Wednesday 16 March 2022

శ్రేష్ఠ పథకం ద్వారా అత్యున్నత విద్యకు ఆహ్వానం

 శ్రేష్ఠ పథకం ద్వారా అత్యున్నత విద్యకు ఆహ్వానం



 సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు

◆ 9,11 తరగతులలో ప్రవేశాలు

◆ దరఖాస్తుకు ఏప్రిల్ 12 తుది గడువు

శ్రేష్ఠ (స్కీం ఫర్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ హయ్యర్ క్లాస్స్ ఇన్ టార్గెటెడ్ ఏరియాస్ ) ద్వారా భారత ప్రభుత్వం ప్రతిభావంతులైన షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు  సిబిఎస్ఇ అఫిలియేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్స్ నందు పూర్తి ఉచితముగా అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యని  అందిస్తుందని సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు తెలిపారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తముగా ౩౦౦౦ మంది విద్యార్థులకు 9 వ తరగతి, 11 వ తరగతిలో ప్రవేశం కోసం అవకాశం కలిపించడం జరుగుతుందన్నారు.. షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల డ్రాప్ అవుట్ రేట్ ను నియంత్రించే ప్రయత్నం లో భాగముగా అర్హులైన విద్యార్థులకు ఈ అవకాశం ఉపకరిస్తుందని గంధం చంద్రుడు తెలిపారు. 

9 వ తరగతి లో అడ్మిషన్ పొందిన విద్యార్థులు 11 వ తరగతి వరకు, 11 వ తరగతి లో అడ్మిషన్ పొందిన విద్యార్థులు 12 వ తరగతి వరకు విద్యాబ్యాసం చేస్తారని, 12 వ తరగతి తరువాత పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనం పథకం,  టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ పథకం ద్వారా ఉన్నత విద్యని అభ్యసించేందుకు అవకాశం  లభిస్తుందన్నారు. https://jnanabhumi.ap.gov.in/ వెబ్ లింక్ ద్వారా పథకం మార్గదర్శకాలు లభ్యం అవుతాయని, https://shreshta.nta.nic.in/ వెబ్ లింక్ ద్వారా అర్హులైన విద్యార్థిని విద్యార్థులు ఏప్రిల్ 12 లోపు దరఖాస్తు చేసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు సూచించారు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top