీపీఎస్‌లో (GPS) సవరణలకు సిద్ధంగా వున్నట్లు చెప్పారు.

ఉద్యోగులకు మంచి చేయాలనే జీపీఎస్ ఆలోచన చేశామని. సీపీఎస్‌లో (CPS) పెన్షన్‌కు భరోసా ఉండదని సజ్జల తెలిపారు.

అందుకే 33 శాతం గ్యారెంటీతో జీపీఎస్ ప్రతిపాదన చేశామని.. రాజస్ధాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు ఏ రాజకీయ కారణాలతో నిర్ణయం తీసుకున్నాయో తెలియదని రామకృష్ణారెడ్డి వెల్లడించారు.

ఈ సమావేశంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని పదహారు ఉద్యోగ సంఘాల నేతల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు.

సచివాలయ ఉద్యోగుల నిరసనలను ఈ సందర్భంగా మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు.

మంత్రి బొత్స సత్యనారాయణ (joint staff committee), ఆదిమూలపు సురేష్ (audimulapu suresh), ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala rama krishna reddy), ఉద్యోగ సంఘాల నేతలు ఈ మీటింగ్‌కు హాజరయ్యారు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top