Wednesday 30 March 2022

అసలు ఒంటి పూట బడులు , వేసవి సెలవులు ఎందుకు ? వేసవి సెలవులు ఉపాధ్యాయులకు నష్టమా లాభమా ?

అసలు ఒంటి పూట బడులు , వేసవి సెలవులు ఎందుకు ? వేసవి సెలవులు ఉపాధ్యాయులకు నష్టమా లాభమా ?



అపోహ : చాలా మంది ప్రజలకు ఉన్న అపోహ ఉపాధ్యాయులకు వేసవి వచ్చింది అంటే సెలవులు వారికేం హాయిగా ఇంట్లో వుంటారు అని. నిజానికి ఏ ఉపాధ్యాయులు వేసవి లో సెలవులు కావాలని అడగరు. ఆ వేసవి సెలవుల్లో జనాభా లెక్కలు అని ఎలెక్షన్లు అని ఏ పనులు వచ్చిన చేయడానికి ముందుకు వస్తారు.ఎంతోకొంత లబ్ది చేకూరుతుంది అనే ఉద్దేశ్యం తో ఎండాకాలం లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వలన విద్యార్థులు ఎక్కువ సమయం పాఠశాలలో ఉంటే ఒక గది లో ఫ్యాన్ లు ఉన్నప్పటికీ 20 నుండి 30 మంది చెప్పున్న ఉన్న ఎండ తీవ్రత వలన వేడి  ... ఎక్కువమంది ఒకే చోట కూర్చోవడం వలన వారి శరీరాల నుండి పుట్టే వేడి మరింత ఉక్కపోత పెరిగి పసిపిల్లలు చాలా ఇబ్బందులకు గురి అవుతారు. కాంక్రీటు నిర్మాణాలు పెరిగిపోవడం వలన ఎండ వేడిమి గ్రామాలలో పట్టణాలలో సాధారణం కన్నా ఎక్కువ నమోదు అవుతుంది. పాఠశాల కావడం వలన వారికి కలిగిన ఇబ్బంది ని ఇంట్లో చెప్పుకున్నట్టు చెప్పుకోలేరు. అలాగే పైన ఉన్న యూనిఫారం లేదా బట్టలను తీసేసి స్వాంతన పొందలేరు. *ఇవన్నీ ఆలోచించి వేసవిలో విద్యార్థుల క్షేమం దృష్ట్యా ఒంటి పూట బడులు... వేసవి సెలవులు ఇస్తారు తప్ప... ఉపాధ్యాయుల కోసం ఆలోచించి కాదు.

ప్రభుత్వం లో పనిచేసే ఉద్యోగులు రెండు రకాలు

1.వేసవి సెలవులు లేని  ఉద్యోగులు (Non vacational employee)

2.వేసవి సెలవులు కలిగిన ఉద్యోగులు (vacational employee)

1. వేసవి సెలవులు లేని ఉద్యోగుల(Non vacation al employee) :

వీరికి వేసవిలో సాధారణ,ఐచ్ఛిక, ప్రభుత్వ  సెలవులు తప్ప మిగిలిన ఉండవు.దీనికి గాని ప్రభుత్వాలు ఈ ఉద్యోగులకు ఒక నెల ఆర్జిత సెలవులను ఇస్తాయి... వీటిని సెలవుగా వాడుకొని వచ్చును.లేదా నెల రోజుల జీతం గా మార్చుకొని ధన రూపం లో పొందవచ్చు.

2. వేసవి సెలవులు ఉన్న ఉద్యోగులు (vacational employee) :

ఈ జాబితాలోకి వచ్చేవాళ్ళు ప్రభుత్వ ఉపాధ్యాయులు... వీరికి వేసవి లో సెలవులు ఉంటాయి.అవి కూడా ఎందుకు అంటే వేసవి లో ఎండ తీవ్రత ఎక్కువగా వుండడం వలన విద్యార్థులు వడదెబ్బకు, అనారోగ్య సమస్యలు కు గురి కాకుండా ఉండడానికి విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా చాలా.. చాలా... సమాలోచనలు చేసి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం. దీనివలన విద్యార్థులు  వేసవి తాపానికి గురికాకుండా వుంటారు... దీనివలన ఉపాధ్యాయులు లబ్ది పొందుతున్నట్టు కనిపించినా నిజానికి నష్టపోతున్నారు. ఎలా అంటే ఉపాధ్యాయులకు ఈ సెలవులు విద్యార్థులతో పాటుగా ఇవ్వడం వలన ప్రతి సంవత్సరం నాకు అందరూ ఉద్యోగులు పొందే నెల రోజుల ఆర్జిత సెలవులు నష్టపోతున్నారు. అంటే ప్రతి ఉద్యోగి సంవత్సరానికి 12 నెలలు పనిచేస్తే 12 నెలల జీతం +ఒక నెల ఆర్జిత సెలవులు =మొత్తం 13 నెలల జీత.అందుకుంటారు.(నెల రోజుల ఆర్జిత సెలవులను డబ్బుగా మార్చుకోవచ్చు) ఉపాధ్యాయులు మాత్రం 12 నెలల జీతం మాత్రమే అందుకుంటారు. అంటే ఒక నెల జీతం నష్టపోతున్నారు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top